అమ్మాయిలు అంటేనే ఎవరు అయిన చిన్న చూపు చూస్తారు, దేనిలో కూడా అమ్మాయి అంటేనే ముందుకు రానివ్వరు, అమ్మాయి అంటే అలాఉండాలి ఇలా ఉండాలి అని చెప్పుతారు, దేనిలో కూడా సపోర్ట్ చేయరు, అమ్మాయి అంటేనే ఏమి చేయరు ఏది కూడా సాధించారు అని అంటారు, కానీ ఈ మాటలు అన్న వారికి అంత ఒక గుణ పాఠం చెప్పిన ఒక ఆణిముత్యం.
అమ్మాయి అంటే ఏమి అయిన చెయ్యగలదు అని సాధించి చూపించింది. అమ్మాయి అంటే ఆట వస్తువు కాదు ఆటం బాంబు అని తెలియచేసింది ఒక మహిళా, ఆ మహిళా ఎవరో చూదం.
నిజామాబాద్ నుండి ప్రపంచంలోని అగ్రస్థానానికి బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఎంతోమంది అమ్మాయిలకు నమ్మకం నిలుస్తుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన ఐదో భారతీయ మహిళా బాక్సర్‌గా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ గురువారం రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఆమె ప్రయాణం చాలా మందికి ప్రేరణనిస్తుంది.
నిజామాబాద్‌లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ లో ఛాంపియన్ గా నిలిచే దృఢ సంకల్పం వెనుక పురుషులతో సమానంగా మహిళలు కూడా పోరాడాలన్నది తెలియజేయాలనే నిర్ణయం ఉంది. దానికోసం ఆమె ఎన్నో కష్టాలను అనుభవించింది.
స్త్రీలు, పురుషులతో సమానంగా కఠినంగా ఉంటారని నిరూపించాలనుకునే మొండి యువ క్రీడాకారిణిగా ఆమె తన ప్రయాణాన్ని సాగిందని నిఖత్ తండ్రి జమీల్ అహ్మద్ కుమార్తె పట్టుదల గురించి చెప్పారు. తల్లిదండ్రులుగా, మేము చాలా సంతోషంగా మరియు గర్వపడుతున్నాము, కష్ట సమయాల్లో ఆమెకు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక నిజామాబాద్ లోని బాక్సింగ్ కోచ్ షంషుద్దీన్ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ పట్టుదల ఎంతో మందికి ప్రేరణ అంటూ పేర్కొన్నారు. 2008లో, నిఖత్ అబ్బాయిలతో ఆడుకోవడం చూసి నేను ఆమెను గ్రౌండ్‌కి తీసుకెళ్లానని, అక్కడ మైదానంలోని బాక్సింగ్ శిబిరాన్ని చూసిన ఆమె అందులో మహిళలు ఎవరు ఎందుకు లేరు అని ప్రశ్నించిందని పేర్కొన్నారు.
అయితే బాక్సింగ్‌లో గాయాలు, చేతి పిడికిలి కి ఇబ్బందులు ఉంటాయని తాను చెప్పానని, అయినా సరే తాను బాక్సింగ్ చేస్తానంటూ మొండిగా బాక్సింగ్ రింగ్ లోకి దిగిందని పేర్కొన్నారు.
ఈ కాలంలో కూడా నిఖత్ జరీన్ అనేక కష్టాలను ఎదుర్కొంది. ఆమె 2017లో ఆల్ ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌లో భుజం ఎముక పక్కకు కలగడంతో శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది, అది ఆమెను ఒక సంవత్సరం పాటు రింగ్‌కు దూరంగా ఉంచింది.
ఆ సమయంలో గాయం వల్ల మానసికంగా మరియు శారీరకంగా నిఖత్ కృంగిపోయింది. కానీ సంవత్సరం తర్వాత మరింత ఉత్సాహంతో శిక్షణను ప్రారంభించింది. బాక్సింగ్ ఛాంపియన్ కావడానికి ఆమె కఠినమైన శిక్షణ ను తీసుకోవాల్సి వచ్చింది.
2018లో నేషనల్స్‌లో పోటీ పడ్డ జరీన్ ఆపై ఆసియా క్రీడలు మరియు కామన్వెల్త్ గేమ్‌లలో ఓటమిపాలైంది. కానీ అది తనను ప్రేరేపించిందని తన విజయం తర్వాత నిఖత్ వెల్లడించింది, ఆమె ఆసక్తి మరియు ఆత్మవిశ్వాసం, సాధించాలనే పట్టుదల ఆమె ఇప్పుడు ఉన్న స్థానానికి చేరుకోవడానికి సహాయపడింది. ప్రపంచ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగుర వేయాలి అనే ఆమె సంకల్పమే ఆమె ప్రత్యేకత’ అని ఆమె కోచ్ చాల గర్వంగా చెప్పారు.