రియల్‌మీ మొబైల్ మార్కెట్‌లో మరో సాహసోపేతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.తాజాగా రియల్‌మీ రూపొందించిన GT కాన్సెప్ట్ ఫోన్ విశేషంగా చర్చనీయాంశంగా మారింది.ఈ ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన 10,000mAh బ్యాటరీను అమర్చారు.ఇది ఇప్పటివరకు ఒక స్మార్ట్‌ఫోన్‌లో సాధారణంగా కనిపించని బ్యాటరీ సామర్థ్యం కావడం విశేషం.
ఈ భారీ బ్యాటరీతో పాటు, రయల్‌మీ 320W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని టెస్ట్ చేయగా దీన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి అతి తక్కువ సమయం పడుతుందని కంపెనీ పేర్కొంది.భారీ బ్యాటరీ ఉన్నా కూడా ఈ ఫోన్ డిజైన్‌ను స్లిమ్‌గా,ఆధునికంగా ఉంచడంలో రియల్‌మీ నిపుణత చూపింది.
ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది ఫ్లాగ్‌షిప్ క్వాలిటీ గల కెమెరా, అత్యాధునిక ప్రాసెసర్ మరియు మెమొరీ వేరియంట్లతో రాబోతుందని అంచనాలు ఉన్నాయి. ఇందులో AMOLED డిస్‌ప్లే, అధునాతన యూజర్ ఇంటర్‌ఫేస్, మరియు AI ఆధారిత కెమెరా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఈ కాన్సెప్ట్ డిజైన్ ఇప్పటివరకు కేవలం ప్రదర్శనకే పరిమితమైనా, దీన్ని నిజంగా మార్కెట్లోకి తీసుకురావాలని రియల్‌మీ యోచిస్తే, స్మార్ట్‌ఫోన్ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవచ్చు.