2026లో ఆపిల్ కంపెనీ భారీ మార్పులతో కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయనుంది. iPhone 18 సిరీస్‌తో పాటు తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా విడుదల చేయబోతుందని వార్తలు వచ్చాయి. ఈసారి ఆపిల్ రెండు విడతలుగా ఐఫోన్‌లను విడుదల చేయాలని యోచిస్తోంది. మొదట 2026 చివర్లో iPhone 18 Pro, Pro Max, మరియు కొత్త ultra-slim iPhone 18 Air రానున్నాయి. తరువాత 2027 ప్రారంభంలో మిగిలిన సాధారణ మోడల్స్ విడుదల అవుతాయి. ఇది తయారీ వ్యయాన్ని తగ్గించడానికీ, భారతదేశంలోని యూనిట్లను ఎక్కువగా వినియోగించడానికీ సహాయపడుతుంది.
iPhone 18 Air 6.6 అంగుళాల తక్కువ బరువు మరియు స్లిమ్ డిజైన్‌తో వస్తుందని అంటున్నారు. ఇక 2026లో ఆపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను కూడా విడుదల చేయనుంది. ఇది 7.8 అంగుళాల లోపలి డిస్‌ప్లే మరియు 5.5 అంగుళాల బాహ్య స్క్రీన్‌తో వస్తుంది. స్క్రీన్ మీద ముడతలు కనిపించకుండా చేసే సాంకేతికతను ఉపయోగిస్తున్నారని సమాచారం. ఇందులో Face IDకు బదులు సైడ్ మౌంటెడ్ టచ్ ఐడీ ఇవ్వనున్నారు. ధర సుమారుగా ₹1.6 లక్షల నుండి ₹2 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఆపిల్ ఫోల్డబుల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం వల్ల ఫోన్ రంగంలో పెద్ద మార్పులు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మీరెదురు చూస్తున్న మోడల్ ఏది?