నడుం నొప్పి పోవాలంటే ఏం చేయాలి | Nadum Noppi Povalante Yem Cheyli In Telugu
ప్రస్తుతం చాలా మంది నడుం నొప్పితో బాధ పడుతున్నారు. ఈ నడుం నొప్పి వయస్సుతో సంబంధం లేకుండా వస్తుంది.నడుం నొప్పి తగ్గటానికి చాలా నివారణ మార్గాలు ఉన్నాయి. మనం ఇప్పుడు వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.
నడుం నొప్పి పోవటానికి చిట్కాలు | Nadum Noppi Povataniki Chitkalu
మన జీవన విధానంలో కొన్ని మార్పులను చేసుకోని, కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా నడుం నొప్పి తగ్గుతుంది. అవి ఏంటో తెలుసుకుందాం.
- నడుం నొప్పి ఉన్నచోట ఐస్ ముక్కలతో కాపడం పెట్టుకోవడం.
- 100 గ్రాముల గసగసాలను మేతగా నూరి పొడి చేసుకోవాలి.
అలా పొడి చేసుకున్నా పౌడర్ ని ఒక చెంచ తీసుకుని, ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తాగాలి.
ఇలా తాగటం వలన నుడుం నొప్పి చాలా వరకు తగ్గుతుంది. - ఒక గ్లాస్ పాలలో కొద్దిగా తేనె వేసుకొని రోజు తాగాలి. ఇలా చేయటం వలన నుడుం నొప్పి రాకుండా ఉంటుంది.
- నడుం నొప్పి ఎక్కువగా ఉన్నపుడు ఎక్కువగా పని చేయరాదు.
- నడుం నొప్పి ఉన్న చోట వేడి నీళ్ళతో కాపడం పెట్టుకోవాలి.
- నడుం నొప్పి ఉన్నవారు ప్రతి రోజు వ్యాయామాలు చేయాలి.
- నడుం నొప్పి ఉన్నచోట అల్లం పేస్ట్ ని కొంత సమయం ఉంచినా, ఈ నొప్పి చాల వరకు తగ్గుతుంది.
- రెండు కప్పుల నీటిలో చిన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసి,
అవి ఒక కప్పు అయ్యే వరకూ బాగా మరిగించుకోవాలి.
తర్వాత వడగట్టి, చల్లార్చి ,తేనె కలుపుకొని తాగితే నడుము నొప్పి తగ్గిపోతుంది. - తెల్ల చామంతి పూలతో కషాయం చేసుకుని తాగాలి.ఇలా చేస్తే నడుం నొప్పి కొంచం తగ్గుతుంది.
- నుడుం నొప్పి ఉన్నవారు ఎక్కువగా కంప్యూటర్ ముందు కుర్చోరాదు.
- కొబ్బరి నునేను కాస్త అంటే గోరు వెచ్చగా వేడి చేసి, నొప్పి ఉన్నచోట మసాజ్ చేసుకోవాలి.
ఇలా చేస్తే నొప్పి నుంచి కొంచంఉపసమనం లభిస్తుంది. - డ్రైవింగ్ చేసేటప్పుడు నడుం నిటారుగా పెట్టుకోవాలి, అంతే కాకుండా డ్రైవింగ్ చేసేటప్పుడు నడుం
వెనకాల అంటే సిట్ లో దిండు పెట్టుకోవాలి. - మీరు హ్యాండ్ బ్యాగ్‌లను ఉపయోగిస్తుంటే దానిని ఒకే వైపు వేసుకోకుండా మారుస్తూ వేసుకోవాలి.
- అధిక బరువులను ఎత్తరాదు.ఒక వేళా ఎత్తితే మీ కాళ్ళ పాదాలు భూమికి గట్టిగా ఆనించి,పొట్టని గట్టిగా బిగించి బరువులను ఎత్తాలి.
- పడుకునే సమయంలో ఎక్కువ మెత్తగా,లేదా గట్టిగా ఉండే పరుపులపై కాకుండా సమాంతరంగా ఉండే వాటిపై పడుకోవాలి.
- నడుం నొప్పి ఉన్నవారు పడుకునేటప్పుడు ఎక్కువసేపు బోర్ల పడుకోకూడదు.
- నడుం నొప్పి ఉన్నవారు ఐరన్ ఎక్కువగా ఉన్నవాటిని తినాలి
- నడుం నొప్పి ఉన్నవారు నిలబడేటప్పుడు చేతులను బిగ బట్టకుండా వదులుగా ఉండేలా చూసుకోవాలి.
- నిలబడేటప్పుడు తల,భుజాలు వెనక్కిగాని, ముందుకుగాని ఉండేలా చూసుకోవాలి.
- నుడుం నొప్పి ఉన్నవారు వెల్లకిలా పడుకున్నప్పుడుమోకాళ్ల కింద దిండు పెట్టుకుని పడుకోవాలి.
- ఇలా చేయటం వలన నడుం నొప్పి నుంచి కొంచం ఉపసమనం దొరుకుతుంది.
- నడుం నొప్పి ఉన్నవారు నొప్పి ఉన్నచోట విక్స్ ని రాసుకుని, కొంచం సేపు మసాజ్ చేసుకోవాలి.
- ఇలా చేస్తే నొప్పి కొంచం తగ్గుతుంది.
గమనిక :- ఫైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహనా కోసం ఇవ్వడం జరిగింది. మీకు నడుం నొప్పి ఉంటె వెంటనే డాక్టర్ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి