చిరంజీవి ఆచార్య మూవీ రివ్యూ & రేటింగ్ – కొరటాల శివ మార్క్ మిస్ !

మెగా ఫాన్స్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న తరుణంలో నేడే విడుదలైన సినిమా ఆచార్య. మెగా ఫాన్స్ కి ఇది ఒక పండగలాగా ఉంటది. చాల రోజుల తర్వాత చిరంజీవి నటించిన సినిమా అలాగే చిరంజీవి కూడుకు రామ్ చరణ్ కూడా ఈ సినిమాలు నటించడం జరిగింది.

ఆచార్య మూవీ రివ్యూ { Acharya Movie Review } :

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌ చరణ్‌ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ మూవీ ఆచార్య. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. సైరా నర్సింహా రెడ్డి తర్వాత చిరంజీవి నటించిన ఈ మూవీ అంచనాలు అందుకుందా.. వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల శివ మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడా లేక ట్రాక్ దారిమళ్లిందా, ఆర్‌ఆర్ఆర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఈ చిత్రంలో తండ్రి పక్కన మెప్పించాడా.

కథ : 

ఒకవైపు అడవి, మరోవైపు నది ప్రవహించే అందమైన టెంపుల్ సిటీ ధర్మస్థలి. దాని పొరుగు ఊరు పాదఘట్టం. దేవత ఘట్టమ్మను ఆరాధించే పాదఘట్టం ప్రజలంతా ధర్మాన్ని సంపూర్ణంగా నమ్మి ఆచరిస్తుంటారు. సాటి మనిషిలో దైవాన్ని చూస్తుంటారు. బిజినెస్ మేన్ (జిషు సేన్ గుప్తా) అండతో మున్సిపల్ ఛైర్మన్ బసవ (సోనూ సూద్) ధర్మస్థలిలో అక్రమాలు చేస్తూ, ప్రజలను పీడిస్తుంటాడు. పాదఘట్టం ప్రజలు ధర్మస్థలిలోకి అడుగుపెట్టడమే బసవకు ఇష్టముండదు.

వడ్రంగిలా ధర్మస్థలిలోకి అడుగుపెట్టిన ఆచార్య (చిరంజీవి) బసన మనుషుల ఆగడాలు అడ్డుకుని బుద్ధి చెబుతుంటాడు. ధర్మస్థలిలో గురుకుల విద్యార్థి సిద్ధ (రామ్ చరణ్). అతని ప్రేయసి నీలాంబరి (పూజా హెగ్డే). ఊరికి అతిథిగా వచ్చిన ఆచార్యకు సిద్ధకు సంబంధమేంటి, ధర్మస్థలి అడవుల్లో వ్యాపారం చేయాలంటే పాదఘట్టం ఊరి వాళ్లను పూర్తిగా తరిమేయాలని బసవ చేసిన ప్లాన్ ను ఆచార్య ఎలా అడ్డుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.

ఆచార్య మూవీ నటినటులు :

చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూ సూద్, అజయ్, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్ ఇతరులు.

సాంకేతిక నిపుణులు :

సినిమాటోగ్రఫీ – తిరు, ఎడిటింగ్ – నవీన్ నూలి, సంగీతం – మణిశర్మ, సమర్పణ – కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, బ్యానర్ – మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్, నిర్మాతలు – నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, రచన, దర్శకత్వం – కొరటాల శివ.

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తే చూడాలని మెగాభిమానుల కోరిక. ఒక మల్టీస్టారర్ చిత్రంగా సినీ ప్రియులకూ ఈ కాంబినేషన్ ఇష్టమే. హిట్ ట్రాక్ ఉన్న దర్శకుడు కొరటాల శివ రూపొందించడం మరో ఆకర్షణ. ఈ ప్రత్యేకతలన్నీ కలిపిన సినిమా ఆచార్య సమ్మర్ సీజన్ ను గ్రాండ్ గా ప్రారంభిస్తూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదల ఆచార్య ఎక్స్ పెక్టేషన్స్ అందుకుందా లేదా రివ్యూలో చూద్దాం.

సినిమా ఎలా ఉంది అంటే :

ఒక కొత్త బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి చేసిన కమర్షియల్ చిత్రమిది. టెంపుల్ సిటీ, ధర్మం, నక్సలైట్ ఈ మూడు అంశాలు ఇందులో కొత్తవి. ఈ నేపథ్యం మెగాస్టార్ ఇమేజ్ కు కావాల్సిన పాటలు, ఫైట్స్, యాక్షన్ సీన్స్ వేటికీ అడ్డు రాలేదు. కొత్త నేపథ్యానికీ మాస్ ఎలిమెంట్స్ కు ముడివేసి సినిమాను రూపొందించాడు దర్శకుడు కొరటాల శివ. ఆచార్య పాత్రకు కావాల్సిన ఇంటెన్సిటీ, పాటల్లో జోష్, ఫైట్స్ లో ఎమోషన్ అన్నీ తనదైన శైలిలో చూపించారు చిరంజీవి.

ఇలాంటి కథలను రక్తికట్టించడంలో ఆయనకున్న ఆపార నటనానుభవం ఈ సినిమాలో కనిపిస్తుంది. ప్రతి సన్నివేశాన్నీ కొత్త ఉత్సాహంతో చేశారు చిరంజీవి. పాఠాలే కాదు గుణపాఠాలూ చెబుతా…, నేను వచ్చానని చెబుదామనుకున్నా…లాంటి డైలాగ్స్ చిరు మాడ్యులేషన్ లో వినాల్సిందే. గురుకుల విద్యార్థి సిద్ధ పాత్రలో రామ్ చరణ్ హుందాగా నటించాడు. నిండుకుండలాంటి వ్యక్తిత్వం ఈ పాత్రది. ధర్మాన్ని పాటిస్తూ, చాటిస్తూ, ధర్మస్థలిని కాపాడుతుంటాడు సిద్ధ. పూజా హెగ్డేతో రామ్ చరణ్ లవ్ ట్రాక్ కూడా ప్లెజంట్ గా సాగుతుంది.

దర్శకుడు కొరటాల శివ గత చిత్రాల్లో ఎంచుకున్న నాన్న కోసం (మిర్చి), మన ఊరు (శ్రీమంతుడు), పర్యావరణం (జనతా గ్యారేజ్), సుపరిపాలన (భరత్ అనే నేను) లాంటి అంశాలన్నీ ప్రేక్షకులను ఎమోషనల్ గా కనెక్ట్ చేసినవే. ఇదే లైన్ లో ధర్మం, దేవాలయం అనే అంశాలను ఎంచుకుని ఆచార్య కథను రాశారాయన. ఈ కథకు నక్సలైట్ బ్యాక్ డ్రాప్ పెట్టడం వల్ల మరింత శక్తివంతంగా హీరోల పాత్రలు తయారయ్యాయి.

సమాజం కోసం సర్వస్వం వదులుకుని అడవులు పట్టిన నక్సలైట్ల జీవితంలోనే హీరోయిజం ఉంది. దాన్ని సినిమాలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే గత చిత్రాలంత ప్రభావవంతంగా ఈ కథను నెరేట్ చేయలేకపోయాడు కొరటాల శివ. ఆసక్తికరంగా లేని లెంగ్తీ సన్నివేశాలు, ఊహించగలిగే కథనం, సహజత్వానికి దూరంగా ప్రధాన పాత్రలు ప్రవర్తించడం, ఆ వ్యక్తిత్వాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడంలో సమతుల్యత తప్పడం వంటివి ఆచార్యకు లోపాలుగా మారాయి. పాటలు బాగున్నా మణిశర్మ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేదు.

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ఇది వ్యక్తి గత అభిప్రాయం మాత్రమే.

Leave a Comment