ఫైన్నాల్ లోకి అడుగు పెట్టిన రాజస్థాన్ రాయల్స్ !

IPL 2022 In Telugu : ఇండియన్ ప్రేమియం లీగ్ ఫైన్నాల్ లోకి చివరికి రెండు టీమ్స్ అడుగు పెట్టినాయి, ఆ టీమ్స్ గుజరాత్, రాజస్థాన్ ఈ టీమ్స్ ఫైన్నాల్ లో ఉన్నారు. 

నిన్న రాత్రి జరిగిన రెండు టీమ్స్ మధ్య రాజస్థాన్, RCB, మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్, RCB మీద 7 వికెట్స్ తేడాతో గెలిపొందింది. RCB ఫాన్స్ ఈ మ్యాచ్ ఓడిపోవడం తో చాల నిరాశ చెందినారు. RCB ఫాన్స్ ఎప్పటి నుండో ఒక్కసరి కూడా ఫైన్నాల్ లో గెలవలేదు అని చాల నిరాశ చెందినారు. కానీ IPL లో ఉండే అన్ని టీమ్స్ కన్నా ఈ RCB టీం కి ఉన్న ఫాన్స్ ఏ టీం కి కూడా ఫాన్స్ లేరు. 

IPL ప్రారంభం అయిన పట్టి నుండి ఇప్పటి దాక అన్ని టీమ్స్ తో గెలిచి ఇంత వరకు వచ్చారు, కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో RCB ఎక్కువ స్కోర్ చేయలేక పొయింది, దాని వలన ఈ మ్యాచ్ పరాజయం చెందింది. RCB ఫాన్స్ ఈ IPL లో ఓడిపోయిన తర్వాత వచ్చే IPL సిసన్ లో అయ్యిన కప్ గెలవాలి అని వారి మాటల రూపం లో తెలియచేసారు, అలాగే మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది గెలిచినా ఒడినా కూడా అని తెలియచేసారు.

ఐపీఎల్ 2022 సీజన్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫైనల్‌కి చేరడంతో 12 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అయ్యింది. 2008లో ఐపీఎల్ ప్రారంభవగా 2011లో ప్లేఆఫ్స్‌ని తెరపైకి తెచ్చారు. అప్పటి నుంచి ఈ ఏడాది వరకూ 12 సీజన్లు ముగియగా ఈ 12 ఏళ్లలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన టీమ్ ఒక్కసారి కూడా మిస్ అవకుండా ఫైనల్‌కి చేరుతూ వచ్చింది.

2008లో ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత మళ్లీ ఫైనల్‌కి చేరడం ఇదే మొదటిసారి. ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ ఇప్పటికే ఆడిన 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 824 పరుగులు చేయగా ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. మరోవైపు గుజరాత్ టైటాన్స్‌కి ఇదే మొదటి ఐపీఎల్ సీజన్‌కాగా పాయింట్ల పట్టికలో గుజరాత్ టీమ్ నెం.1 స్థానంలో నిలిచింది.

IPL 2022 ఇంకా ఫైన్నాల్ పోరు ఒక్కటే మిగిలింది, క్వాలిఫయర్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 7 వికెట్లు తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఫైన్నాల్ లో ఈ టీం గెలుస్తుందో వేచి చూదం, ఈ ఫైన్నాల్ మ్యాచ్ కూడా మే 29 ప్రారంభంకానుంది.

ఐపీఎల్ 2022లో ఆసక్తిగా మారిన క్వాలిఫయర్ 2 ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. ఆర్సీబీ ఇంటికి చేరగా ఆర్ఆర్ జట్టు ఫైనల్‌కు చేరింది. మే 29న అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత  20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 157 పరుగులే చేయగలిగింది. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. రజత్ పటిదార్ మరోసారి సత్తా చాటాడు. 42 బంతులక్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 58 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడుతూనే 13 బంతుల్లో 24 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ 27 బంతుల్లో 25 పరుగులు చేసి వెనుదిరిగాడు. మొత్తానికి 157 పరుగులకు ఇన్నింగ్స్ ముగించేసింది.

ఆ తరువాత 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రారంభం నుంచి ధాటిగా ఆడారు. జైశ్వాల్ 13 బంతుల్లో 21 పరుగులు చేసి అవుటైన..బట్లర్ ధాటిగా ఆడుతూ ఇన్నింగ్స్ కొనసాగించాడు. బట్లర్ మరోసారి అద్భుత ప్రదర్శన చూపించాడు. కేవలం 60 బంతుల్లో 106 పరుగులు చేసి నాటవుట్‌గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్  జట్టుకు విజయాన్ని అందించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మరో 11 బంతులు మిగిలుండగానే..3 వికెట్లు కోల్పోయి..161 పరుగులు చేసింది. జోస్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మే 29వ తేదీన ఐపీఎల్ 2022 ఫైనల్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది.

Leave a Comment