KGF 2 మూవీ దెబ్బ కి విలవిలడిన బీస్ట్ మూవీ !

KGF 2 మూవీ డెబ్భ కి భారీగా నష్ట పాయిన బీస్ట్ సినిమా. బీస్ట్ సినిమా కి వాళ్ళు అనుకొంతగా ఎక్కువ వసూళ్ళు కాలేదు బీస్ట్ మూవీ 8 రోజులకే బోల్త పడింది. భారీగా పెట్టుకొన్న అంచనాల ప్రకారం వారి అంచనాలను దాటలేదు, సినిమా ముందుగానే పాటలు, టీజర్లు, ట్రైలర్లు, వలన సినిమా బాగుంటది అనుకొంటేనే కొన్ని రోజులు సినిమా ఆడి తర్వాత వాళ్ళు అనుకొంతగా ఏమి రాలేదు అని చెప్పుతున్నారు.  బీస్ట్ సినిమా కి సంభందించిన  స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం, అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా KGF Chapter 2 జోరు  కొనసాగడంతో బీస్ట్‌కు ప్రతికూలంగా మారింది.

తొలి రెండు రోజుల్లో సుమారు 70 కోట్లు సాధించిన చిత్రం ఆ తర్వాత ఆ జోష్‌ను కొనసాగించలేకపోయింది. రెండో వారంలో కేజీఎఫ్2 కోసం అదనంగా 150 స్క్రీన్లను పెంచారు. అలాగే బీస్ట్ సినిమాకు సంబంధించి 200 స్క్రీన్లను తగ్గించారు.

బీస్ట్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు 15.80 కోట్లు, నాలుగో రోజు 13.51 కోట్లు, ఐదో రోజు 13.21 కోట్లు, ఆరో రోజు 3.60 కోట్లు, 7వ రోజు 2.55 కోట్లు సాధించింది. అయితే రెండోవారంలో తమిళనాడులో థియేటర్ల సంఖ్య కుదించడంతో బీస్ట్ కలెక్షన్లు భారీగా క్షీణించాయి. ఎనిమిదో రోజున కేవలం 1.78 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఇక ఎనిమిది రోజుల్లో వివిధ భాషల్లో బీస్ట్ చిత్రం సాధించిన కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులో 102 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 12.53 కోట్ల గ్రాస్, కర్ణాటకలో 10.10 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 3.30 కోట్లు, ఓవర్సీస్‌లో 60.30 కోట్లు రాబట్టింది. దీంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 201.3 కోట్ల గ్రాస్, 102 కోట్ల షేర్ నమోదు చేసింది.

ఇదిలా ఉంటే, బీస్ట్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 125 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 25 కోట్ల మేర రాబట్టాల్సిన అవసరం ఉంది. ఇక తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లుగా నమోదైంది. అయితే ఇప్పటి వరకు సుమారు 7 కోట్లు వసూలు చేసింది. ఇంకా 3 కోట్లు వసూలు చేయగలిగితే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

విజయ్ 5వ సారి రికార్డు: 

విజయ్ కెరీర్‌లో బీస్ట్ చిత్రం అరుదైన రికార్డును సాధించింది. తన కెరీర్‌లో 200 కోట్ల క్లబ్‌లో చేరిన ఐదో చిత్రంగా బీస్ట్ ఘనతను సొంతం చేసుకొన్నది. గతంలో మెర్సల్ చిత్రం 12 రోజుల్లో ఈ ఘనతను సాధిస్తే.. సర్కార్ చిత్రం 6 రోజుల్లో, బిగిల్ చిత్రం 5 రోజుల్లో, మాస్టర్ చిత్రం 8 రోజుల్లో.. బీస్ట్ మూవీ కేవలం 5 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

బీస్ట్ సినిమా లభాలోకి రావాలంటే  

ఇక బీస్ట్ సినిమా విషయానికి వస్తే.. విజయ్ మూవీ భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 125.50 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే ఈ సినిమా 127 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో కలెక్షన్ల యాత్రను ప్రారంభించింది. అంటే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఇంకా 25 కోట్లకుపైగా షేర్, 40 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి 

  1. ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్నగానే ఆచార్య ఎలా కవర్ చేశా అని తెలిపిన రాంచరణ్!
  2. పొగాకు కంపెనీతో కాంట్రాక్టు రద్దు అనుకొన్న అక్షయ్ కుమార్

Leave a Comment