చరణ్ శంకర్ కలయిక లో కొత్త చిత్రం పేరు పై ఆసక్తి

చరణ్ శంకర్ కలయిక లో కొత్త చిత్రం పేరు పై ఆసక్తి

సౌత్ లో చాల popular అయి ఇప్పుడు నార్త్ సైడ్ కూడా మంచి పేరు తెచ్చుకొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్హగా చేస్తున మూవీ RC 15 ఇది సౌత్ ఇండియన్ సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్సీ15’. ఎప్పటి నుంచో ఈ చిత్ర టైటిల్ పై ఆసక్తి నెలకొంది.

ఇక పోతే చిరుత సినిమాతో తన సినిమాలో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన మొదటి సినిమా తోనే ఎంతో మంచి పేరు తెచ్చుకొన్నాడు. సూపర్ స్టార్ రజిని కాంత్ వంటి వారితో ప్రసంసలు అందుకొన్నాడు. ఆయన చరణ్ గురించి ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉన్న నటుడు చేసినట్టు ఉంది అని తన అభిప్రయం తెలియ చేసాడు.

రామ్ చరణ్ తన రెండవ సినిమా మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు, అలాగే చరణ్ ఈ సినిమా కు ఫిలిం ఫేర్ అవార్డు అందుకొన్నాడు. ఈ సినిమాలో చరణ్ గుర్రపు స్వోర్రి మరియు తన నటనతో అందర్ని ఆక్కట్టు కొన్న్నాడు. ఆ తర్వాత వచ్చిన ఎవడు మరియు నాయక్, రంగ స్తలము, ధ్రువ ఈ మద్య వచ్చిన RRR సినిమాలు తన సత్తా ఏంటో చూపాయి. రంగస్తలము సినిమాకు సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు మరియు గోల్డెన్ వుడ్ అవార్డ్స్ అందు కొన్నాడు.

RRR సినిమాతో రామ్ చరణ్ టోటల్ ఇండియన్ సినిమా హీరోగా తన పేరు సంపాదించుకొన్నాడు. ఇప్పుడు అతను ఇండియా లో ని ఏ ప్లేస్ కు వెళ్ళిన రామ్ చరణ్ అంటే అందరికి RRR సినిమా లో అల్లూరి సీతారామరాజు పాత్ర గుర్తు కు వచ్చేలా అలాగే బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్ గా చాల బాగా చేసాడు. చరణ్ నటన ముఖ్యముగా నార్త్ ఇండియాన్స్ కి చాల పిచ్చిగా నచ్చింది. నార్త్ లో  చరణ్ ఎక్కడుకు వెళ్ళిన బ్రహ్మ రథం పడుతున్నారు.

సౌత్ ఇండియన్ సెన్సేషన్ డైరెక్టర్ శంకేర్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు, అతను చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యాయి, కొన్ని చిత్రాలు అపజయమ వచ్చిన తన పేరు మాత్రమూ తగ్గలేదు. అతను డైరెక్ట్ చేసిన కొన్ని మంచి పేరు తెచ్చుకొన్న మూవీస్ జీన్స్,  బాయ్స్,  ఒకే ఒక్కడు, భారతీయుడు, రోబో, రోబో 2.0  మరియు ఇప్పుడు రాబోతున్న RC 15 చాల అంచనల మద్య వస్తోంది. శంకేర్ కు అపరిచితుడు మరియు భారతీయుడు సినిమాలకు ఫిలిం ఫేర్ అవార్డ్స్ వచ్చాయి.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సౌత్ ఇండియన్ సెన్సేషన్  డైరెక్టర్ శంకర్  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్సీ15’.హీరోయిన్ గా కియారా అద్వానీ (Kiara Advani) నటిస్తోంది.  భారీ బడ్జెట్ తో ఈ పొలిటికల్  డ్రామాను తెరకెక్కిస్తున్నారు శంకర్. గతేడాది ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఒక్కో షెడ్యూల్ పూర్తి చేస్తూ వస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ మూవీకి సెన్సేషనల్ డైరెక్టర్ థమన్ (Thaman) సంగీతం అందిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ చిత్ర టైటిల్ పై అభిమానులు, ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొని ఉంది.

ఈ సందర్భంగా RC15 టైటిల్ పై తాజాగా ఓ క్రేజీ బజ్ క్రియేట్ అయ్యింది. చిత్ర షూటింగ్ శరవేగంగా పూర్తవుతున్న సందర్భంగా ప్రస్తుతం మేకర్స్, డైరెక్టర్ శంకర్ టైటిల్ అనౌన్స్ చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇందుకోసం మేకర్స్ మూడు సాలిడ్ టైటిల్స్ ను పరిశీలించారట. వాటిలో ఆల్రెడీ ఓ టైటిల్ ను కన్ఫమ్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే అఫిషియల్ గా టైటిల్ ను అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో టైటిల్ ఎలా ఉండనుందోనని అభిమానుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు షెడ్యూళ్లను పూర్తి చేశారు దర్శకుడు శంకర్. కొంతకాలంగా అప్పుడప్పుడు వస్తున్న లీక్ లతో సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. ఇక టైటిల్ అనౌన్స్ మెంట్ తర్వాత చిత్రంపై మరింతగా అంచనాలు పెరగనున్నాయి. ఎందుకంటే శంకర్ తన ప్రతి సినిమాకు ప్రకటించే టైటిల్స్ సినిమాలోని సింహాభాగపు కథాంశాన్ని తెలిపేవిగా ఉంటాయి. నిర్మాత దిత్ రాజు తన సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ పై 50వ చిత్రంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 2023లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Comment