బల్లి శాస్త్రం దోషాలు – వాటి నివారణ మార్గాలు

బల్లి శాస్త్రం అంటే ఏమిటి? | Balli Sasthram In Telugu 2022

Balli  Sasthram:- బల్లి శాస్త్రం గురించి చాల మందికి ఇంకా తెలిసి ఉండక పోవచ్చు. మీరు బల్లి శాస్త్రము గురించి అనేక పుస్తకాలు మరియు పేపర్లు చదివి ఉంటారు. అలాగే వాస్తు దోష పరిష్కార పుస్తకాల్లో కూడా చదివింటారు. కాని మీకు తెలియని మరి కొన్ని బల్లి పడితే కలిగె దోషాలు మరియు వాటి వలన కలిగె అనార్థాలు గురించి  తెలుసుకొందం.

బల్లికి  జాతక శాస్త్రంలో ప్రముఖ మైన స్థానం ఉంది. హిందూ పురాణాల్లో అనేక మంది దేవుళ్ల మనకు ఎన్నో జంతువుల ముఖాలతో కనిపిస్తారు. సింహం ముఖంతో నరసింహ స్వామి, పంది ముఖంతో వరాహవతారం, ఏనుగు ముఖంతో గణపతి, పాము ముఖంతో నాగదేవత.

అయితే బల్లి ముఖంతో ఏ దేవతా కనిపించనప్పటికీ బల్లి అనేక శుభాలను, అశుభాలను కలిగిస్తుంది. బల్లి శరీరం మీద ఎక్కడ పడిందనే దానిని బట్టి అది శుభమా అశుభమా అని గౌలి పఠన శాస్త్రం ద్వారా పండితులు మనకు చెబుతూ వస్తున్నారు.

బల్లి శాస్త్రం వలన మగ వారికీ కలిగే దోషాలు 

ప్రతి మనిషి జీవితములో చెడు మరియు మంచి సంఘటనలు జరగటం అనేది సాధారణ విషయం. కాని ఒక సరిసృపం అంటే బల్లి మన జీవితాలను డిసైడ్ చేయ గలదు. కావున వీటి దగ్గర మనము ఎంత  జాగ్రతగా ఉన్న వాటి ప్రభావము మనకు ఉంటుంది. మగ వారిలో ఎక్కడ బల్లి పడితే అశుభము జరుగుతుందో తెలుసు కొందాం.

పురుశుల శరీర భాగం            అశుభం

 • వీపు పై కుడి వైపు    –         రాజ భయం
 • మోచేయి                 –       డబ్బు నష్టం
 • కుడి భుజం             –        కష్టాలు, సమస్యలు
 • ఎడమ భుజం       _           పదిమందిలో అగౌరవం జరుగుతుంది
 • తొడలు                _           దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి
 • మీసాలపై           _            కష్టాలు వెంటాడతాయి
 • కాలి వేళ్లపై          _          అనారోగ్య సమస్యలు
 • తలపై భాగాన     _           మరణం వెంటాడుతున్నట్లు
 • కుడి కన్ను        _            చేసిన పని విజయవంతం కాదు, అపజయం కలుగుతుంది
 • నుదురు పై       _            ఇతర సమస్యలతో చిక్కుకోవడం, విడిపోవడం
 • కుడి చెంప           _          బాధపడటం
 • పై పెదవి               _        కలహాలు వంటపడుతాయి
 • రెండు పెదవుల మధ్య _   మృత్యువు సంభవిస్తుంది

బల్లి శాస్త్రం వలన అడ  వారికీ కలిగె దోషాలు

అలగే అడ వారిలో కూడా బల్లి పడటం వలన వారికి జరిగే అనర్థాలు మరియు ఇతర కారణాలు మరియు సమస్యలు గురించి మనము తెలుసు కొందాం

స్త్రీల శరీర భాగం       అశుభం

తలపై             _          మరణ భయం

కొప్పు పై            _         రోగాల భయం

కుడి కన్ను          _        మనోవ్యధ, అనవసరమైన టెన్షన్స్

రెండు పెదవులపై_      కష్టాలు, సమస్యలు మనము ఎదుర్కోవాలి

వీపు పై                   _    మరణవార్త వింటారు

గోళ్ల పై                      _   చిన్న చిన్న కలహాలు, గొడవలు

ఎడమ చేయి          _    అనవసరమైన ఒత్తిడికి లోను కావటము

చీలమండము      _      కష్టాలు

పై పెదవి            _       విరోధములు కలుగుతాయి

బల్లి పడితే ఏమి చేయాలి? బల్లి దోష నివారణలు?

 • బల్లికి శబ్ధం చేసే సూక్ష్మ శక్తి ఉంది. అలాంటి బల్లికి తెలియక తొక్కేయడం లేదా, చంపేయడం వంటివి చేస్తే పాపమని శాస్త్రాలు చెబుతున్నాయి.
 • భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను ముందుగా పసిగట్టే శక్తి బల్లికి ఉండటం ద్వారానే కంచి కామాక్షి ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
 • కాబటి మనము తొందర పడి చేసిన పొరపాట్లు కు ఫలితము రావాలి అంటే కొందరు బంగారు బల్లి విగ్రహము ముట్టు కొంటె మంచిది అంటున్నారు.
 • బల్లి లేదా తొండ తల మీద నుంచి క్రిందకు దిగితే మంచిది కాదు. క్రింద నుంచి పైకి పాకి వెంటనే దిగితే మంచిది.
 • బల్లి  శరీరంపై ఎక్కడ పడినప్పటికీ వెంటనే తలస్నానం చేయాలి. దీపం పెట్టి, నైవేద్యంతో ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి.
 • శరీరంపై కొన్ని ప్రత్యేక స్థానాలందు బల్లి పడటం వల్ల వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి.
 • తల మీద పడితే కలహం, బ్రహ్మరంధ్రం మీద భయం, జుట్టు మీద అయితే కష్టం, వెనుక జుట్టు మీద పడితే మృత్యు భయం, జడమీద మృత్యు భయం వంటివి కలుగుతాయి.
 • కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు  బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం.
 • కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది.

Leave a Comment