రాంచరణ్ ఆర్ఆర్ ఆర్ మూవీ లో రామ్ చాల బాగా నటించారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించడం మన అందరికి తెలుసు. ఆ సినిమా మంచి రికార్డు స్థాయిలో లో కూడా పేరు దకిన్చుకోంది. అయితే ఒక పక్కన ఆర్ఆర్ఆర్ సినిమా నటిస్తున్న ఇంకోపక్క ఆచార్య సినిమాలో కూడా నేను నటించిన, ఈ రెండు సినిమాలలో నటించడానికి నేను చాల ఇబ్బంది గా ఫీల్ అయ్యిన అని ఈ విధంగా పేర్కొన్నాడు రామ్ చరణ్.
ఆచార్య” ప్రమోషన్లను స్టార్ట్ చేశారు టీం. తాజాగా రామ్ చరణ్, కొరటాల శివ ఇద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులు చెర్రీ, చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో బిజీగా ఉన్నప్పుడే ‘ఆచార్య’ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి వచ్చింది. మాములుగా జక్కన్న తన సినిమా పూర్తయ్యేదాకా హీరోలను బయట ప్రాజెక్టుల్లో అడుగు పెట్టనివ్వడు. మరి చెర్రీ రెండు సినిమాలను ఎలా మేనేజ్ చేశారు ? అనే సందేహం అందరిలో కలిగింది. తాజా ఇంటర్వ్యూలో దీనికి సమాధానం ఇచ్చారు చరణ్.
ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ RRRతో బిజీగా ఉండడంతో డేట్స్ లేనప్పటికీ ‘ఆచార్య’లో కీలక పాత్ర పోషించడానికి సమయాన్ని ఎలా తీసుకున్నాడో వెల్లడించాడు. తాను, దర్శకుడు శివ ఈ విషయమై రాజమౌళిని సంప్రదించడానికి చాలా భయపడ్డామని, సహాయం చేయమని చిరంజీవిని కోరినట్లు చరణ్ వెల్లడించాడు. భారమంతా మెగాస్టార్ పై వేయడంతో ఆయన వెళ్లి రాజమౌళిని కలిసి, చరణ్ ‘ఆచార్య’ను పూర్తి చేయడానికి కొన్ని రోజులు విడిచి పెట్టమని ఒప్పించారట. అంతేకాకుండా తండ్రీ కొడుకులిద్దరినీ ఒకేసారి స్క్రీన్‌పై చూడాలనేది తన తల్లి కోరిక అని రామ్ చరణ్ వెల్లడించాడు. ఇక చెర్రీ, కొరటాల ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “ఆచార్య” చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఇందులో చిరు తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిరు, రామ్ చరణ్ ప్రమోషన్స్ షురు చేశారు. తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొన్న రామ్ చరణ్ తన తండ్రితో కలిసి ‘ఆచార్య’లో నటించిన అనుభవాలను పంచుకున్నాడు. తాను ఈ చిత్రంలో నటించడమే కాదు షూటింగ్ జరుగుతున్నంత కాలం ప్రతి నిమిషం తన తండ్రి చిరంజీవితో కలిసి ఉండటం తనకు చాలా భావోద్వేగపూరితమైనదని చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. నాకూ, డాడీకి షూటింగ్‌కి వీలుగా ఉండేలా ఒక డబుల్‌బెడ్రూం ఇంటిని ఇచ్చారు. అక్కడ దాదాపు 20రోజులు నేను, డాడీ కలిసి నిద్రలేవడం, కలిసి భోజనం చేసేవాళ్లం. ప్రతీ రోజు మార్నింగ్ 5:30 గంటలకు లేచి కలిసి వర్కవుట్ చేశాం. రోజూ కలిసి షూటింగ్‌కు వెళ్లేందుకు రెడీ అయ్యేవాళ్లం. అలానే సెట్స్‌లో ఇద్దరం కలిసి పని చేశాం. షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఒకే కార్‌లో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేవాళం. ఈ క్షణాలన్నీ నాకు ఎంతో మధురమైనవి, నాన్నతో ప్రయాణం చేస్తున్న దాని గురించి నా ఫీలింగ్స్‌ను మాటల్లో వర్ణించలేను.
ఇక రామ్ చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం పాన్ ఇండియా లెవల్లో బ్లాక్‌బస్టర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవలే దర్శకుడు శంకర్‌తో చేస్తున్న చిత్రంపై ఫుల్‌గా ఫోకస్ పెట్టి జెట్‌స్పీడ్‌లో షూటింగ్ కొనసాగిస్తున్నాడు రామ్. ఈ సందర్భంగా రామ్ చరణ్ తను ఎదురుకొన్న సమస్యలు తెలియచేసారు.
ఇవి కూడా చదవండి :