RCB అంటేనే అందరికి ఇష్టం అయిన టీం, ఎందుకు అంటే ఇండియా టీంకి చెందిన కెప్టెన్ కోహ్లి, బాగా బాటింగ్ ఆడుతారు, అందరిని మంచిగా ఫీల్డింగ్ చేపిస్తారు. కోహ్లికి అంటూ మంచి క్రికెటర్ అని మంచి గుర్తింపు చేసుకొన్నారు.
IPL సీజన్ ఫ్యాన్స్ కు కావాల్సిన మజా అందిస్తోంది. ప్రతి మ్యాచ్ హోరాహోరీగా సాగుతుండటంతో ఫ్యాన్స్ సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరుకు 18 మ్యాచులు జరిగాయి. ఇక ఈ సీజన్ లో అదరగొడుతోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుని పాయింట్స్ టేబుల్ లో మూడో స్థానంలో నిలిచింది .
పంజాబ్ కింగ్స్ తో ఓటమి తర్వాత మిగిలిన మూడు మ్యాచుల్లో తగ్గేదేలే అంటునారు డుప్లెసిస్ సేన. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ గా కానీ పిస్తున్నా ఆర్సీబీ ఈ సారి టైటిల్ ఫేవరెట్ గా కన్పిస్తోంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తిరుగులేని విజయాలను అందుకుంటోంది. ఇప్పటికే వరుస విజయాలతో సంతోషంగా ఉన్న ఆర్సీబీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.
శాండిల్‌వుడ్‌లో టాప్ మూవీ ప్రొడక్షన్ హౌస్ హొంబలె ఫిల్మ్స్ తో జట్టు కట్టినట్టు ప్రకటించింది ఆర్సీబీ. హొంబలె ఫిల్మ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్తో కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్‌ను నిర్మించింది ఈ నిర్మాణ సంస్థ.
ఫస్ట్ పార్ట్‌కు సీక్వెల్‌గా నిర్మించిన కేజీఎఫ్ చాఫ్టర్ 2 ఈ నెల 14వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీకి కొద్దిరోజుల ముందే- హొంబలె ఫిల్మ్స్ రాయల్ ఛాలెంజర్స్ ఫ్రాంఛైజీతో అసోసియేట్ అయినట్లు తెలిపింది.
ఈ విషయాన్ని వెల్లడించడానికి హొంబలె ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌస్ ఓ అద్దిరిపోయే టీజర్ ను రూపొందించింది. దీన్ని తన అధికారిక ట్విటార్ అకౌంట్లో పోస్ట్ చేసింది. 1:23 సెకెండ్ల నిడివి ఉన్న ఈ వీడియో- కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్‌కు ఏ మాత్రం తగ్గట్లేదు. కేజీఎఫ్ యాక్టర్స్ ఆర్సీబీ ప్లేయర్లను మిక్స్ చేస్తూ దీన్ని చిత్రీకరించింది.
పవర్ఫుల్ అధీరా క్యారెక్టర్లో నటించిన సంజయ్ దత్, ఆర్సీబీ కేప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రవీనా టండన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, యష్, విరాట్ కోహ్లీల కాంబినేషన్‌ను ఇందులో అద్భుతంగా మిక్స్ చేశారు.