కెసిఆర్ తో తలపతి విజయ్ బేటి

2023 లో రానున్న ఎన్నికల కోసం భారత దేశములోని అన్ని పార్టీలు చాల పోరాడుతూ ఉన్నాయి. వాటిలో ముఖ్యముగా కొన్ని రాజకీయ పార్టీలు మరియు కొంత మంది ప్రముఖ రాజకీయ నాయకులూ మరి కొంత ముందు అడుగు వేసి అలోచిస్తున్నారు.

వారిలో ముఖ్యంగా దేశ రాజకీయలలో దృష్టి పెట్టిన కెసిఆర్ ముందు వరుసలో ఉన్నాడు. ఎన్నికల  సమయం దగ్గర కొచ్చే కొలదీ దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా స్పీడ్ పెంచారు.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఆయన గత కొంత కాలంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే .ఈ నేపథ్యంలోనే తమిళ హీరో విజయ్ బుధవారం సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. వీరి భేటీ కి సంబంధించి పూర్తి వివరాలు బయటకు తెలియనప్పటికీ రాజకీయ అంశాలకు సంబంధించి వీరిద్దరి మధ్య జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

తాను మర్యాదపూర్వకంగానే సీఎంకేసీఆర్తో భేటీ అయినట్లు విజయ్ పేర్కొన్నారు. అయితే వీరి మధ్య అనేక రాజకీయ అంశాల గురించి చర్చ జరిగిందట. గత కొంత కాలంగా హీరో విజయ్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

సొంతంగా ఆయన రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు అది కాకుండా ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో 115 స్థానాల్లో విజయ్ అభిమాన సంఘం తరఫున అభ్యర్దులు పోటీకి దిగారు.

ఇందులో మొత్తం 45 మంది అభ్యర్థులు గెలుపొందారు, 13 చోట్ల ఏకగ్రీవంగా గెలిచారు, దీంతో పార్టీ పెట్టకుండానే ఆయన అభిమాన సంఘం ఎన్నికల్లో విజయం సాధించడం వంటివి ఆయన క్రేజ్ ను తెలియజేస్తున్నాయి.

ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోదించేందుకు గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటీవల ఓ సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన విజయ్ నిన్న కేసీఆర్ తో భేటీ అయ్యారు.

కాంగ్రెస్ బీజేపీలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయ్ ఆ రెండు పార్టీలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ తో బేటీ అయ్యారు. తాను రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎలా ఉంటుంది అనే అంశం పైన చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ పేరుతో ఆయన అభిమానులే విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో రాజకీయ ప్రచారాన్ని మొదలుపెట్టారు.

చాలాకాలం నుంచి రాజకీయ పార్టీ విజయ్ పెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Comment