డేవిడ్ వార్నర్ కు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. మన ఇండియాకి, ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన వ్యక్తి. ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్, మాజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, ఢిల్లీ కేపిటల్స్ ఆటగాడు డేవిడ్ వార్నర్. క్రికెట్‌లోనే కాదు ఫన్నీ విషయాల్లో కూడా సందడి చేస్తుంటాడు.
క్రికెట్‌లో ఇక పరుగుల వరదే సృష్టిస్తుంటాడు. అప్పుడప్పుడూ టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు స్టెప్పులేస్తూ వీడియోలు విడుదల చేస్తూ హల్‌చల్ చేస్తుంటాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నంతవరకూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన వ్యక్తి .
ఇప్పుడు జట్టు మారాడు, ఢిల్లీ కేపిటల్స్ తరపున ఆడుతున్నాడు అక్కడ కూడా పరుగుల వారిదే. ఏప్రిల్ 20 అంటే బుధవారం పంజాబ్ కింగ్స్ లెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండవ ఆటగాడిగా నిలిచాడు. ఒకే ప్రత్యర్ధి జట్టుపై వేయి పరుగులు పూర్తి చేయడం. పంజాబ్ కింగ్స్ లెవెన్‌పై వేయి పరుగులు సాధించి, ఒక ప్రత్యర్ధిపై అత్యధిక పరుగులు సాధించిన రెండవ ఆటగాడిగా నిలిచాడు.
వార్నర్ కంటే ముందు రోహిత్ శర్మ కేకేఆర్ జట్టుపై 1 వేయి 18 పరుగులు చేశాడు. అదే సమయంలో డేవిడ్ వార్నర్ ఇటువంటిదే మరో రికార్డు నెలకొల్పేందుకు ఎంతోదూరంలో లేడు. పంజాబ్‌పై 1 వేయి 5 పరుగులు చేసిన.వార్నర్ కేకేఆర్ జట్టుపై ఇప్పటి వరకూ 976 పరుగులు చేశాడు. అంటే మరో 24 పరుగులు పూర్తయితే మరో ప్రత్యర్ధి జట్టుపై కూడా వేయి పరుగులు చేసిన ఘనత సాధిస్తాడు.
అంటే రెండు ప్రత్యర్ధి జట్లపై చెరో వేయి పరుగులు సాధించిన తొలి ఆటగాడు కానున్నాడు. విరాట్ కోహ్లి కోసం కూడా ఇలాంటి ఓ రికార్డు ఎదురు చూస్తోంది. కోహ్లీ సీఎస్కేపై ఇప్పటి వరకూ 949 పరుగులు చేశాడు. మరో 51 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీకు కూడా ఆ రికార్డు దక్కుతుంది.
గత సీజన్ వరకూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడిన డేవిడ్ వార్నర్ ఈసారి జట్టు మారాడు. ఢిల్లీ కేపిటల్స్ జట్టు 6.25 కోట్లకు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన డేవిడ్ వార్నర్ 191 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో 53 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
డేవిడ్ వార్నర్ :
- ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్ లో మాత్రమే విపలమైన అతడు మరోసారి జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ రెచ్చిపోయాడు.
- వరుసగా మూడు మ్యాచుల్లోనూ హాఫ్ సెంచరీలతో దుమ్మురేపాడు. లేటెస్ట్ గా పంజాబ్ పై డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 60 పరుగులు నాటౌట్ ; 10 ఫోర్లు, 1 సిక్సర్) అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీ క్యాపిటల్స్ కు 9 వికెట్ల సూపర్ విక్టరీ అందించాడు.
- ఈ క్రమంలో ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచులో 60 పరుగులు సాధించిన వార్నర్ బాబాయ్ థౌజండ్ వాలా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
- ఒకే ప్రాంఛైజీ పై 1000 పరుగులు సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డులెక్కాడు. ఈ మ్యాచ్ కు ముందు వరుకు పంజాబ్‌పై 21 మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 945 పరుగులు సాధించాడు. ఇప్పుడు 60 పరుగులు చేసిన వార్నర్ బాయ్ 1005 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ గతంలో కేకేఆర్‌పై 1000 పరుగులు సాధించాడు.