దేశంలో పెరుగుతున్న కరోనా ఫోర్త్ వేవ్..బీ అలర్ట్ అంటున్న ఆరోగ్య శాక !

కరోనా రాను రాను పెరుగుతూనే ఉంది. ఇప్పటి దాక తగ్గనే లేదు, అయితే మొదటి నుండి ఎప్పటి దాక వరుసుగా కేసులు పెరుగుతున్నాయి కానీ తగ్గలేదు. ఫోర్త్ వేవ్ రావడం వలన మనషుల్లో ఇంకా భయనదోలన ఎక్కువగా ఉంది. ఫోర్త్ వేవ్ వివిధ ప్రాంతాలలో రావడం జరిగింది. అలాగే మరణాలు సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నాయి.

ఎక్కువగా ఢిల్లీ, హర్యానా వంటి ప్రేదేశాలలో ఎక్కువగా ఉంది. దీని వలన మనషులకు కారోనా తొందరగా సోకే అవకాశం ఉంది అని వైదులు తెలియచేస్తున్నారు.

ఇండియాలో కరోనా కేసులు మరోసారి భారీగా పెరిగాయి. దేశంలో కొత్తగా 3,377 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 60 మంది మరణించారు. కరోనా నుంచి 2,496 మంది కోలుకున్నారు. దేశంలో 17,801 కరోనా కేసులు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,30,72,000 మందికి పైకి ఎగబాకింది, మరోవైపు దేశంలో కొవిడ్ మరణాలు 5,23,753కు చేరాయి. మరోవైపు  మంది మొత్తంగా 4,25,30,622 కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.

దేశంలో మళ్లీ కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వరుసగా రెండో రోజు 3వేలపైగా కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసులు 17వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 4,73,635 మందికి నిర్ధారణ పరీక్షలు చేపట్టగా  3,377 మందికి వైరస్ పాజిటివ్‌ తేలింది. అలాగే మహమ్మారి నుంచి మరో 2,496 మంది కోలుకున్నారు.

ఇక, ముందు రోజుతో పోల్చితే కేసులతో పాటు మరణాలు పెరిగాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 60 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ దేశంలో 5,23,753 మంది కరోనాకు బలయ్యారు.

మొత్తం 4,30,72,176 మంది వైరస్ బారినపడగా వీరిలో 4,25,30,622 మంది కోలుకున్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ప్రస్తుతం 17,801 యాక్టివ్ కేసులు ఉండగా రోజువారీ పాజిటివిటీ రేటు 0.71శాతానికి చేరింది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.63 శాతంగా ఉంది.

దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 83. 69 కోట్ల నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియంగా వేగంగా సాగుతోంది. మొత్తం 188.65 కోట్ల టీకా డోస్‌లను పంపిణీ చేశారు.

ఢిల్లీలో గురువారం కొత్తగా 1,490 మందికి వైరస్ నిర్ధారణ కాగా. కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాజధానిలో పాజిటివిటీ రేటు 4.62 శాతంగా ఉంది. ఢిల్లీలో 32,248 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు.
గత 24 గంటల్లో 1,000 మందికిపైగా కోలుకోగా యాక్టివ్ కేసులు 5,250గా ఉన్నాయి. వారం రోజుల నుంచి వరుసగా ఢిల్లీలో వెయ్యికిపైగా రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీతో సహా అన్ని రాష్రాలు అప్రమత్తమయ్యాయి.

అంతేకాదు మళ్లీ మాస్క్‌ పాటించేలా నిబంధనలు అమల్లోకి తీసుకు రావడమే కాకుండా భౌతిక దూరం పాటించాలని ఆదేశిస్తున్నాయి. మరోవైపు దేశంలో వేక్సినేషన్‌ ప్రక్రియ నిరాంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 187 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు అందించనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Leave a Comment