స్నేహం కవితలు| Friendship Quotes In Telugu
స్నేహం కవితలు:- స్నేహం గురించి మాటల్లో చెప్పలేం.అలాంటి స్నేహం గురించి కొన్ని కోట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
- స్నేహం అంటే ఆడుకోవడం కాదు,ఆదుకోవడం.వాడుకోవడం కాదు,వదులుకోలేకపోవడం
- మన ఆట పాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు.
- నీ చిరునవ్వు తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నీళ్ల విలువ తెలిసిన మిత్రుడు మిన్న.
- కులమత బేధం చూడనిది, పేద, ధనిక బేధం లేనిది, బంధుత్వం కన్నా గొప్పది స్నేహం ఒక్కటే.
- గాయపడిన మనసుని సరిచేసేందుకు, స్నేహానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు.
- విడిపోతే తెలుస్తుంది మనిషి విలువ, గడిస్తే తెలుస్తుంది కాలం విలువ, స్నేహం చేస్తే మాత్రమే తెలుస్తుంది, స్నేహితుడి విలువ.
- నీ ఆనందంలో తోడున్నా లేకపోయినా నీకు ఎదురయ్యే ఆపదలో ముందు నేనుంటా !
- నువ్వు నలుగురిలో ఉన్నా నీలో నువ్వు లేకుండా చేస్తుంది ప్రేమ, నీలో నువ్వు లేకున్నా మేం నలుగురం నీకున్నాం అని చెప్పేది స్నేహం.
- ఎప్పుడు మొదలైనా ,ఎలా మొదలైనా, మొదలైనా !పరిచయం మనసుకి తాకితే అదే స్నేహం.
- మరిచే స్నేహం చేయకు,స్నేహం చేసి మరువకు.
- స్నేహమంటే మనభుజంపై చెయ్యేసి మాట్లాడటం కాదు.మన కష్ట సమయాలలో భుజం తట్టి నేనున్నాని చెప్పడం.
- నా ఆశకు శ్వాస నీ స్నేహం, నా ఊహకు ఊపిరి నీ స్నేహం, నా తనువుకి ప్రాణం నీ స్నేహం,నా నడకకు గ్యమంనీ స్నేహం.అటువంటి మన స్నేహం విడిపోకూడదు.
- ఆపదలో అవసరాన్ని బాధలో మనసుని తెలుసుకుని సహాయపడేవాడే నిజమైన స్నేహితుడు.
- ఈ జిందగిలోఆస్తులు లేనివాడు….పేదవాడు కాదు… ఫ్రిండ్స్ లేనివాడు పేదవాడు.
- నువ్వు పదిమందిలో ఉన్నప్పుడు మాట వరసకు పలకరించే వారికంటే ఒంటరిగా ఉన్నప్పుడు తోడుండే వారే నిజమైన స్నేహితులు.
- ఎన్ని బంధాలు ఉన్న…మన భావాల్ని స్నేహితులతో పంచుకోవడంలోని ఆనందమే వేరు.
- వేల కొద్ది మిత్రులను పొందడం కాదు, వేల సమస్యలను ఎదుర్కొనే మిత్రుడిని పొందడం నిజమైన స్నేహం.
- కన్నీరు తుడిచే వాడె స్నేహితుడు కానీ కన్నీరు పెట్టించే వాడు కాదు.
- నేస్తమా అని పలకరించే గుణం నీకు ఉంటె, నీ నేస్తానికి చిరకాలం తోడు నేను ఉంటా.
- మంచి స్నేహితుడు తన మిత్రుడులోని ఉత్తమమైన లక్షణాలను గుర్తిస్తాడు.
- మంచి స్నేహితుడు అద్దం లాంటివాడు.అద్దం ఉన్నది ఉన్నట్టుగా చుపినట్టే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు,ఒప్పులను ఉన్నది ఉన్నట్టుగా మొఖంపైచెపుతాడు.
- జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది.
- శత్రువు ఒక్కరు ఉన్న ఎక్కువే.మిత్రులు వంద మంది ఉన్న తక్కువే.
- జ్ఞానం వల్ల మిత్రులు,వైరం వల్ల శత్రువులు పెరుగుతారు.
- స్నేహానికి కులం,మతం,డబ్బు ఏనాటికి అడ్డంకులు కావు.
- స్నేహంలో జీవితం ఉండదేమో కానీ,స్నేహం లేని జీవితం ఉండదు.
- సృష్టిలో అతి మధురమైనది,జీవితంలో మనిషి మరువలేనిది… స్నేహం ఒక్కటే.
- జీవితంలో సంతోషాన్ని ఇచ్చే వాటిలో స్నేహం ముందు వరుసలో ఉంటుంది.
- నీతో స్నేహం నా జీవితంలో వచ్చిన ఒక మంచి మార్పు.
- నా జీవితంలో ఎన్నటికి మర్చిపోలేనిది నీతో స్నేహం.
- ఎంత మంది బంధువులు ఉన్న అన్ని భావాలను పంచుకో గలిగేది ఒక్కస్నేహితుడితో మాత్రమే.
- స్నేహం అనే మార్గంలో దారి చూపిన దిపానివి నువ్వు.
- ఒక్కోసారి ఓటమి కూడా మేలే చేస్తుంది. నిజమైన మిత్రులెవరో నీకు తెలిసేలా చేస్తుంది.
- నీ కథలన్నీ తెలిసినోడు… మంచి స్నేహితుడు. ప్రతి కథలో నీతోపాటే ఉండేవాడు.. నీ బెస్ట్ ఫ్రెండ్!
- తాను కష్టాల సముద్రములో మునుగుతున్న తన వారిని సుఖాల తీరానికి చేర్చే వాడె స్నేహితుడు.
- నిజమైన స్నేహితులు చక్కని ఆరోగ్యం వంటి వారు, ఆరోగ్యం కోల్పోతే కానీ దాని విలువ మనకు తెలియదు.
- మౌనం వెనుక మాటను, కోపం వెనుక ప్రేమను, నవ్వు వెనక బాధను అర్థం చేసుకునే వాడే స్నేహితుడు.
- షరతులు లేకుండా నీతో ఉండేవాడు, ఏమీ ఆశించకుండా నీ మంచిని కోరేవాడు, నీ స్నేహితుడు.
- ఏ విషయాన్నైనా నిస్సంకోచంగా, నిర్భయంగా పంచుకోగలిగేది ఒక్క స్నేహితుడి దగ్గర మాత్రమే.
- నీకు కాలక్షేపాన్ని ఇచ్చేవాడే కాదు, నీ కష్టాలను కుడా పంచుకునే వాడు నిజమైన స్నేహితుడు.
- నీమీద నీకే నమ్మకం లేని సమయంలో కుడా నిన్ను నమ్మేవాడే నీ స్నేహితుడు.
- నువ్వులేకుంటే నేను లేనని అనేది ప్రేమ అయితే, నువ్వుండాలి, నీతో పాటు నేనుండాలి అని ధైర్యాన్నిచ్చేది స్నేహం.
- నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వవచ్చు, కానీ నీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు.
- చిరునవ్వు చాలు మహా యుద్ధాలను ఆపటానికి, చిరు మాట చాలు స్నేహం చిగురించటానికి, ఒక్క స్నేహితుడు చాలు జీవితం మారటానికి.
- రోజులు మారినా, మనుషులు మారినా, శరీరాలు మారినా, మారిపోని వాడు ఒక్క స్నేహితుడు మాత్రమే.
- మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం, అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం.
- స్నేహం చేయటానికి పది సార్లు ఆలోచిస్తే, దాన్ని వదులుకోవడానికి వంద సార్లు ఆలోచించు.
- తన మిత్రుడు ఆనందంగా ఉన్నపుడు పిలిస్తే వెళ్ళేవాడు, దుఃఖంలో ఉన్నపుడు పిలవకపోయినా వెళ్ళేవాడు నిజమైన స్నేహితుడు.
- నీ మనస్సులోని మాటలను వినగలిగి, నీవు చెప్పలేని మాటలను చెప్పగలిగేవాడే నీ స్నేహితుడు.
- నిజమైన స్నేహితుడు నక్షత్రంలాంటి వాడు, మాయమైనట్టు కనిపించినా ఎప్పుడూ అక్కడే ఉంటాడు.
ఇవి కూడా చదవండి :-
- నడవడిక| Attitude Quotes మీ అందరి కోసం
- పెళ్లిరోజు శుభాకాంక్షలు మీ అందరి కోసం!
- పుట్టిన రోజు కవితలు మీ అందరి కోసం !
- ప్రేమ కవితలు మీ అందరి కోసం!
- కర్మ ఫలం Quotes మీ అందరి కోసం !