శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం సమావేశాలు

శ్రీలంక భారతదేశం యొక్క దక్షిణ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. శ్రీలంక హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, పాక్ జలసంధితో చుట్టుముట్టబడి భారతదేశం మరియు మాల్దీవుల పరిసరాల్లో ఉంది. శ్రీలంక భౌగోళికంలో ఉత్తరాన తీర మైదానాలు మరియు అంతర్భాగంలో కొండలు మరియు పర్వతాలు ఉన్నాయి.

శ్రీలంక దక్షిణాసియాలో తలసరి ఆదాయములో  అతిపెద్ద GDPలలో శ్రీలంక ఒకటి. దుస్తులు, అల్లిక, నాన్ నిట్, మరియు కాఫీ, సుగంధ ద్రవ్యాలు వంటి ఉత్పతి లో కూడా ఆసియాలో టాప్ 5 స్టేజి లో ఉండేది.

రబ్బరు ప్రాసెసింగ్, టీ, కొబ్బరికాయలు పొగాకు మరియు ఇతర వ్యవసాయ వస్తువులు వంటి తయారీలో కూడా ఎప్పుడు ముందు ఉండేది. అలాగే అంతర్జాతీయ సంస్థ లో కూడా అధికార ప్రతినిది గా ఉంది. శ్రీలంక, లేదా సిలోన్, ఇది బ్రిటీష్ కాలనీగా ఉన్నప్పుడు తెలిసినట్లుగా, ప్రపంచంలోని అతిపెద్ద “టీ” ఉత్పత్తిదారులలో ఒకటి.

శ్రీలంకలో పరిస్థితులు క్షీణదశకు చేరుకున్నట్టు అర్థమవుతోంది. ప్రధానంగా టూరిజం రంగంపై ఆధారపడి మనుగడ సాగించే శ్రీలంకకు కరోనా సంక్షోభం పెనువిపత్తులా పరిణమించింది.

ఎక్కడికక్కడ లాక్ డౌన్ లతో శ్రీలంక పర్యాటక రంగం కుదేలు కాగా, విదేశీ మారకద్రవ్య నిల్వలు క్రమేపీ కరిగిపోయాయి. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశన్నంటుతుండగా, చమురు, ఔషధాలు, ఆహార పదార్థాలకు తీవ్ర కొరత ఏర్పడింది.

ఆర్థిక సంక్షోభం తో పోరాడుతున్న శ్రీ లంక 70 ఏళ్ల చరిత్రలో మొదటి సారిగా రుణాలను కట్టలేని పరిస్థితి ని తెచ్చుకుంది. ఈ దేశం కట్ట వలసిన 78 మిలియన్ డాలర్స్ కు సంబంధించి గ్రేస్ పీరియడ్ కూడా అయిపోవడంతో రుణాలను కట్టలేక పోయింది. దీంతో ఈ దేశము రుణాలను ఎగేసినట్టు ఆదికరముగా ప్రకటించారు.

దీని గురించి ఆ దేశ రిజర్వు బ్యాంకు గవర్నర్ తమ దేశ ముందస్తు దివాలా లో ఉందని తెలియ చేసాడు. వారు రుణాలను పునేర్వ వ్యేవస్తికరణ వరకు మేము చెలింపు చేయలేము. దీనినే ముందస్తు దివాలా అంటారు. వీటిల్లో సాంకేతిక నిర్వచనాలు ఉన్నాయి. వారి వైపు నుండి ఇది రుణ  ఎగవేతగా భావిస్తారు అని చెప్పాడు.

శ్రీలంక ఇప్పటికే ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు అవసరమైన అవుట్ బెయిల్ పై అంతర జాతీయ ద్రవ్య నిది సంస్త తో చర్చ జరుపు తోంది. గురువారం IMF ప్రతి నిది తో మాట్లాడుతూ ఈ చర్చలు మంగళ వారానికి పూర్తి కావచ్చని తెలియ చేసాడు.

శ్రీలంక ప్రభుత్వం తిరిగి నడిపేందుకు దీనికి సుమారుగా 4 బిలియన్ డాలర్లు అవసరం ఉంటుంది అని తెలియ చేసారు. శ్రీలంక సుమారుగా 50 బిలియన్ డాలర్లు విలువైన రుణాలను చేలించేందుకు వీలుగా పునర్ వ్యేవస్థ కరించాలని విదేశీ రుణాలను కోరుతోంది.

ఇప్పటికే ఈ దేశం కరోన కారణముగా పూర్తిగా దెబ్బ తిన్నది. అందులోను మరి విదేశీ మారక ద్రవ్యము కొరత, ద్రవ్యోల్బణం లో పెరుగుదల కారణముగా ఔషదాలు, ఇందనము కొరత సమస్యలు వచ్చాయి.

ఇవే కాక ఇంకా చదవండి

అస్సాం లో వరదలు చిక్కుల్లో ప్రజలు

కెసిఆర్ తో తలపతి విజయ్ బేటి

Leave a Comment