వివిధ దేశాలన్ని వణికిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌, అసలు ఏం జరగనున్నది !

కరోన ఒక పెద్ద వైరస్‌ అనుకొన్నాం కానీ దీనికి మించినది మంకీపాక్స్‌, కరోన వాళ్ళే చాల మంది ప్రాణాలు కోల్పోయారు, ఈ వైరస్‌  వచ్చినపుడు ఏంతో మంది  ప్రాణాలు తన గుప్పెటలో పెట్టుకొన్నది, ఈ మహమ్మారి ఎప్పుడు వచ్చిందో గని అప్పటి నుండి వరుసనా ప్రజల ప్రాణాలు తీసుకొని పోతూనే ఉన్నదీ ఎంత జాగ్రత్తగా ఉన్న ఏదో ఒక రూపం లో ప్రజల ప్రాణాలు తీసుకొని వెళ్ళినది.

ఈ మహమ్మారి వల్లనే చాల మంది చిన్న పిల్లలకి వాళ్ళ కన్నా తల్లి, తండ్రి లేకుండా అనాధలను చేసింది,  ఇంకా కొంత మందికి వాళ్ళ కన్నా బిడ్డ లని దురంచేసింది. ఏంతో మందికి వాళ్ళ తోడు నిడ లేకుండా చేసింది.

ఈ మహమ్మారి, ఈ వైరస్‌ మొదటి వైరస్‌ నుండి ఇప్పుడు ఫోర్త్ వేవ్ దాక వచ్చింది ఈ నాలుగు దశ  దాక చాల మంది ప్రాణాలను తీసుకొన్నది, ప్రస్తుతం ఉన్న ఫోర్త్ వేవ్ కూడా చాల మంది ప్రజల ప్రాణాలను కోల్పోయారు.

ఇప్పుడు ఈ కరోన ని పక్కన పెట్టితే దీని కంటే ఫుల్ డేంజర్ అయ్యిన మంకీపాక్స్‌ రూపంలో మరో వైరస్‌ కొత్త సవాల్‌ విసురుతోంది. ప్రపంచవ్యాప‍్తంగా మంకీపాక్స్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది. మంకీపాక్స్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్యల గణనీయంగా పెరుగుతోంది.

ప్రజారోగ్యానికి మంకీపాక్స్‌ ముప్పు పొంచి ఉన్నదని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని, ఇప్పటివరకు 23 దేశాల్లో 257 కేసులు నమోదు అయినట్టు పేర్కొంది.

మరో 120 మందిలో లక్షణాలను గుర్తించామని వెల్లడించింది. కొన్ని దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వేగంగా వ్యాప్తిచెందుతున్నదని స్పష్టం చేసింది.

మరోవైపు ప్రభుత్వాలు కూడా మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వెంటనే వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని తెలిపింది.

మంకీపాక్స్‌పై అందరికి అవగాహన కల్పించాలని, వ్యాధి లక్షణాలను తెలియజేయాలని పేర్కొన్నది. ఒకవేళ వైరస్ సమూహ వ్యాప్తి కనుక ప్రారంభమైతే చిన్నారులు, రోగ నిరోధక శక్తి లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా మంకీ పాక్స్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం అధికారుల ఇచ్చిన సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో మంకీపాక్స్‌కు చికిత్స అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం మంకీ పాక్స్ లక్షణాలు. ఇక, అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్‌ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు, వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారు వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

ఐసొలేషన్‌లో ఉండి చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్సలు తీసుకోవాలి. ఈ వైరస్‌ ఇతరులకు సోకకుండా తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎలుక‌లు, కోతుల వంటి జంతువుల్లో గుర్తించిన‌ వైర‌స్ నుంచి ఈ వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ వస్తున్నాటు వైద్యనిపుణులు గుర్తించారు. ఈ వైర‌స్ మ‌ధ్య‌, ప‌శ్చిఆసియాలో ఎండెమిక్ ద‌శ‌కు చేర‌గా బ్రిట‌న్‌, అమెరికా, ఇజ్రాయిల్‌, ఫ్రాన్స్ వంటి దేశాల్లో విస్త‌రిస్తోంది.

ఇన్ఫెక్ష‌న్స్‌ను గుర్తించి నియంత్రించేందుకు ఎలుక‌లతో స‌హా పెంపుడు జంతువుల‌ను ప‌రీక్షించి మూడు వారాల పాటు క్వారంటైన్‌లో ఉంచాల‌ని ముఖ్యంగా వాటితో స‌న్నిహితంగా మెలిగే వారు ఈ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని బ్రిట‌న్ ఆరోగ్య భ‌ద్ర‌తా ఏజెన్సీ తాజా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

పెంపుడు జంతువులకు ఆహారం అందించటం, వాటిని శుభ్రం చేయటం వంటి పనులన్నీ మానేసి వాటికి దూరంగా ఉండాలని తెలియచేసారు. వీటికి దూరంగా ఉండడం వలన మీకు మీ ఆరోగ్యని జాగ్రతగా చూసుకోవచ్చు.

Leave a Comment