హెల్మెట్ పెట్టుకున్నా కూడా 2000 రూ. జరినామా విధించడం !

హెల్మెట్ పెట్టుకున్నా జరినామా విధిస్తారు అంట, ఇది ఎక్కడ విచిత్రం, ఎవరు అయ్యిన హెల్మెట్ పెట్టుకోకుంటే జరినామా విధిస్తారు. ఎందుకు అంటే మన ప్రాణాలకి అపాయం కాకుండా రక్షణ కోసం, హెల్మెట్ ఉంటేనే మనిషికి రక్షణ, మనకి ఏమి అయిన ఈ హెల్మెట్ వలన మనకి మేలు కలుగుతుంది.

కానీ చాల మంది హెల్మెట్ ని చేతికి తగిలించుకొని పోతుంటారు మనం చూస్తుంటాం ఇలా చాల మందిని చూస్తాము, మరి కొంత హెల్మెట్ పెట్టుకొన్న వారు ఆ హెల్మెట్ కు ఉన్న క్లిబ్ సరిగ్గా పెట్టుకోరు ఇంకా అది పెట్టుకొంటే ఏమి పెట్టుకోకుంటే ఏమి? మనం చేసే పనులో కరెక్ట్ ఉండాలి,హెల్మెట్ మంచిగా పెటుకోవాలి. హెల్మెట్ పెట్టుకొన్న కూడా జరినామా వేస్తున్నారు ఆ సంగతి ఏంటో చూదం.

హెల్మెట్ సరిగా పెట్టుకోకపోతే రూ. 1000 వరకు పెనాల్టీ పడుతుంది. అంతేకాకుండా బీఐఎస్ మార్క్ లేని హెల్మెట్లు వాడటం వల్ల కూడా జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది.

టూవీలర్ రైడ్స్ అంటేనే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. అందువల్ల బైక్, స్కూటర్ నడిపే వారు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూనే వెహికల్‌ను నడపాలి.

హెల్మెట్ కచ్చితంగా ధరించాలి. ప్రభుత్వం కూడా రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలనే లక్ష్యంతో 1998 మోటార్ వెహికల్స్ యాక్ట్‌ను సవరించింది. దీంతో వాహనదారులు రూల్స్‌ను బ్రేక్ చేస్తే భారీ జరిమానాలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

హెల్మెట్ పెట్టుకోకపోయినా కూడా రూ.2 వేల జరిమానా పడుతుంది. ఒకవేళ హెల్మెట్‌ను సరిగా పెట్టుకోకపోయినా కూడా ఇదే పెనాల్టీ చెల్లించుకోవాలి. వాహనదారుడు టూవీలర్ నడుపుతూ హెల్మెట్ సరిగా పెట్టుకోకపోతే అంటే హెల్మెట్ స్ట్రాప్స్ లేదా బటన్ పెట్టుకోకపోతే అప్పుడు రూ. 1000 జరిమానా పడుతుంది.

బైక్ లేదా స్కూటర్ నడిపే వారు హెల్మెట్ పెట్టుకొని ఉంటే కచ్చితంగా స్ట్రాప్‌ను లాక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జస్ట్ హెల్మెట్‌ను స్ట్రాప్ లాక్ చేయకుండా పెట్టుకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఎగిరిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మరణించే అవకాశాలు కూడా ఉంటాయి.

అందుకే హెల్మెట్ పెట్టుకునేటప్పుడు కచ్చితంగా స్ట్రాప్‌ను లాక్ చేసుకోవాలి. అప్పుడు ప్రమాదం జరిగినా కూడా తలకు బలమైన గాయాలు తగలకుండా ఉంటాయి.

కొంత మంది వాహనదారులు హెల్మెట్‌ను చేతికి తగిలించుకొని వెళ్తుంటారు. కొంత మంది హెల్మెట్ పెట్టుకున్నా కూడా స్ట్రాప్ లాక్ చేసుకోరు. మరికొంత మంది హెల్మెన్‌ను బైక్ వెనకవైపు పెట్టుకుంటూ ఉంటారు. అందువల్ల ఇలాంటివి చేయకండి.

Leave a Comment