హీరో విశ్వక్ సేన్ ఇటివలే తెలుగు సినిమాలలో నటుడిగా పరిచయం అయ్యారు. పాగల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ఆయన అశోకవనంలో అర్జునకళ్యాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న ఒక 30 ఏళ్ల వ్యక్తి ఎదుర్కొనే ఇబ్బందులను కథాంశంగా తీసుకున్నారు..
విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 6న విడుదల కానుంది. కాగా, ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో హీరో విష్వక్సేన్ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఇన్ స్టాగ్రామ్ సెలబ్రిటీలతో చిట్ చాట్ చేశారు. దాంట్లో ఆసక్తికర సంగతులు వెల్లడించారు. గతంలో తన లవ్ బ్రేకప్ అయిందని తెలిపారు. తాను ఎంతగానో ఇష్టపడిన అమ్మాయి తనను వదిలేసిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
లవ్ బ్రేకప్ అయిన సంగతి తనకు నెల రోజుల తర్వాతే తెలిసిందని, అది మరింత బాధాకరమని విష్వక్సేన్ పేర్కొన్నారు. మూడేళ్లు ఆ అమ్మాయిని ప్రేమించానని, బ్రేకప్ సంగతి గుర్తుకు వస్తే ఇప్పటికీ ఎంతో వేదన కలుగుతుందని చెప్పాడు. విష్వక్సేన్ ఇన్ స్టా చిట్ చాట్ కు చెందిన వీడియోని అశోకవనంలో అర్జునకల్యాణం టీమ్ నేడు విడుదల చేసింది.
ప్రతి మగాడి లైఫ్ లో బ్రేకప్ ఉంటుంది, దాన్ని ఎవ్వడూ తప్పించుకోలేడు. నా లైఫ్ లో కూడా ఒక బ్రేకప్ ఉంది. అంతకుమించి ఎక్కువ బ్రేకప్స్ నాకు జరగలేదు. ఓ అమ్మాయిని సిన్సియర్ గా ప్రేమించాను. కాలేజీలో మూడేళ్లు చూశాను. కాలేజ్ లో ఉన్నప్పుడు మాట్లాడలేదు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఓ ఫ్రెండ్ పార్టీలో కలిశాం. ఓ ఘటన వల్ల ఇద్దరం దగ్గరయ్యాం. అంతా ఓకే అనుకున్నాను. కానీ మా జర్నీలో ఆ అమ్మాయి నాకు ఎప్పుడో బ్రేకప్ చెప్పేసింది. ఆ విషయం 30 రోజుల తర్వాత నాకు తెలిసింది. తను మొదటి రోజు లేదా 7వ రోజు చెబితే బాగుండేది. కానీ నాకు నెల రోజుల తర్వాత తెలిసింది. అది చాలా బాధాకరమైన విషయం.
ఆ బ్రేకప్ తర్వాత చాలా ఎమోషనల్ అయ్యానని, అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్ సీన్స్ ఉంటాయని తెలిపాడు విశ్వక్ సేన్. బ్రేకప్ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండా, కాస్త జోష్ ఉన్న సాంగ్స్ పెట్టమని తనే దర్శకులకు చెబుతుంటానని అన్నాడు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్ పాటలు కూడా ఫుల్ జోష్ గా ఉంటాయన్నాడు.
ఈ హీరో నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా విడుదలకు సిద్ధమైంది. వయసైపోతున్నా ఇంకా పెళ్లి కాని అబ్బాయి పాత్రలో విశ్వక్ ఇందులో నటించాడు. ప్రేక్షకులని ఎంత మాత్రం మేమ్పిస్తారో వేచి చూదం.