జీవితం(Life) Quotes మీ అందరి కోసం !

జీవితం Quotes| Life Quotes In Telegu 2022

జీవితం Quotes:- జీవితం అంటే ఏంటో మనకు చుదువుకునే రోజుల్లో తెలియదు.మనకి ఉద్యోగం వచ్చిన తర్వాత మన  జీవితం ఏంటో మనకి  తెలుస్తుంది., లైఫ్ అంటే ఏంటో, మన చుట్టూ పక్కల వారి  నుండి ,ఫ్యామిలీ, మరియు స్నేహితులు నుంచి  తెలుసుకొంటాం. జీవితం గురించి చాలా కవితలు ఉన్నాయి వాటిలో కొన్నింటిని క్రింద తెలియచేసాము.

జీవితం Quotes| Life Quotes In Telegu 2022

 1. కాలం కంటే విలువైనది ఏది లేదు, దాన్ని దుర్వినియేగం చెయ్యకూడదు.
 2. మీరు గెలిచేంత వరకు మీ కథను ఎవ్వరు పట్టించుకోరు.
 3. గెలుస్తామనే నమ్మకం ఉన్నవారు తప్పకుండా విజయం సాదిస్తారు.
 4. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే.. మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ.. మన కోసం తెరచిన తలుపును చూడకుండా వదిలేస్తాం.
 5. మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి.
 6. మీ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ఇప్పుడే  కష్టపడాలి.
 7. నిరంతరం వేలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి బయపడుతుంది.అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి బయబడుతుంది.
 8. కాలం విలువ తెలియనివాడు,జీవితం విలువ అర్థం చేసుకోలేడు.
 9. జీవితం చాలా కష్టమైన పరిక్ష, దానిలో చాలా మంది విఫలం చెందటానికి కారణం, ప్రతి ఒక్కరి ప్రశ్న పత్రం వేరని గ్రహించకపోవటం.
 10. నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే,నీవు ఎప్పుడూ చేయని కృషిని చేయాలి.
 11. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు.దానిని వృద్ది చేయటానికి అయి ఉండాలి.
 12. మీ కలలను చెప్పవద్దు చేసి చూపించండి
 13. మీరు కష్టపడనంతవరకు కలలు సాధ్యం కావు
 14. బాధపడటం వల్ల రేపటి సమస్యలు తొలగిపోవు నేటి ఆనందం దూరమవుతుందంతే.
 15. ఓటమి గురించి భయపడటం మొదలుపెడితే నువ్వు విజయానికి దూరమైనట్లే.
 16. తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు,తుది శ్వాస విడుస్తూ ఎదిపిస్తావ్,రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం.
 17. నమ్మకం అనేది ఒక బలం,ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు.
 18. ఒక్క అడుగు ప్రారంభిస్తే వేయి మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది.
 19. ఆలస్యం అవుతుందని పనులను ఆపవద్దు.ఎందికంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి.
 20. ఆశని ఎప్పుడు కోల్పోవద్దు.మన ఈ రోజుటి ఆశయాలే మనం ఉహించని రేపటి వాస్తవాలు.
 21. నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
 22. ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం  ఆపినప్పుడు  నువ్వు  నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.
 23. మనం జరిగిపోయిన దాన్ని వెనక్కి వెళ్లి మార్చలేకపోవొచ్చు కానీ జరగబోయేదాన్ని కచ్చితంగా మార్చవచ్చు.
 24. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేదు. కాబట్టి సోమరితనాన్ని దగ్గరికి చేరనివ్వకండి.
 25. మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము.
 26. ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత.. నువ్వు చేసిన పనుల గురించి కాకుండా.. చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి.
 27. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో.. తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి.
 28.  సక్సెస్ సాధించేందుకు ఓ మంచి ఫార్ములా అయితే.. నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చేలా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా : హెర్బర్ట్ బయార్డ్ స్వోప్
 29.  జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే.. ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి.
 30. జీవితంలో అన్ని నిబంధనలను పాటిస్తే.. అది అందించే ఫన్‌ని ఎంజాయ్ చేయలేం.
 31. గొప్ప పనులను చేయలేనివారు చిన్న పనులను గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు.
 32. ఒక్కళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు మార్చుకోకు….సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి.
 33. చాల మంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే కారణం బలం లేక కాదు,తెలివి లేక కాదు,అబద్దం ఆడలేక, మోసం చేయలేక ఓడిపోతున్నారు.
 34. ఒక్కక్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే….ఒక్కక్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.
 35. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు… ఆనందంగా జీవించడం.
 36. సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు.
 37. మనిషికి కాలం విలువ తెలుసు. డబ్బు విలువ తెలుసు. స్వేచ్ఛ విలువ తెలుసు. బంధం విలువ తెలుసు. ప్రాణం విలువ తెలుసు. కానీ … ఇన్ని తెలిసిన మనిషికి ఎందుకు సాటి మనిషి విలువ తెలియడం లేదు!
 38. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది.
 39. నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికన్నా అబద్దాలు చెప్పి ఆకట్టుకునేవాళ్లనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్ళకే ఎక్కువ విలువ ఇస్తుంది.
 40. మన క్షేమాన్ని కోరేవాళ్ళు.. వీధి దీపాల్లాంటివారు .! గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా, దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు.
 41. కాళ్ళు తడవకుండా సప్త సాగరాలను దాటవచ్చేమో కానీ, కళ్ళు తడవకుండా సంసారసాగరాన్ని మాత్రం దాటలేము….!
 42. రూపాన్ని చూసి మోసపోకు,రూపాయిని చూసి మోసపోకు…రూపమైనా, రూపాయి అయినా శాశ్వితం కాదు…మనస్సులోని ప్రేమభిమానాలే శాశ్వితం…!
 43. ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు జీవించామన్నది ముఖ్యం కాదు .. ఆయా సంవత్సరాలలో ఎంత ఆనందంగా జీవించామన్నదే ముఖ్యం.
 44. జీవితంలో మనం గెలుపు కంటే.. ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
 45. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి.. ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు.
 46. ఎంతో ఆకలితో ఉన్నా సింహం గడ్డిని మేయదు. అలాగే కష్టాల పరంపర చుట్టూ ముట్టినా ఉత్తముడు నీతి తప్పడు.
 47. చీకటి తరువాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తరువాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి.
 48. విజయమే జీవితం కాదు ఓడిపోవడమంటే అన్ని కోల్పోవడమూ  కాదు గెలుపోటముల్ని సమానంగా స్వీకరించడమే జీవితం.
 49. ప్రయత్నం చేసి ఓడిపో  కానీ ప్రయత్నం చెయ్యడంలో ఓడిపోవద్దు.
 50. విద్య అంటే మనలో సమాచారం నింపేది కాదు, జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేది.

ఇవి కూడా చదవండి:-

 

Leave a Comment