సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

Sarkaru Vaari Paata Pre Release Event Date

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.అతను నటించిన సర్కారు వారి పాట  సినిమా మే 12 2022 లో రిలీజ్ కాబోతోంది. ఇందులో మహేష్ బాబు పేద ప్రజల కోసం పోరాడే వ్యకి గా మరియు అవినీతి చేసే రాజకీయ నాయకులకు వ్యతిరేకముగా పోరాడే పాత్రలో అయన నటించాడు.

సర్కారు వారి పాట’ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు-పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు బద్దలుకొట్టడం ఖాయమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ తెరపైకి వచ్చింది.

మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ ‘సర్కారు వారి పాట’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్ది వారిలో ఎగ్జయిటింగ్ మరింత పెరిగిపోతోంది.

సూపర్ స్టార్ మహేష్‌ బాబును ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని తహతహలాడిపోతున్నారు. సిల్వర్ స్క్రీన్ కన్నా ముందు ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మహేష్ మాటలు వినేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది.

సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మే 7న నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సమాచారం. గీత గోవిందం తర్వాత పరశురామ్ తెరకెక్కించిన చిత్రం కావడం… ఇప్పటికే విడుదలైన ట్రైలర్, మహేష్ లుక్స్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

సినిమాలో సుబ్బరాజు, వెన్నెల కిశోర్, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ అంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Comment