రికార్డు బద్దలు కొట్టిన విక్రం సినిమా !

తమిళ్ హీరో అయిన కమల్ హాసన్ ఎన్నో మంచి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొన్నాడు. తమిళ్ భాషలోనే కాకుండా ఇతర తెలుగు, కన్నడ భాషలో కూడా మంచి గుర్తింపు సాధించుకొన్నారు. ఆయన నటన అంటే అందరి ఇష్టం. కమల్ హాసన్ తమిల్ ఇండస్ట్రీలోకూడా ఎన్నో సినిమాలలో నటించడం జరిగినది.

తెలుగు, తమిల్ సినిమాలో కూడా నటుడిగా ఎనలేని మంచి పేరు సాధించ్చుకొన్నారు, కమల్ హసన్ తమిల్ సినిమాలో కొత్తగా వచ్చిన విక్రం సినిమా రికార్డు బద్దల కొట్టింది, ఈ సినిమాలో ఈయన ప్రధాన పాత్రలో వహించారు,  నాలుగు ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ ని షేక్ ఆడించారు. మొదటి రోజే 45కోట్లు పైగా రాణించక కొత్తగా 150 కోట్లను మర్క్ ను దాటించింది.

వీకెండ్‌ను బాగా క్యాష్‌ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విక్రమ్‌ దుమ్ము దులుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్‌ జూన్‌ 3 నుంచి 5 వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్‌ మూడో స్థానంలో ఉంది.

167 మిలియన్‌ డాలర్లతో టాప్‌ గన్‌ మావెరిక్‌ మొదటి స్థానంలో, 55 మిలియన్‌ డార్లతో జురాసిక్‌ వరల్డ్‌ డొమీనియన్‌రెండో స్థానంలో నిలవగా 21 మిలియన్‌ డాలర్లతో విక్రమ్‌ మూడో స్థానంతో పాగా వేసింది. కాగా జూన్‌ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విక్రమ్‌లో కమల్‌ యాక్షన్‌ సీన్స్‌తో అదరగొట్టాడు.

67 ఏళ్ల వయసులోనూ యంగ్‌ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫైట్స్‌ సీన్స్‌ చేయడం అందరిలోనూ మంచి ఉస్తాహం నింపినారు. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో విక్రమ్‌ హిట్‌ లిస్ట్‌ పేరుతో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ విడుదల చేశారు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లైన విక్ర‌మ్ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దుమ్ము రేపుతోంది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రెండు భాష‌ల్లోనే విడుద‌లైన ఈ చిత్రం మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మేర‌కు వ‌సూళ్ల‌ను సాధించ‌టం అనేది హాట్ టాపిక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. తెలుగు రాష్ట్రాలు స‌హా వ‌ర‌ల్డ్ వైడ్‌గా విక్ర‌మ్ మూవీ మూడు రోజుల క‌లెక్ష‌న్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

Vikram Movie Collection In Telegu 2022

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వసూళ్ళు :-

  • నైజాం – రూ. 2.46 కోట్లు
  • సీడెడ్ – రూ. 91 లక్ష‌లు
  • ఉత్త‌రాంధ్ర – రూ. 94 ల‌క్ష‌లు
  • ఈస్ట్ – రూ. 59 ల‌క్ష‌లు
  • వెస్ట్ – రూ. 40 ల‌క్ష‌లు
  • గుంటూరు – రూ. 49 ల‌క్ష‌లు
  • కృష్ణా – రూ. 45 ల‌క్ష‌లు
  • నెల్లూరు – రూ. 31 ల‌క్ష‌లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.55 కోట్లు షేర్ క‌లెక్ష‌న్స్ రాగా దీన్ని గ్రాస్ ప‌రంగా చూస్తే రూ. 12.26 కోట్లుగా ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 7.50 కోట్లు రావాలి. అంటే సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 0.95 కోట్లు రావాల్సి ఉంటది.

వ‌ర‌ల్డ్ వైడ్ విక్ర‌మ్ మూవీ గ్రాస్‌ క‌లెక్ష‌న్స్‌ :-

త‌మిళ నాడు – రూ. 64.50 కోట్లు

ఏపీ, తెలంగాణ – రూ. 12.26 కోట్లు

క‌ర్ణాట‌క – రూ. 11.02 కోట్లు

కేర‌ళ – రూ. 14.05 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – రూ. 2.35 కోట్లు

ఓవ‌ర్ సీస్ – రూ. 46.10 కోట్లు

మొత్తంగా చూస్తే విక్ర‌మ్ సినిమాకు వచ్చిన రూ. 150.28 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్లు వ‌చ్చాయి. విక్రం సినిమాకు ఈ విధంగా వసూళ్ళు రావడం జరిగినది.

Leave a Comment