ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొన్ని వందల మృత దేహాలు

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొన్ని వందల మృత దేహాలు

ఉక్రెయిన్ 

ఉక్రెయిన్ తూర్పు ఐరోపాలోని ఒక దేశం. ఇది రష్యా తర్వాత ఐరోపాలో రెండవ అతిపెద్ద దేశం, ఇది తూర్పు మరియు ఈశాన్య సరిహద్దులుగా ఉంది. పవిత్ర డార్మిషన్ కైవ్ గుహలు లావ్రా అనే వాటికీ ప్రసిద్ది చెందింది. అలాగే ఇది ఒక అందమైన చిన్న తక్కువ జనభా కలిగిన దేశము. టూరిస్ట్ ప్లేస్ గా కూడా పేరు చెందినది. 

రష్యా

రష్యా ప్రపంచంలోని అతిపెద్ద దేశం యొక్క నేషన్స్ ఆన్‌లైన్ ప్రాజెక్ట్ ప్రొఫైల్. దేశం, అధికారికంగా రష్యా ఫెడరేషన్, దీనిని సాధారణంగా రష్యా అని పిలుస్తారు, ఇది పాక్షికంగా తూర్పు ఐరోపాలో మరియు పాక్షికంగా ఉత్తర ఆసియాలో ఉంది, ఇది ఉత్తరాన ఆర్కిటిక్ మహాసముద్రం సరిహద్దుగా ఉంది.

కొన్ని నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తూనే ఉంది. ఈ విద్వంస కాండలో ఉక్రెయిన్ తన దేశ ఆర్థిక మూలాలు దెబ్బ తినే విధముగా ఉన్నాయి, అలాగే జన ప్రాణ మరియు ఇతర నష్టాల వల్ల ఉక్రెయిన్ పరిస్థితి  దారుణముగా ఉంది. ఈ పరిస్థితి ని ఎదురుకోవడానికి  ఉక్రెయిన్ తన పోరాట పటిమ చూపిస్తోంది.

భీకర పోరాటం తర్వాత ఇటీవల మారియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణమారణకాండ వెలుగుచూసింది. మారియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ భవనం శిధిలాలు తొలగిస్తుండగా ఆ శిథిలాల క్రింద ఏకంగా 200ల మృతదేహాలు బయటపడ్డాయి.

 యుక్రెయిన్ కూడా రష్యాను ప్రతిఘటిస్తునే ఉంది. యుద్ధం ప్రారంభించిన సమయంలో కొన్ని వారాల పాటు సామాన్యుల వైపు దృష్టి పెట్టకుండా కేవలం యుక్రెయిన్ సైన్యంమీదనే యుద్ధం చేస్తోంది రష్యా. కానీ పోను పోను అమాయకులను మట్టుబెట్టడం మొదలుపెట్టింది.

అలా నివాసాలపై బాంబు దాడులు కొనసాగిస్తోంది, అలా రష్యా దాడులకు ప్రతిఫలంగా ఓ అపార్ట్ మెంట్ పై చేసిన దాడుల దాష్టీకం తాజాగా బయటపడిన ఓ నిజం ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేస్తోంది.

భీకర పోరాటం తర్వాత ఇటీవల మారియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణమారణకాండ వెలుగులో కి వచ్చింది. మారియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ భవనం శిధిలాలు తొలగిస్తుండగా ఆ శిథిలాల క్రింద ఏకంగా 200ల మృతదేహాలు బయటపడ్డాయి.

ఈ విషయాన్ని యుక్రెయిన్ అధికారులు మంగళవారం మే 24,2022 న వెల్లడించారు. మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయని తీవ్రమైన దుర్వాసన వస్తున్నాయని మేయర్ సలహాదారు పెట్రో ఆండ్రియుష్చెంకో తెలియ చేసారు.

రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మేరియుపోల్‌లోని ఓ అపార్ట్ మెంట్ శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి ముక్కుపుటాలు అదిరిపోయే అతి దర్వాసన వచ్చింది.

లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. రష్యా దాడుల్లో నగరంలో దాదాపు 21 వేల మంది మృతి చెందినట్టు యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.

సంచార దహనవాటికలతోపాటు సామూహిక పూడ్చివేతలు చేపడుతూ ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా రష్యా జాగ్రత్తపడుతోందని యుక్రెయిన్ ఆరోపిస్తోంది.

ఈనాటికి కూడా యుక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సీవియెరోదొనెట్స్క్, దాని చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టిన రష్యా దళాలు వాటిని పూర్తిగా బందిప చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను సిద్దం చేసాయి.

 స్విట్లోడార్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని తమ జెండాను ఎగురవేశాయి. కాగా, యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పైకి రష్యా 1,474 సార్లు క్షిపణులు వాడింది, వేర్వేరు రకాలకు చెందిన 2,275 క్షిపణుల్ని ఉపయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ గురించి తెలియ చెప్పారు.

ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాలలో పౌరులపై వ్యవస్థీకృత సామూహిక హత్యలు.  రష్యా కనికరం లేకుండా చొప్పించిన ఉక్రెయిన్ దేశముపై దాడులు ఇప్పటికి కొనసాగిస్తోంది.

Leave a Comment