భరతనాట్యం లో ఆహా అనిపించుకొన్న ముకేష్ అంబానీకి కాబోయే కోడలు !

ముకేష్ అంబానీ అనగానే అందరికి గుర్తుకు వచ్చేది, ఎక్కువ డబ్బు ఉన్న వ్యక్తి . ఈయనకు ఒకరోజుకు ఎన్నో కోట్ల ఆధికం వస్తుంది, Jio సంస్థ కు ఈయనే అధినేత అలాగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కూడా ఈయనే అధినేత, ఇలా ఎన్నో పెద్ద పెద్ద పారిశ్రమలకు కూడా ఈయనే అధినేత, ఈయనకు ఎన్నో వెలకట్టలేని ఆస్తులు ఉన్నాయి. అలాగే ఈ మధ్య జరిగిన ముకేష్ అంబానికి కాబోయే కోడలు భరతనాట్యం ఆడి అందరిని ఆకట్టుకొన్నది.

ముకేశ్‌ అంబానీ కాబోయే కోడలు రాధిక భరతనాట్యంతో ఆకట్టుకున్నారు. ముకేష్‌ అంబానీ రెండో తనయుడు అనంత్‌ అంబానీకి కాబోయే భార్య అయిన రాధికా మర్చంట్ భరతనాట్య ఆరంగేట్రం చేశారు. ముంబయిలోని కుర్లా కాంప్లెక్స్‌లో గల జియో వరల్డ్‌ సెంటర్‌లో భరతనాట్య ప్రదర్శన చేశారు.

ఈమె గోపికతో కృష్ణుడి నృత్యాలు, రాముడి కోసం శబరి ఎదురుచూపులు, చిన్నికృష్ణుడి అల్లరి ఘట్టాలతో నాట్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాది.

ఈమె నాట్య గురువు భావన ఠాక్రే వద్ద సుమారు ఎనిమిదేళ్లుగా భరత నాట్యం నేర్చుకొన్నది , ఆదివారం తన అరంగేట్రంలో అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాది.

ముందుగా వేదికపై ఉన్న దేవతల చిత్ర పటాలు, గురువుతో పాటు కార్యక్రమాన్ని వీక్షించే వారందరి నుంచి ఆశీస్సులను కోరుతూ ప్రదర్శన ప్రారంభంచేసారు.

రాధికా మర్చంట్‌ ఆడిన నాట్యాని చూసి అందరు మంత్రముగ్ధులై ప్రేక్షకులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అంబానీల కుటుంబంలో రాధికా మర్చంట్‌ రెండో భరత నాట్య కళాకారిణి కానుంది.

మొదటి భరత నాట్య కళాకారిణి అయిన ముఖేశ్‌ అంబానీ భార్య నీతా కూడా భరతనాట్య కళాకారిణి, దేశ విదేశాల్లోని తమ కంపెనీల బాధ్యతల్లో తీరిక లేకుండా ఉన్నా కూడా నీతా అంబానీ భరత నాట్యాన్ని సాధన చేస్తూనే ఉంటారు.

నీతా, ముఖేష్ అంబానీ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నారు. రాధిక మర్చంట్ శ్రీ నిభా ఆర్ట్స్‌కి చెందిన భావనా ​​థాకర్ శిష్యురాలు. శ్రీమతి భావనా ​​థాకర్ భారతీయ ప్రపంచానికి వెలకట్టలేని సహకారం అందించారు. నాలుగు దశాబ్దాల పాటు ఆమో శాస్త్రీయ నృత్య ప్రస్థానం సాగింది.

ఆమె ముంబై యూనివర్శిటీకి చెందిన నలంద ఇన్స్టిట్యూట్ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. శ్రీ నిభా ఆర్ట్స్ పేరుతో ఆమె అనేక సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు, దివ్యాంగుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఇంకా వారికి శిక్షణ అందించారు, దీనిని బట్టి ఆమె నిబద్ధత మరియు అంకితభావం గురించి చెప్పవచ్చు.

రాధిక మర్చంట్ కూడా దేశంలోని ప్రసిద్ధ వ్యాపార కుటుంబం నుండి వచ్చినా ఆమె. రాధిక మర్చంట్ యొక్క ఇన్విటేషన్ కార్డ్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాధిక మర్చంట్ డిసెంబర్ 18, 1994న జన్మించారు. రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్ యొక్క CEO అయిన వీరేన్ మర్చంట్ మరియు శైలా మర్చంట్‌ల కూతురు.

మర్చంట్ తన ప్రాథమిక విద్యను ముంబైలోని కేథడ్రల్ మరియు జాన్ కానన్ పాఠశాలలు మరియు ఎకోల్ మోంటియల్ వరల్డ్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి పాలిటిక్స్, ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని కూడా పొందారు.

ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ప్రొఫెషనల్‌గా పని చేయడం ప్రారంభించారు. తాజాగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లోని గ్రాండ్ థియేటర్‌లో ఆమె ఈ రోజు తన భరత నాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు.

ఆమె తల్లిదండ్రులు వీరన్, శైలా మర్చంట్, ముఖేష్ మరియు నీతా ఆమె అరంగేట్రానికి హోస్ట్ చేస్తున్నారు. అంబానీ కుటుంబం గురించి కూడా ఆహ్వానంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్‌ కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ యాక్టర్స్, రాజకీయ నాయకులు, వ్యాపార ప్రముఖులు తరలివచ్చారు. రాధిక తొలి నాట్య ప్రదర్శనను చూసి ఆశీర్వదించారు.

అంబానీ, మర్చెంట్‌ కుటుంబాలు అతిథులకు సాదర స్వాగతం పలికాయి. రాధిక మర్చంట్‌ గత ఎనిమిదేళ్లగా భరతనాట్యం నేర్చుకుంటున్నారు. 2019లో అనంత్‌ అంబానీతో ఆమెకు నిశ్చితార్థం జరిగింది.

Leave a Comment