అబ్దుల్ కలాం కోట్స్ మీ అందరి కోసం!

అబ్దుల్ కలాం కవితలు|Abdul Kalam Quotes In Telugu

అబ్దుల్ కలాం:-నాకి తెలిసి అబ్దుల్ కలాం అంటే తెలియని వారు ఎవ్వరు ఉండరు.  అబ్దుల్ కలాం న్యూస్ పేపర్ బాయ్ లా పనిచేసి కష్టపడిచదువుకున్నాడు. ఒక  గొప్ప శాస్త్రవేత్తగా మారి మన దేశ స్పేస్ ప్రోగ్రాం అభివృధ్ధికి చాలా కృషి చేసారు. ఇతని పూర్తి పేరు అవుల్ పకీర్ జైనులబ్ధీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం 1931 వ సంవత్సరం అక్టోబర్ 15 న రామేశ్వరం లోని ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. 2002 వ సంవత్సరంలో అధికార పార్టీ బీజేపీ మరియు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెసు మద్దతుతో భారత 11 వ అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు 

ఇప్పుడు మనం అబ్దుల్ కలాం గారు తెలిపిన కొన్ని కోట్స్ గురించి తెలుసుకుందాం.

అబ్దుల్ కలాం కవితలు|Abdul Kalam Quotes In Telugu

 1. సక్సెస్ అంటే… మీ సంతకం ఆటోగ్రాఫ్ గా మారడమే…!
 2. అపజయాలు తప్పులు కావు.అవి భవిష్యత్తుకు పాఠాలు
 3. క్రింద పడ్డావని ఆగిపోకు,తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే…
 4. కలలు కనండి… వాటిని సహకారం చేసుకోండి.
 5. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల మీద నుంచి ఎదగడం నేర్చుకోవాలి.
 6. హృదయంలో నిజాయితి ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది.
 7. చిన్న విజయాన్ని చూసి మురిసిపోవద్దు.. అది తొలి అడుగు మాత్రమే..గమ్యం కాదు.
 8. మాన పుట్టుక సాధారణమైనదే కావచ్చు…. మరణం మాత్రం చరిత్ర సృస్టించేదిగా ఉండాలి.
 9. కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది.
 10. పొట్ట ఆకలి తీరేందుకు ఆహరం తినాలి,మెదడు ఆకలి తీర్చేందుకు విషయన్వేషణ చేయాలి.
 11. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు.కానీ, మీ అలవాట్లను మార్చుకోగలరు.
 12. మీ ప్రయత్నం లేకపోతే..మీకు విజయం రాదు.కానీ, మీరు ప్రయత్నిస్తే..ఓటమి రాదు.
 13. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా, అది గెలుపే అవుతుంది.
 14. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలి పెట్టకు.
 15. ప్రతి టీచరు.. ఒకప్పుడు విద్యార్థేప్రతి విజేత.. ఒకప్పుడు ఓడినవాడేప్రతి నిపుణుడు.. ఒకప్పుడు ప్రారంభికుడేకానీఅందరూ దాటి వచ్చింది.. నేర్చుకోవడం అనే వారధినే.
 16. క్సెస్ స్టోరీలను చదవకండి అందులో కేవలం మెస్సేజులు మాత్రమే ఉంటాయి.. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి.. అందులో విజయానికి కావాల్సిన ఐడియాలు దొరుకుతాయి.
 17. కష్టాలు అనుభవించాక వచ్చే విజయాలు ఎంతో తృప్తినిస్తాయి
 18. నీ విజయానికి అడ్డుపడేది, నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో  ఎప్పటికీ విజయం సాధించలేవు.
 19. మీ లక్ష్యాన్ని విజయవంతం చేయడానికి, మీ లక్ష్యం పట్ల మీకు ఒకే మనస్సు గల భక్తి ఉండాలి.
 20. జీవితంలో ఎన్ని హెచ్చు తగ్గులు వచ్చినా, మీ ఆలోచనలే మీ మూలధనంగా ముందుకు సాగాలి.
 21. ఇతరుల్ని ఓడించడం సులువే కానీ వారి మనసులను గెలవడం కష్టం.
 22. ఘనవిజయాలను సాధించడానికి అంకిత భావంతో పనిచేయండి.
 23. మనస్పూర్తిగా పని చేయనివారు జీవితంలో విజయాన్ని సాధించలేదు.
 24. కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువ ఏంటో తెలుస్తుంది.
 25. అందం ముఖంలో ఉండదు.సహాయం చేసే మనసులో ఉంటుంది.
 26. నువ్వెప్పుడూ జ్ఞానం అనే సముద్రంలో ముత్యంలా మెరవాలి.
 27. మీ కల నిజం కావాలంటే ముందు మీరు ఉన్నతమైన కలగనాలి. దానికై శ్రమించాలి.
 28. జీవితంలో గొప్ప విజయాలు పొందాలంటే ఇబ్బందులు పడక తప్పదు.
 29. గొప్ప గొప్ప మేధావులును చూడాలంటే, ఒకసారి తరగతి గదిలోని చివరి వరసలో వెతికి చూడు…
 30. మీరు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే, ముందు అంతటి వేడిని మీలో నింపుకోవాలి
 31. కింద పాకుతూ ఎంతకాలం బ్రతుకుతారు. మీకున్న రెక్కలతో పైకి లేచే ప్రయత్నం చేయండి.
 32. మనం కోతుల ముందు అరటిపండ్లు మరియు సంపదను ఉంచితే అవి అరటిపండ్లే తీసుకుంటాయి ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు అదే విధంగా మనుషులను డబ్బులు కావాలా ఆరోగ్యమా అంటే డబ్బులు అంటున్నారు కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు.
 33. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది, ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది, ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది, ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాతలను సృష్టించుకునేది మీరే.
 34. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించుకొనేందుకే వచ్చాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని.
 35. విజ్ఞానం మనల్ని శక్తి వంతుల్ని చేస్తే మంచి వ్యక్తిత్వం మనపైగౌరవం కలిగేలా చేస్తుంది.
 36. సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనిపిస్తుంది.
 37. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది.
 38. మీరు చేసే తప్పులే మీకు ఉత్తమ గురువులు. అవి నేర్పే పాఠాలే మీరు నేర్చుకోవలసిన జీవిత పాఠాలు.నీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి అవి తప్పులు కావు భవిష్యత్తులో మీరేం చేయరాదో తెలిపే పాఠాలు.
 39. ప్రపంచాన్నినువ్వు చూడటం కాదు ప్రపంచమే నిన్ను చూడాలి.
 40. నీకో లక్ష్యం ఉండటమే కాదు దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి.
 41. ఒక మంచి పుస్తకం వందమంది మిత్రులతో సమానం ,కానీ ఒక మంచి స్నేహితుడు ఒక గ్రంధాలయంతో సమానం.
 42. మనందరికీ సమానమైన ప్రతిభ ఉండకపోవచ్చు. కానీ, మన ప్రతిభను అభివృద్ధి చేసుకోవడానికి మనందరికీ సమానమైన అవకాశం మాత్రం ఉంది.
 43. మీరు చేసిన తప్పులే మీకు ఉత్తమ గురువులు.
 44. మీ ఆలోచనలే మీ మూలధనం, మీ తెగింపే మీ మార్గం, మీ శ్రమే మీ సమస్యలకు పరిష్కారం
 45. విజ్ఞానం పునాది లేని ఇంటిని సైతం నిలబెడుతుంది. కాని అజ్ఞానం ఎంతో దృఢంగా కట్టిన ఇంటిని కూడా పడగొడుతుంది.
 46. మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందేవరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎదురుచూడటం కష్టంగానే ఉంటుంది. కాని దాన్ని పొందలేక పోయినప్పుడు కలిగే బాధను భరించటం మరింత కష్టంగా ఉంటుంది.
 47. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైనవారిని వదిలేయటం ఉత్తమం.
 48. నీ విజయానికి అడ్డుపడేది..నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము.
 49. క్కొక్కసారి క్లాస్ లకు బంక్ కొట్టి స్నేహితులతో ఆనందంగా గడపండి. ఎందుకంటే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ జ్ఞాపకాలే మనకు ఆనందాన్ని కలిగిస్తాయి తప్ప మార్కులు కాదు.
 50. మన సృష్టికర్త మన మనసుల్లో,వ్యాక్తిత్వల్లో అపారమైన శక్తిసామర్ధ్యాల్ని నిక్షిప్తం చేసాడు. వాటిని తరచి వెలికి తీసి వృద్ధి చెందించుకోవడానికి ప్రార్ధన సహకరిస్తుంది.

ఇవి కూడా చదవండి :-

 

Leave a Comment