జూనియర్ ఎన్టీఆర్ బయోగ్రఫీ యొక్క పూర్తి వివరాలు !

Junior NTR Biography In Telugu : జూనియర్ నందమూరి తారక రామారావు 20 మే 1983 లో జన్మించినారు, NTR న్ని జూనియర్ ఎన్టీఆర్ లేదా తారక్ అని కూడా పిలుస్తారు, అతను ఒక భారతీయ నటుడు, గాయకుడు మరియు టెలివిజన్ వ్యాఖ్యాత, అతను ప్రధానంగా తెలుగు చిత్రాలలో నటిస్తున్న ప్రముఖ నటుడిగా పేరుతేచ్చుకొన్నారు. ఎన్టీఆర్ తల్లి తండ్రులు, తండ్రి  హరికృష, తల్లి శాలిని భాస్కేర్ రావు, అలాగే అన్న కళ్యాణ్ రామ్.

జూనియర్ ఎన్టీఆర్ అంటే గుర్తుకు వచ్చేది ఒక నందమూరి తారక రామ రావు అంటే మన తెలుగు ప్రజల గుండె చప్పుడు మరియు మన తెలుగు వారి ఆత్మ గౌరవము ప్రపంచము అంత చాటి చెప్పిన ఒక రాజకీయ నాయకుడిగా మరియు సినిమా హీరోగా ఎంతో మంది అభిమానులు సాధించిన ఆయన ఎందరికో ఆరాధ్య దైవముగా ఉన్నాడు.

అలాగే ఆయన మనువడు కూడా తాత తగ్గ మనవడుగా తన సత్తా ఏంటో ఆయన నటన ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ నందమూరి వంశము నుంచి వచ్చిన ఆయన నటనకు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆయనకు ఎంతో తోడుగా నిలుస్తున్నారు. ఈయన నటించిన అన్ని సినిమాలు తన అభిమానులు ఎంతో ప్రేమగా ఆదరిస్తారు.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి అరంగేట్రం

1991లో ఎన్టీఆర్ తన తాత ఎన్‌టి రామారావు రచించినా దర్శకత్వం వహించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో బాలనటుడిగా అరంగేట్రం చేశారు. తర్వాత గుణశేఖర్ పౌరాణిక చిత్రం రామాయణంలో నటించారు. ఇది 1996లో ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకొన్నారు.

ఆ తర్వాత  2001లో విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించి రామోజీ రావు నిర్మించిన “నిన్ను చూడాలని” సినిమాతో ఎన్టీఆర్ తొలిసారిగా నటించాడు. ఎన్టీఆర్ తదుపరి SS రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం స్టూడెంట్ నంబర్ 1లో నటించారు. తర్వాత వివి వినాయక్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆదిలో నటించాడు, ఈ చిత్రం 2002లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

ఆ తర్వాత వచ్చిన సినిమాలలో సింహాద్రి, మరియు బాద్ షా మరియు యమ దొంగ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. వీటిలో సింహాద్రి సూపర్ హిట్ గా నిలిచింది, ఆ తర్వాత యమ దొంగ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి రాజమౌళి గారు దర్శకత్వం చేసారు. ఆయన చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ద్వారా మనకు పరిచయం అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత చిత్రం మంచి విజయం సాధించినది. అలాగే టెంపర్ సినిమా తన సరి కొత్త నటన తో అభిమానులను అలరించాడు. అలాగే ఈ మధ్య వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తో మరో సారి తన నట విశ్వ రూపము చూపించాడు. ఈ సినిమా 12౦౦ కోట్ల పైగా వసూలు చేసింది.

జూనియర్ ఎన్టీఆర్ వివాహము 

జూనియర్ ఎన్టీఆర్ వివాహము 5 మే 2011 లో లక్ష్మి ప్రణతి తో వివాహము జరిగింది. హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సౌత్ ఇండియా అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఈ వివాహానికి విలాసవంతమైన సెట్‌లను రూపొందించారు మరియు ఈ పెళ్ళికి సంభందించిన డెకరేట్ హైదరాబాద్‌కు చెందిన అత్యంత ప్రసిద్ధ ప్లానర్ దినాజ్ నోరియా ఏర్పాటు చేశారు.

లక్ష్మీ ప్రణతి సంపన్న కుటుంబానికి చెందినవారు మరియు ఆమె తండ్రి నార్నె శ్రీనివాసరావు తెలుగు మాట్లాడే రాష్ట్రాల్లో అగ్రశ్రేణి వ్యాపారవేత్త. లక్ష్మీ ప్రణతి తల్లి ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్ర బాబు నాయుడుకు మేనకోడలు కావడంతో వీరి పెళ్లికి ఆమె మధ్యవర్తిత్వం వహించినట్లు సమాచారం.

వీరి పెళ్లి సెట్‌కు 18 కోట్ల రూపాయలు ఖర్చయిందని అప్పట్లో మీడియాలో ప్రచారం జరిగింది. స్వచ్ఛమైన బంగారం, వెండితో నేసిన లక్ష్మీ ప్రణతి పెళ్లి చీర దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అంచనా. దాదాపు సినీ, రాజకీయ రంగాల్లోని ప్రముఖులందరూ ఈ వివాహానికి హాజరయ్యారు మరియు మొత్తం అతిధుల సంఖ్య 30,000 వేలు మంది అని చెప్పబడింది. కొన్ని మీడియా వర్గాలు 2011లో ఈ వివాహ ఖర్చు దాదాపు రూ. 100 కోట్లకు చేరుకుందని మరియు దక్షిణ భారతదేశంలో అత్యంత ఖరీదైన వివాహాలలో ఒకటిగా నిలిచింది.

సంతానము

జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతికి ఇద్దరు కుమారులు1. నందమూరి భార్గవ్ రామ్ 2.నందమూరి అభయ్ రామ్.

విద్యాభాసము 

జూనియర్ ఎన్టీఆర్ తన విద్యనూ  విద్యారణ్య ఉన్నత పాఠశాల, హైదరాబాద్ సెయింట్ మేరీస్ కళాశాలలో తన విద్యను పూర్తి చేసాడు.

ఇష్ట ఇష్టాలు 

జూనియర్ ఎన్టీఆర్ కు పాటలు పాడడం అన్న మరియు డాన్స్ చేయాలి అన్న చాలా ఇష్టం. అందుకే తాను ఎంతో ఇష్టము తో కూచిపూడి కూడా నేర్చు కొన్నాడు. అలాగే మన సంప్రదాయ నృత్యం కూడా నేర్చుకొన్నాడు. ఖాళి సమయాల్లో పిల్లలు తో ఆడుకోవడం అంటే చాల ఇష్టం.

అవార్డ్స్

నంది అవార్డు (ఆది 2002) సినిమా కు గాను అందు కొన్నాడు. అలాగే తాను నటించిన యమ దొంగ సినిమా కు ఫిలిం ఫేర్ అవార్డు అందు కొన్నాడు.ఆ  తర్వాత వచ్చిన నాన్నకు ప్రేమ తో సినిమాకు గాను 64th ఫిలిం ఫేర్ అవార్డు తిసుకొన్నారు. మరో సారి జనతా గారేజే సినిమాకు గాను నంది అవార్డు అందు కొన్నాడు.

Nick names 

ఆయనను అభిమానులు ప్రేమగా తారక్ అని పిలుస్తారు. అలాగేజూనియర్ ఎన్టీఆర్ అని,  అలాగే నందమూరి తారక రామ రావు అని కూడా పిలుస్తారు, ఎన్టీఆర్ కు అభిమానులు ఇచ్చిన మరో పేరు యంగ్ టైగర్ అని పేరు ఎక్కువ popular అయింది.

Junior NTR Remuneration

జూనియర్ ఎన్టీఆర్‌  ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రూ 45 కోట్లు Remuneration ను అందు కొన్నాడు అని సమాచారము.

Leave a Comment