IPL 2022 ఇండియా ప్రీమియం లీగ్ లో లక్నోతో కట్టినంగా జరిగింది, మ్యాచ్‌లో కేకేఆర్ ఓటమి తర్వత కోల్‌కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మాట్లాడుతూ యువ బ్యాటర్ రింకూ సింగ్ ఈ ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ తరఫున వెలుగుచూసిన అత్యుత్తమ ప్లేయర్ అని పేర్కొన్నాడు.
రాబోయే సీజన్లలోనూ కేకేఆర్ ఫ్రాంచైజీ అతనిపై పెట్టుబడి పెడుతుందని చెప్పారు. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో దాదాపు కేకేఆర్‌ను విజయపు అంచుల వరకు తీసుకెళ్లిన రింకూపై మెక్కల్లమ్ పోగార్థాలు కురిపించాడు.
చాలా మంది ప్లేయర్లు మిడిల్, లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయలేరు. కానీ రింకూ ఈ సంవత్సరం రెండు సందర్భాలలో జట్టు కోసం అద్భుతంగా ఆడాడు. అత్యంత క్రిటికల్ సిచువేషన్లో ఎంతో గొప్పగా రాణించాడు.
అతని ప్రదర్శన పట్ల నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఇకపోతే ఇంగ్లాండ్ కోచ్‌గా మారిన నేపథ్యంలో కేకేఆర్ ను వీడాల్సి వస్తోంది. అయినప్పటికీ నేను కేకేఆర్ ప్లేయర్లందరినీ ముఖ్యంగా రింకూను వారి ఆటతీరును అనుసరిస్తూనే ఉంటాను. గత కొన్నేళ్లుగా కేకేఆర్ తరఫున కోచ్‌గా మంచి అనుభవాన్నిగడిపినాను అని మెక్కల్లమ్ పేర్కొన్నాడు.