చైనా టెక్ దిగ్గజం షియోమీ తన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ Xiaomi 15 Ultraను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.ఈ ఫోన్ ముఖ్యంగా కెమెరా ఫీచర్ల పరంగా బ్రేక్‌థ్రూ టెక్నాలజీతో వస్తుండటం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఫోన్‌లో లైకా-ట్యూన్డ్ 200MP క్వాడ్ కెమెరా సెటప్ ఉండే అవకాశముంది.ప్రధాన కెమెరా అదనంగా భారీ సెన్సార్‌తో,5x పెరిస్కోప్ జూమ్ లెన్స్,అద్భుతమైన లో-లైట్ ఫొటోగ్రఫీ సామర్థ్యంతో ఉంటుంది.సెల్ఫీ ప్రేమికుల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందించనుంది.
Xiaomi 15 Ultra 6.73 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో 2K రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్,HDR10+ మరియు డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది.
ప్రాసెసర్‌గా Qualcomm Snapdragon 8 Gen 4 చిప్‌ను అందించనున్నారు.ఇది బలమైన పనితీరు,పవర్ ఎఫిషియెన్సీకి మారుపేరు. 12GB/16GB LPDDR5X RAM, 256GB/512GB UFS 4.0 స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉండే సూచనలు ఉన్నాయి.
ఈ ఫోన్ Android 15 ఆధారిత HyperOS పై రన్ అవుతుంది.5,500mAh బ్యాటరీ,120W ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని అంచనా.
ధర: ప్రారంభ ధర రూ. 74,999 (భారత మార్కెట్‌లో అంచనా ధర).
Xiaomi 15 Ultra ప్రీమియం ఫోన్ సెగ్మెంట్‌లో శక్తివంతమైన పోటీదారుగా నిలవనుంది.