ఈ ఏడాది సూర్య గ్రహణం రేపు భారత్ లో కనిపిస్తుందా !

ఈ ఏడాదిలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 30న శనివారం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం భారత కాలమాన ప్రకారం ఏప్రిల్ 30న మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4. 07 గంటలకు ముగియనుంది, దాదాపు నాలుగు గంటల పాటు కొనసాగినా ఇది పాక్షిక సూర్యగ్రహణమే. ఇది అంటార్కిటికా, అట్లాంటిక్, దక్షిణ అమెరికాలోని నైరుతి భాగం, పసిఫిక్ మహాసముద్రంలో ఈ గ్రహణం కనిపిస్తుంది.

చిలీ, అర్జెంటీనా, ఉరుగ్వే, పరాగ్వే పశ్చిమ ప్రాంతం, బొలీవియ నైరుతి ప్రాంతం, పెరూ ఈశాన్య ప్రాంతం, బ్రెజిల్ ఆగ్నేయ ప్రాంతంలోని ప్రజలు మాత్రమే దీన్ని చూడగలరని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా తెలిపింది. గ్రహణాన్ని నాసా తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేయంది.

అయితే, భారత్‌లో మాత్రం దీని ప్రభావం ఉండదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చి ఆ నీడ సూర్యునిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది, సూర్యగ్రహణాలు అమావాస్య రోజునే సంభవిస్తాయి.

కానీ, ప్రతీ అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు, ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఇవి ఒకదాని తర్వాత ఒకటి రెండు వారాల గడువులోనే ఏర్పడటం ఆచర్యమైన విషయం.

ఏప్రిల్ 30న మొదటిన సూర్యగ్రహణం ఏర్పడిన 15 రోజులకే మే 16న చంద్రగ్రహణం ఏర్పడుతోంది. రెండో సూర్యగ్రహణం అక్టోబరు 25న ఏర్పడనుంది. ఆ తర్వాత రెండు వారాలకే నవంబరు 8న రెండో చంద్రగ్రహణం సంభవిస్తోంది. మొదటిది తప్పా మిగతా మూడు గ్రహణాలు ప్రభావం భారత్‌పై ఉంటుంది. వీటిని భారతీయులు చూడవచు.

భారతీయ జ్యోతిష పండితులు మాత్రం ఏప్రిల్ 30 నాటి సూర్య గ్రహణం శనివారం ఏర్పడుతోందని, హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అశుభంగా పరిగణిస్తారని అంటున్నారు. వైశాఖ మాసం కృష్ణ పక్షపు అమావాస్య రోజు నాడు సూర్యగ్రహణం ఏర్పడటం అరుదుగా సంభవిస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావం కొన్ని రాశులపై ఉంటుందని సూచిస్తున్నారు.

గ్రహణ కాలంలో గర్భిణులు కొన్ని నియమాలను తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భిణులు నిద్రపోకూడదని పెద్దలు చెబుతుంటారు. దీన్ని పాటించాల్సి ఉంటుంది.

అదే సమయంలో కత్తుల వంటి పదునైన వస్తువులను వాడకూడదనే నియమం కూడా ఉంది. గ్రహణకాలం ప్రారంబం అయ్యే ముందు ఆ తరువాత తప్పనిసరిగా ఆభ్యంగన స్నానం చేయాల్సి ఉంటుంది. నదీస్నానం మరింత శ్రేష్ఠమని పండితులు సలహా ఇస్తోన్నారు.

గ్రహణ సమయంలో గర్భిణులు సనాతన గోపాలమంత్రాన్ని పఠించాలి. మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం, సూర్యజపం, శివ పంచాక్షరీలను పఠించడం అత్యుత్తమం.

వంట వండటం, భోజనం చేయడం, ద్రవ పదార్థాలను స్వీకరించడం మంచిది కాదు. గ్రహణ కాలం ఆరంభానికి ముందే అవన్నీ ముగించాల్సి ఉంటుంది. మళ్లీ గ్రహణాణంతరం ఆభ్యంగన స్నానం, పూజలు చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు.గ్రహణానంతరం దేవాలయాన్ని సందర్శించితే మానసిక ప్రశాంతత్త లభిస్తుంది.

Leave a Comment