తెలంగాణ ఇ చలన్ అంటే ఏమిటి ? ఇ చలన్ పూర్తి వివరాలు తెలుసుకొందం !

తెలంగాణ ఇ చలన్ అంటే ఏమిటి | What Is E Challan Telangana In Telugu 

E Challan Telangana In Telugu : రోడ్డు భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్రం 8వ అధ్వాన్నమైన రాష్ట్రంగా జాబితా చేయబడింది. తెలంగాణలో రోడ్డు ప్రమాదాల తీవ్రత 29.7 పాయింట్లకు పెరిగింది, అంటే ప్రతి 100 ప్రమాదాలకు, 2019లో కనీసం 30 మంది మరణించారు, పెరుగుతున్న రోడ్డు భద్రతా ఉల్లంఘనలు మరియు ట్రాఫిక్ నిర్వహణ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులకు ప్రధాన ఆందోళన కలిగిస్తుంది.

ట్రాఫిక్‌ను ఉల్లంఘించే వారిపై ప్రభుత్వం కఠిన నిబంధనలు, జరిమానాలు విధిస్తోంది. కొత్త మోటారు వాహన చట్టం 2019 ప్రకారం, మీరు ఏదైనా ట్రాఫిక్ భద్రతా నియమాన్ని ఉల్లంఘించినప్పుడు మరియు మీకు తెలంగాణ ట్రాఫిక్ ఇ చలాన్ జారీ చేయబడుతుంది.

మీ ట్రాఫిక్ చలాన్‌ని ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలి | How to Pay your Traffic Challan Online

మీ ట్రాఫిక్ చలాన్‌ని ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించలో క్రింద ఇవ్వబడినాయి.

  • ముందుగా మీరు గూగుల్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లోకి వెళ్లి echallan.tspolice.gov.in టైపు చేసి ఓపెన్ చేయండి.
  • చేసిన తర్వాత మీ వాహనం నంబర్ లేదా లైసెన్స్ నంబర్‌ను నమోదు చేయండి.
  •  చేసిన వెంటనే మీకు ఒక సాధారణ గణిత ప్రశ్నలు మీకు వస్తాయి వాటి అన్నింటిని పూర్తి చేసి ‘GO’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • క్లిక్ చేసిన తర్వాత మీకు ఇ-చలాన్ చెల్లించాల్సిన నేరాల జాబితా మీకు చూపబడుతుంది.
  • ఈ జాబితా అంత చూసి మీరు ఎంత చేలించాలో అంత చలన్ పే చేయవలసి ఉంటది.

ఈ విధంగా మీరు ఆన్లైన్ చలన్ చెల్లించే విధానం.

Paytm ఉపయోగించి ఇ చలన్ చెల్లించడం ఎలా| How to Pay E-Challan Using Paytm

మీరు Paytm యాప్ లేదా వెబ్‌సైట్‌ని ఉపయోగించి మీ ఇ-చలాన్‌ని ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు, Paytmని ఉపయోగించి ఇ-చలాన్‌ను చేలించే విధానం ఎలాగో తెలుసుకొందం.

  • ముందుగా మీ మొబైల్‌లో Paytm యాప్‌కి వెళ్లండి.
  • వెళ్ళిన తర్వాత అక్కడ మీరు రీఛార్జ్  బిల్లులు ఎంపికపై క్లిక్ చేయండి.
  • చేసిన తర్వాత అలాగే ‘చలాన్’పై క్లిక్ చేయండి. చేసిన వెంటనే ట్రాఫిక్ అథారిటీ’ని ఎంచుకోండి.
  • ఎంచుకొన్నాక అక్కడ మీరు చలాన్ నంబర్, చలాన్ ID, వాహనం నంబర్ మొదలైన అవసరమైన వివరాలను నమోదు చేయండి.
  • మీ చలాన్ ఎంత ఉందో మొత్తాన్ని చెక్ చేయడానికి ‘ప్రొసీడ్’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • చేసిన తర్వాత  ఏదైనా చెల్లింపు విధానాన్ని ఎంచుకోండి మరియు ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయండి.
  • ఈ విధంగా paytm ద్వారా చెల్లింపు చేయవచ్చు.

తెలంగాణ ఆఫ్‌లైన్‌లో ఇ చలాన్‌ను చెల్లించడం ఎలా | Paying E -Challan in Telangana Offline

తెలంగాణాలో ఆఫ్ లైన్ లో చలన్ కట్టడం ఎలా ఏ విధంగా కట్టాలి

  •  మీ తెలంగాణ ఇ చలాన్ లెటర్ ఒక కాఫీని దగ్గరగా ఉండే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లండి.
  • అక్కడ ట్రాఫిక్ జరిమానాల సేకరణకు బాధ్యత వహించే నియమించబడిన అధికారులను సంప్రదించండి.
  • సంప్రదించినకా పెనాల్టీని నగదు రూపంలో చెల్లించండి, పెండింగ్‌లో ఉన్న జరిమానాలను ఏదైనా ఉంటే తనిఖీ చేసి, వెంటనే చెల్లించమని మీరు అధికారులను కోరవచ్చు. ఈ విధంగా మీరు చలన్ ను చెల్లించవలసిన ఉంటది.

ఇ చలన్ వలన ఉపయోగాలు ఏమిటి  | What Is Uses In E Challan 

  • ఇ చలన్ ఉన్నందు వలన ప్రయాణికులు వేగంగా పోకుండ నెమ్మదిగా పోతారు.
  • ఇ చలన్ వలన చాల మంది హెల్ మెట్ పెట్టుకోకుండానే ప్రయాణం చేస్తారు, దిని వలన ప్రాణాలు పోయే అవకాశం ఉంటది,  అందు వలన ఈ చలన్ ఉన్నంత వరకు హెల్మెట్ పెట్టుకొనే ఉంటారు లేకుంటే జరిమానా విధిస్తారు అని జాగ్రత్త పాడుతారు.
  • చలన్ వలన సిట్ బెల్ట్ కూడా అందరు పెట్టుకొంటారు.
  • మద్యం తాగి వాహనం నడపారు.
  • ఇలా చలన్ కట్టవలసి వస్తుంది అని అందరు జాగ్రతగా ఉంటారు.

తెలంగాణలో తాజా ట్రాఫిక్ ఉల్లంఘన జరిమానాలు | Latest Traffic Violation Penalties in Telangana

Traffic Violation Fine Imposed
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతువారికి విధించే చలన్ 1,000 జరిమానా మరియు/లేదా 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
సీటు బెల్ట్ లేకుండా నాలుగు చక్రాల వాహనం నడుపుతున్న వారికి చలన్ 1,000
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌లో మాట్లాడుతు ఉన్నవారికి 1,000
ఒకటి కంటే ఎక్కువ పిలియన్ రైడర్‌లతో ద్విచక్ర వాహనాన్ని నడపడుతున్న వారికి విధించే చలన్ 1,000
ప్రమాదకరమైన డ్రైవింగ్ చేసే వారికి
  • మొదటి నేరానికి: ₹1,000 నుండి ₹5,000 జరిమానా మరియు/లేదా 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష
  • తదుపరి నేరాలకు: ₹10,000 జరిమానా మరియు/లేదా 2 సంవత్సరాల జైలు శిక్ష
అతివేగం వెళ్ళే వారికి విధించే చలన్ 1,000 నుండి ₹2,000
రోడ్డు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు వారికి చలన్ 500 నుండి ₹1,000
ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ 1,000
చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, రైడింగ్ 5,000
రిజిస్ట్రేషన్ లేకుండా డ్రైవింగ్, రైడింగ్ 5,000
డ్రంక్ డ్రైవింగ్
  • మొదటి నేరానికి: ₹10,000 జరిమానా మరియు/లేదా 6 నెలల జైలు శిక్ష
  • తదుపరి నేరాలకు: ₹15,000 జరిమానా మరియు/లేదా 2 సంవత్సరాల జైలు శిక్ష
నిషేధిత ప్రాంతాలలో డ్రైవింగ్, రైడింగ్ 20,000
అత్యవసర వాహనాలను అడ్డుకుంటున్నారు 10,000 జరిమానా మరియు/లేదా 6 నెలల జైలు శిక్ష
థర్డ్-పార్టీ బీమా లేకుండా వాహనం నడపడం, సవారీ చేయడం
  • మొదటి నేరానికి: ₹2,000 జరిమానా మరియు/లేదా 3 నెలల జైలు శిక్ష
  • తదుపరి నేరాలకు: ₹4,000 జరిమానా మరియు/లేదా 3 నెలల జైలు శిక్ష

 

ఇవీ కూడా చదవండి :

Leave a Comment