మహేష్ బాబు జీవిత చరిత్ర మీకు తెలుసా ?

మహేష్ బాబు గురించి పూర్తి వివరాలు

ఘట్టమనేని మహేష్ బాబు యొక్క జననం 9 ఆగస్ట్ 1975 భారతదేశం లో జన్మించినారు, ఈయన తెలుగు సినిమా నటుడు. ఇతను ఘట్టమనేని కృష్ణ గారికి మరియు ఇందిరా దేవికి జన్మించినారు.

కృష్ణ గారి రెండవ కొడుకు అయిన మహేష్ బాబు, ఇతనికి చిన్నప్పటి నుంచి కృష్ణ గారి సినిమాలు అంటే ఇష్టం, సినిమాలు ఎక్కువగా ఇష్టపడటం వలన కృష్ణ గారి సపోర్ట్ వల్లన సినిమాల్లో కి రావడం జరిగింది.

విద్యాభ్యాసం

మహేష్ బాబు సెయింట్ బెడెస్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్, చెన్నై లో తన హై స్కూల్ విద్య ను చదివాడు. ఆ తర్వాత లయోలా కళాశాల, చెన్నై లో తన కళాశాల విద్యనూ చదివాడు. ఇదే కళాశాలలో తన బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ను పూర్తి చేసాడు.

మహేష్ బాబు సినిమాలోకి అరంగేట్రం 

మహేష్ తొలిసారిగా నాలుగేళ్ల వయసులో నీడ చిత్రంలో నటించినారు, ఈ సినిమా 1979 చిత్రంలో రిలీజ్ అయినది. ఆ తర్వాత తన తండ్రి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో కనిపించాడు. అలాగే కొడుకు దిద్దిన కాపురం సినిమాలో కూడా తన తండ్రి తో కలిసి సినిమాలోల నటించాడు. అప్పట్లో మరి కొన్ని సినిమాలు కూడా చేసారు.

ఆ తర్వాత వచ్చిన రాజకుమారుడు సినిమాలో హీరోగా నటించినారు, ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు, ఈ చిత్రం 1999 లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయినది. ఈ విధముగా తన సినిమా ప్రస్తవన జరిగింది. అలాగే అదే ఏడాదిలో వచ్చిన యువరాజు సినిమా కూడా మంచి పేరు తెచ్చింది.

ఆ తర్వాత వంశి, టక్కరి దొంగ, మురారి వంటి సినిమాలు తన నటనతో కొంచెం ముందుకు వెళ్ళినారు. మరలా వచ్చిన ఒక్కడు, అర్జున్ మరియు నాని, నిజం వంటి మంచి సినిమాలు చేసాడు. ఆ  తర్వాత వచ్చిన అతడు, మరియు పోకిరి సినిమాలు ఇండస్ట్రీ రికార్డు సృష్టించాయి.

తర్వాత వచ్చిన మరి కొన్ని సినిమాలు అయిన సైనికుడు మరియు అతిథి వంటి సినిమాలు తనకు మంచి పేరు తెచ్చాయి. ఈ విధముగా తాను వరుసగా సినిమాలు చేసుకొంటూ ముందు పోయాడు. ఆ తర్వాత దూకుడు మరియు బిజినెస్ మాన్ మరియు సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు వంటి అన్ని చిత్రాలు మంచి కలెక్షన్ లో ముందుకు సాగినాయి.

మరి కొన్నిరోజుల తర్వాత శ్రీమంతుడు మరియు భరత్ అనే  నేను, మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలు వరుసగా హిట్ సాధించి మంచి వసూలు సాధించాయి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా మంచి హిట్ సాధించినది, ఇప్పుడు రాబోయే సినిమా పాన్ ఇండియ డైరెక్టర్ అయిన రాజమౌళి తో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబు వివాహము

మహేష్ బాబు వివాహము 10 ఫిబ్రవరి 20౦5 లో నమ్రతా శిరోద్కర్ తో వివాహము చేసుకొన్నాడు. 2005 ఫిబ్రవరి 10న ముంబైలోని మారియట్ హోటల్‌లో అతడు షూటింగ్ సమయంలో వీరి వివాహం జరిగింది, నమ్రతా శిరోద్కర్ కొన్ని సినిమాల్లో కూడా నాయికగా నటించింది.

మహేష్ బాబు నిర్మాణ సంస్తలు

మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ నటుడు మహేష్ బాబుచే స్థాపించబడిన భారతీయ చలనచిత్ర నిర్మాణ సంస్థ. ఇందులో తన సొంతముగా కొన్ని సినిమాలు తాను నిర్మించాడు.

ఇతను ఇందులో కొన్ని సినిమాలు తన సొంత బ్యానర్లో  కూడా నిర్మించుకొన్నారు. వాటిలో బ్రహ్మోత్సవము మరియు శ్రీమంతుడు, సరిలేరు నీకెవ్వరు, మేజర్, సార్కారు వారి పాట వంటి సినిమాలు జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ లో నిర్మించాడు.

సంతానము 

మహేష్ బాబుకి, నమ్రతా శిరోద్కర్ కు ఇద్దరు పిల్లలు. వారు పిల్లలు కూడా ఎంతో సంప్రదాయముగా పెరిగారు. వీరి కూతురు పేరు సితార ఘట్టమనేని కొడుకు గౌతం ఘట్టమనేని. సితార కు సంప్రదాయ నృత్యాలు అంటే చాల ఇష్టము మరియు పెయింటింగ్‌ అంటే కూడా ఇష్టం.

గౌతం ఘట్టమనేని 2018లో తనకు ఇష్టమైన స్విమ్మింగ్ కోచింగ్‌ను ప్రారంభించాడు. అలాగే  తెలంగాణ రాష్ట్ర స్విమ్మింగ్‌లోని టాప్ 8 పోటీ స్విమ్మర్‌లలో అతను తన స్థానము సంపాదించాడు.

మహేష్ బాబు యొక్క ముద్దు పేర్లు

మహేష్ బాబుని అభిమానులు అందరు ప్రేమతో నాని అని పిలుస్తారు మరియు ప్రిన్సు అని కూడా అంటారు. అలాగే అభిమానులు ఇచ్చిన మరో బిరుదు సూపర్ స్టార్ అని కూడా అంటారు. మరి కొంత మంది యూనివర్సల్ స్టార్ అని పిలుస్తారు.

ఇష్ట ఇష్టాలు

మహేష్ బాబు కు బిర్యానీ అంటే చాల ఇష్టము, అలాగే ఇతనికి నచ్చే నటులు శ్రీదేవి మరియు త్రిష. బుక్స్ చదవడం ఇష్టం, జాగింగ్ చేయడం అంటే ఇష్టం, ఇతనుఖాళి సమయంలో వీడియో గేమ్‌లు ఆడడం చేస్తూఉంటారు, ఖాళి దొరికి నప్పుడు ఫ్యామిలీతో గడుపుతారు.

అవార్డ్స్

  • మహేష్ బాబు తన మొదటి సినిమా అయిన రాజకుమారుడు సినిమాకు నంది అవార్డు అందు కొన్నాడు.
  • ఇతను నటించిన పోకిరి మరియు ఒక్కడు సినిమాకు ఫిలింఫేర్ అవార్డు అందుకొన్నాడు.

మహేష్ బాబు ఎనిమిది నంది అవార్డులు, ఐదు ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, మూడు సినిమా అవార్డులు, మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, నాలుగు SIIMA అవార్డులు మరియు ఒక IIFA ఉత్సవం అవార్డు గ్రహీతగా అందుకొన్నారు.

Mahesh Babu Remuneration

మహేష్ బాబునటించే ప్రతి సినిమాకు దాదాపు 55 కోట్ల రూపాయలు తీసుకొంటారు. ప్రస్తుతం మహేష్  నటించిన బోయే సినిమాలకు కూడా 80 కోట్ల రూపాయలు పెంచినట్లు గా సమాచారం ఉన్నదీ.

Leave a Comment