రియాన్‌ పరాగ్‌ జోరు తో రాజస్థాన్ గెలుపు !

వరుస విజయాలతో దూసుకుపోతున రాజస్థాన్ రాయల్ జట్టు నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా విజయం సాధించినది. ఇక విషయానికి వస్తే ముందు రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ తో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ లో దూకుడు మీద ఉన్న రాజస్థాన్ రాయల్ బాటింగ్ లో విఫలం అయినప్పటికీ బౌలింగ్ లో తమ శక్తి ఏంటో చూపించి ఈ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మంగళవారం జరిగిన పోరులో రాజస్తాన్‌ 29 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఓడించింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన  బెంగళూరు 19.3 ఓవర్లలో 115 పరుగులకే అల్ అవుట్ అయినది. కెప్టెన్‌ డుప్లెసిస్‌ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) దే అత్యధిక స్కోరు కుల్దీప్‌ సేన్‌ (4/20) రాణించగా           అశ్విన్‌ 3 వికెట్లు, ప్రసిధ్‌ కృష్ణ 2 వికెట్లు తీశారు.

ఇక ఈ మ్యాచ్ లో సిరాజ్  బౌలింగ్‌లోనే నాలుగు ఫోర్లు, అశ్విన్‌ అతని బౌలింగ్‌లోనే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చాడు. అయితే రాజస్థాన్ కు అసలు షాక్‌ తర్వాత ఓవర్లో తగిలింది.  ఒకానొక సమయంలో 44 బంతుల పాటు బౌండరీనే రాలేదు, ఇలాంటి స్థితిలో పరాగ్‌ ఆట రాజస్థాన్ కు గౌరవప్రదమైన స్కోరు అందించింది.

గత నాలుగు సీజన్లుగా రాజస్థాన్ తరఫున 37 మ్యాచ్‌లు ఆడినా 387 పరుగులే చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వచ్చిన పరాగ్‌ ఎట్టకేలకు చక్కటి షాట్లతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ రియాన్‌ పరాగ్‌ 31 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు అర్ధ సెంచరీ సాధించాడు.

ఇక ఈ మ్యాచ్ లో ఏ విషయములోను రాయల్ ఛాలెంజర్ బెంగుళూర్ తన సత్తాను చాటలేక పోయింది. ఇంతకు మునుపటి మ్యాచ్ లో కూడా బెంగుళూరు బ్యాటింగ్ మరియు బౌలింగ్ విషయములో ముందుకు వెళ్ళలేక పోయింది. ఇక ఈ మ్యాచ్ లో మంచి విజయంతో రాజస్థాన్ రాయల్ తిరుగు లేని విజయాలతో దూసుకు పోతుంది.

Leave a Comment