తెలంగాణ లో జనసేనకు అధినేత పవన్ కళ్యాణ్ కు జెండాకు కొత్త ఉస్తాహం !

జనసేనకు అధినేత అయ్యిన పవన్ కళ్యాణ్ కు నల్లగొండలో జోరు పెంచారు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏపి మీద దృష్టి పెట్టేవారు ఇప్పుడు తెలంగాణ లోకూడా వెళ్ళినారు, తెలంగాణ లో నల్లగొండ జిల్లా లో పర్యటించారు.

PAWAN KALYAN :

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ జోరు పెంచారు. వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పావులు కదుపుతున్నారు. ఇప్పటివరకు ఏపీపై దృష్టి పెట్టిన ఆయన ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టారు. జనసైనికుల్లో జోష్‌ నింపేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో పవన్ పర్యటించారు. రోడ్డుప్రమాదంలో మృతి చెందిన కొంగరి సైదులు కుటుంబసభ్యులను ఓదార్చి, ఈసందర్భంగా రూ.5 లక్షల చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలతో ఆయన మంతనాలు జరిపారు. పార్టీ బలోపేతంపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై నేతలకు తెలియచేశారు. తెలంగాణలో జనసేన జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మూడో వంతు స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు పవన్‌ కళ్యాణ్. తెలంగాణలో గెలుపు ఓటములను జనసేన ప్రభావితం చేస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనసేన ఓట్లు ఉన్నాయని చెప్పారు ఈ సందర్భంగా తెలియచేసారు.

సామాజిక మార్పులు తన లక్ష్యమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  ఏపిలో అధికారం ఆశించలేదని తెలంగాణలో ఎలా ఆశిస్తాని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయాలకు తానే వ్యతిరేకమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలని  తెలిపారు. ఓటమికి కుంగిపోనన్నారు., తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

ఇప్పటివరకు ఏపీపై ఫోకస్‌ చేసిన ఆయన తెలంగాణలో పర్యటించడంతో రాజకీయాలు పెరిగినాయి. గతంలో ఎప్పుడు లేనివిధంగా తెలంగాణలో  రాజకీయంగా  పోటీ నెలకొంది TRS కు పోటిగా బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల సైతం ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేరారు. ఆయన ఒంటరిగా పోటీ చేస్తారా లేక ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తారా అన్న చర్చ జరుగుతోంది ఈ సందర్భంగా ఎన్నో విషయాలు చర్చలు జరుగుతున్నాయి.

Leave a Comment