సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ విడుదల: శక్తివంతమైన కెమెరా ఫీచర్లు

సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ S25 ఎడ్జ్‌ను అధికారికంగా విడుదల చేసింది.ఈ ఫోన్ స్మార్ట్‌ఫోన్ డిజైన్, కెమెరా టెక్నాలజీ, మరియు పనితీరిలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. అత్యంత సన్నని బాడీతో (మొత్తం 5.8 మిల్లీమీటర్లు) ఇది గెలాక్సీ సిరీస్‌లో ఇప్పటివరకు విడుదలైన అత్యంత సన్నని ఫోన్‌గా గుర్తింపు పొందింది.

గెలాక్సీ S25 ఎడ్జ్‌లో 6.7 అంగుళాల QHD AMOLED డిస్‌ప్లే ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ ద్వారా మరింత స్మూత్ యూజర్ అనుభూతిని అందిస్తుంది. ఫోన్‌లో కొత్త Snapdragon 8 జెన్ 4 ప్రాసెసర్ వాడబడింది, ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్‌ కోసం అధిక పనితీరు కలిగి ఉంటుంది.

కెమెరా సెక్షన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 10MP సెల్ఫీ కెమెరాతో శక్తివంతమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది.Corning Gorilla Glass Ceramic 2తో రక్షణను కలిగి ఉండటంతో పాటు, టైటానియం ఫ్రేమ్ కూడా durabilityను పెంచుతుంది.

బ్యాటరీ 3,900mAh సామర్థ్యంతో పాటు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.ఈ ఫోన్ Android 15తో ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తుంది.

అందుబాటులో ఉండే రంగులు: టైటానియం బ్లూ, టైటానియం సిల్వర్, టైటానియం బ్లాక్.

సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఫోన్ డిజైన్, ఫీచర్ల పరంగా మైలురాయిగా నిలవబోతుంది.

Leave a Comment