ఒక్కసారిగా చెలరేగిన విరాట్ కోహ్లి దెబ్బకి రికార్డ్ ను బద్దలకొట్టాడు !

IPL 2022 ఇండియా ప్రీమియం లీగ్ లో ఎవరు చేయలేని పని కేవలం విరాట్ కే సాధ్యం. నిన్న జరిగిన మ్యాచ్ లో విరాట్ ఒక్కసారిగా చేరేగాడు, 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 పరుగులు సాధించారు.

ఎప్పుడు కూడా ఎక్కువ సేపు ఆడకుండా నిన్న మ్యాచ్ లో బాగా రాణించారు. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్వేచ్చగా ఆడిన విరాట్ అభిమానులకు ఒకప్పటి తన ఆట రుచిని చూపించాడు.

ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా కూల్‌గా ఎంతో ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. ఈ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పైనే తన తొలి హాఫ్ సెంచరీ చేసిన  విరాట్ దానికి మించిన జోరును తాజా మ్యాచ్‌లో చూపించాడు.

విరాట్ బ్యాట్ నుంచి పరుగులు రావడంతో అతని పేరిట రికార్డుల మోత కూడా మోగింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ పలు అరుదైన రికార్డులను తన పేరిట రూపొందించారు.

15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ సార్లు ప్రతీ సీజన్‌లో వరుసగా 300కు పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌ల్లో విరాట్ 309 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి.

దాంతోనే విరాట్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో శిఖర్ ధావన్, సురేశ్ రైనా పేరిట ఉన్నరికార్డులను బ్రేక్ చేశాడు. విరాట్ ఇప్పటి వరకు 13 సార్లు 300కు పైగా పరుగులు చేయగా సురేశ్ రైనా, ధావన్ 12 సార్లు ఈ ఘనతను అందుకున్నారు.

RCB తరపున ఐపీఎల్‌లో ఏడువేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 57 పరుగుల వద్ద ఉన్నప్పుడు కోహ్లీ ఈ ఘనత సాధించాడు. 235 ఇన్నింగ్స్‌ల్లో ఏడు వేల పరుగుల మార్క్‌ను అందుకున్న కోహ్లీ ఐపీఎల్‌లో ఒక జట్టు తరపున అత్యధిక పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.

2008లో ఆర్‌సీబీలో జాయిన్‌ అయిన కోహ్లీ అప్పటి నుంచి అదే జట్టుకు ఆడుతూ వస్తున్నాడు. ఇందులో 424 పరుగులు చాంపియన్స్‌ లీగ్‌లో సాధించగా.. మిగతా పరుగులన్ని ఐపీఎల్‌లో వచ్చినవే.

గుజరాత్‌తో మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పిన బ్యాటర్ చరిత్రకెక్కాడు.

ఇప్పటి వరకు విరాట్ 23 సార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 150 ప్లస్ రన్స్ భాగస్వామ్యం 6 సార్లు, 200 పరుగుల పార్టన్‌ర్‌షిప్‌ మూడు సార్లు నమోదు చేశాడు.

గుజరాత్‌తో మ్యాచ్‌లో డుప్లెసిస్‌తో కలిసి మొదటి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన విరాట్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీల భాగస్వామ్యాలు నెలకొల్పిన బ్యాటర్ చరిత్రకెక్కాడు.

ఇప్పటి వరకు విరాట్ 23 సార్లు 100 పరుగులకు పైగా భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 150 ప్లస్ రన్స్ భాగస్వామ్యం 6 సార్లు, 200 పరుగుల  భాగ్యస్వామ్యం మూడు సార్లు నమోదు చేశాడు.

Leave a Comment