వివో కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Vivo X Fold 5 గురించి తాజా లీకులు వచ్చినాయి.ఈ లీకులు ప్రధానంగా ఫోన్ బ్యాటరీ సామర్థ్యం మరియు ధరపై దృష్టి సారిస్తున్నాయి.Vivo X Fold 5లో 6,000mAh సామర్థ్యమైన భారీ బ్యాటరీ ఉండబోతోంది,ఇది గత మోడల్ Vivo X Fold 3 Proలో ఉన్న 5,700mAh బ్యాటరీ కంటే ఎక్కువ.దీని వల్ల యూజర్స్ కి ఎక్కువ బ్యాటరీ బ్యాక్‌అప్ అందే అవకాశం ఉంది.
మరింత ఆసక్తికర విషయం ఏమిటంటే,Vivo X Fold 5 ధర పరంగా Vivo X Fold 3 Pro కంటే తక్కువగా ఉండే అవకాశముందని తెలుస్తోంది.ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇది ఒక పెద్ద ప్లస్ గా నిలుస్తుంది,ఎందుకంటే ఫీచర్లు మెరుగ్గా ఉండగా ధర తక్కువగా ఉంటే,వినియోగదారులు ఎక్కువగా ఆకర్షితులవుతారు.
Vivo X Fold 5లో 8.03-అంగుళాల 2K+ AMOLED ఫోల్డబుల్ డిస్‌ప్లే,6.53 అంగుళాల LTPO OLED కవర్ డిస్‌ప్లే,Snapdragon 8 Gen 3 ప్రాసెసర్,16GB RAM, 512GB స్టోరేజ్ వంటి హై-ఎండ్ స్పెసిఫికేషన్లు ఉంటాయని కూడా రిపోర్ట్లు ఉన్నాయి.అలాగే, 90W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 30W వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఫోన్ ప్రత్యేకతలలో భాగంగా ఉంటాయి.
ఇది ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల విభాగంలో విప్లవాత్మక పరిష్కారం కానుంది అని నిపుణులు భావిస్తున్నారు. అధికారిక విడుదల వివరాలు ఇంకా వెల్లడ కాలేదు,కానీ త్వరలో Vivo నుండి పూర్తి సమాచారం అందనుంది. Vivo X Fold 5 ఫ్యాన్స్ కోసం ఒక మంచి ఎంపికగా ఎదుగుతుందని అనుకుంటున్నారు.