F3 సినిమాకు సంభందించిన రెండురోజుల కలెక్షన్స్ ఎంతంటే !

F3 Movie 2 Days Collections :

F3 సినిమా మే 27 నాడు సినిమా హాల్స్ కి రిలీజ్ అయ్యినది. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణo లో  తేరక్కినది. ఈ సినిమా మొత్తం కామెడీ తో రూపొందించినది. ఈ సినిమాలో హీరోస్ గా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించడం జరిగినది, అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా తమన్నా, మేహరిన్ నటించడం జరిగినది. F2 సినిమా ఎంత బాగుందో దానికి డబుల్ గా సినిమా వచ్చింది.  ఈ సినిమా మొత్తం మంచి కామెడీ గా ఉన్నదని తెలియచేసారు, ఈ సినిమాలో పాటలు, డాన్స్ సినిమా కు సంభందించినది అంత చక్కగా ఉన్నదని పేర్కొన్నారు.

ప్రేక్షకులకు  ఈ సినిమాకు కావాల్సినంత వినోదం ఉండటంతో కామన్ ఆడియన్స్ ఈ సినిమాకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమాతో పలకరించారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా,వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ నటిస్తుండగా అదనంగా సోనాల్ చౌహాన్ నటించింది. ఒక ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే నటించింది. ఈ శుక్రవారం  ఈ సినిమాను యూఎస్‌లో ప్రపంచ వ్యాప్తంగా 1400కు పైగా విడుదలైంది.  మొత్తంగా రెండు రోజుల ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ వివరాలు.

ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కూడా కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోష్‌ని కనబరిచింది. రెండో రోజు ఈ చిత్రం 9.85కోట్ల షేర్‌ రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రెండో రోజు రూ.8.4 కోట్లను వసూలు చేసింది.

ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు రూ.18.77 కోట్ల షేర్‌ రాబట్టింది. ఓవర్సీస్‌లోనూ ఎఫ్‌3కి మంచి ఆదరణ లభిస్తోంది. అమెరికాలో ఈ చిత్రం 750కే డాలర్లను రాబట్టింది. వారాంతంలో ఈ చిత్రం అక్కడ 1 మిలియన్‌ డాలర్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్డాలు అంచనా వేస్తున్నాయి.

F3 MOVIE రెండు రోజుల కలెక్షన్స్‌ :

  • నైజాం (తెలంగాణ):  రూ. 12.20 కోట్లు / రూ. 18 కోట్లు
  • సీడెడ్ (రాయలసీమ): రూ. 3.59 కోట్లు / రూ. 8.40 కోట్లు
  • ఉత్తరాంధ్ర: 3.36 కోట్లు / రూ. 7 కోట్లు
  • ఈస్ట్: .1.88 కోట్లు / రూ. 4.50 కోట్లు
  • వెస్ట్: రూ.. 1.54 కోట్లు / రూ. 4 కోట్లు
  • గుంటూరు: 2.06 కోట్లు / రూ. 5 కోట్లు
  • కృష్ణా : 1.77 కోట్లు / రూ.4.50 కోట్లు
  • నెల్లూరు:1.15 కోట్లు / రూ. 2.4 కోట్లు 
  • తెలంగాణ (TG) + ఆంధ్ర ప్రదేశ్ (AP) Total -రూ. 27.55 కోట్లు (44.40 కోట్ల గ్రాస్) / రూ. 53.80 కోట్లు
  • కర్ణాటక + రెస్టాఫ్ భారత్    :రూ. 1.80 కోట్లు జ రూ. 3.40 కోట్లు
  • ఓవర్సీస్ :రూ.  5.20 కోట్లు /  రూ. 5.20 కోట్లు    
  • ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 34.55 కోట్లు / రూ. 58.08 కోట్ల గ్రాస్ ) రూ. 63.60 కోట్లు  / రూ 64.50 కోట్లు.
  • Day 1 WW Share : రూ. 13.65 కోట్లు
  • Day 2 WW Share : రూ. 9.85 కోట్లు
  • Day 2 WW Share : రూ. 11.05 కోట్లు

పైన ఇచ్చిన విధంగా ఏ ప్రాంతంలో ఏ విధంగా మూవీ కలెక్షన్స్ వాసులు అయ్యినాయో పైన తెలిచేయడం జరిగినది.

Leave a Comment