అమెరికాలోని టెక్సాస్ లో చిన్న పిల్లల హత్యల సంఖ్య !

అమెరికా అనేది 50 రాష్ట్రాలతో కూడిన దేశం, ఇది ఉత్తర అమెరికా యొక్క విస్తారమైన భూభాగాన్ని కలిగి ఉంది, వాయువ్యంలో అలాస్కా మరియు హవాయి దేశం యొక్క ఉనికిని పసిఫిక్ మహాసముద్రంలో విస్తరించింది. ప్రధాన అట్లాంటిక్ తీర నగరాలు న్యూయార్క్, ప్రపంచ ఆర్థిక మరియు సంస్కృతి కేంద్రం మరియు రాజధాని వాషింగ్టన్, DC. మిడ్ వెస్ట్రన్ మహానగరం చికాగో ప్రభావవంతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది మరియు పశ్చిమ తీరంలో లాస్ ఏంజిల్స్ హాలీవుడ్ చిత్రనిర్మాణానికి ప్రసిద్ధి చెందింది.

అమెరికాలో ప్రపంచంలోనే 4వ పొడవైన నదీ వ్యవస్థను కలిగి ఉంది. అలాగే  US ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది. అమెరికన్ ఫ్లాగ్ 27 వెర్షన్లను కలిగి ఉన్న ఏకైక దేశము అమెరికా, ప్రపంచములోనే అతి ఎక్కువ టూరిస్ట్ ప్లేస్లు కలిగిన దేశము. అతి పెద్ద నది వ్యవస్థ కలిగిన దేశము.

అమెరికాలో కాల్పుల ఘటన అందరిని షాక్ కు గురి చేసింది. టెక్సాస్‌లోని ఎలిమెంటరీ స్కూల్ లో దుండగుడు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 18 మంది చిన్నారులతో సహా ముగ్గురు స్కూల్ సిబ్బంది చనిపోవటం జరిగింది.

మృతి చెందిన విద్యార్థుల వయస్సు 4 నుంచి 11ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో మరికొందరికి గాయాలయ్యాయి ఈ ఘటనపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. 18మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై బైడెన్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

దేశంలో శక్తివంతమైన తుపాకీ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు నిలబడాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

దేవుడి పేరుతో గన్‌ లాబీకి ఎదురు నిలబడబోతున్నాం అంటూ వైట్‌హౌజ్‌ నుంచి బైడెన్ ప్రసంగించారు. తీవ్ర విచారకరమైన ఈ పరిస్థితిని ప్రతి తల్లిదండ్రులకు, దేశంలోని ప్రతి పౌరునికి ఒక చర్యగా మార్చాల్సిన సమయం వచ్చిందన్నారు.   చనిపోయిన తన మొదటి భార్య, పిల్లలను బైడెన్ గుర్తు చేసుకున్నారు.

1972లో ఓ కారు ప్రమాదంలో బైడెన్‌ భార్య, కూతురు చనిపోయారు. 2015లో బైడెన్ కొడుకు కేన్సర్‌తో కన్నుమూశాడు. తల్లిదండ్రులకు పిల్లలు శాశ్వతంగా దూరమైతే కలిగే బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసునని అన్నారు.

అది వాళ్ల గుండెకు మాయని గాయమని తెలిపారు, తానైతే కొంతకాలం తీవ్రమైన క్షోభను అనుభవించానంటూ బైడెన్ చెప్పుకొచ్చారు.

గన్‌ కల్చర్‌ కట్టడికి ఘోస్ట్‌ గన్స్‌ చట్టం తీసుకొచ్చింది బైడెన్‌ ప్రభుత్వం అయితే దీనికి రాజకీయపరంగా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అక్రమ కంపెనీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు సెనేటర్ల వల్లే ఈ చట్టం అమలు చేయడం సాధ్యపడటం లేదని బైడెన్‌ ప్రభుత్వం అంటోంది.

మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారీస్‌ కూడా టెక్సస్ కాల్పుల ఘటనపై స్పందించారు, ఇలాంటి ఘటనలు ఇంకా చాలు అన్నారు ఇంతటితో ఆపాల్సిన అవసరం ఉంది అన్నారు.

దేశం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైందని హ్యారీస్ అన్నారు. మన గుండెలు బద్ధలు అవుతూనే ఉన్నాయని, చర్యలు తీసుకోవడానికే ధైర్యం చేయాలని కమలా హ్యారీస్ వ్యాఖ్యానించారు.

కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసు అధికారులు హతమార్చినట్లు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ వెల్లడించారు.

ఇవే కాక ఇంకా చదవండి

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొన్ని వందల మృత దేహాలు

అస్సాం లో వరదలు చిక్కుల్లో ప్రజలు

Leave a Comment