లిమ్సి టాబ్లెట్ వలన కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
limcee tablet uses :- లిమ్సి టాబ్లెట్ని శరీరంలో విటమిన్ c లోపాన్ని అధికమించడానికి ఉపయోగిస్తారు. ఇది పెరుగుదల, అభివృద్ధి మరియు కణజాల మరమ్మత్తులో సహాయపడుతుంది.ఇందులో ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి మరియు సోడియం ఆస్కార్బేట్ అనే కీలక పదార్థాలు ఇందులో ఉంటాయి. ఇది శరీరంలో ఇనుము యొక్క ఆహార శోషణను ప్రోత్సహిస్తుంది, గాయం నయం చేయడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా దీనిని సాధారణంగా పాలిచ్చే తల్లులు మరియు గర్భిణీ స్త్రీలకు కూడా సిఫార్సు చేస్తారు.
లిమ్సి టాబ్లెట్ వలన కలిగే ప్రయోజనాలు|Limcee Tablet Uses In Telugu
ఈ క్రింద లిమ్స్ టాబ్లెట్ వలన ఏమి ప్రయోజనాలు కల్గుతాయో తెలుకుందాం.
- లిమ్స్ టాబ్లెట్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
- ఈ టాబ్లెట్ అలర్జిల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
- ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ని పెంచుతాయి.
-
ఈ టాబ్లెట్ ఆరోగ్యకరమైన చర్మం, గోర్లు మరియు జుట్టు పెరగడానికి ప్రోత్సహిస్తుంది.
- గాయాలు మనుటకు దీనిని వాడతారు.
- ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన విటమిన్ సి లోపాలను నివారిస్తుంది.
- ఈ టాబ్లెట్ వాడటం వలన ఆక్సీకరణ ఒత్తిడి నుండి మన శరీర కణాలను రక్షిస్తుంది.
- ఈ లిమ్సి టాబ్లెట్ అన్ని శరీర కణజాలాలు మరియు నిర్మాణాల పెరుగుదలకు సహయంచేస్తుంది.
-
ఈ టాబ్లెట్ వేసుకోవడం వలన కొల్లాజెన్ ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తుంది, ఇది గాయం నయం, చర్మం మృదులాస్థి మరియు ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడుతుంది.
- ఈ టాబ్లెట్ చిగుళ్ల నుంచి రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు మొదలైన పరిస్థితులను నివారిస్తుంది.
- ఈ టాబ్లెట్ తీసుకోవటం వలన శరీరంలో ఐరన్ శోషణ మెరుగుపడుతుంది.
లిమ్సి టాబ్లెట్ వలన కలిగే దుష్ప్రభావాలు|Limcee Tablet Side Effects In Telugu
లిమ్సి టాబ్లెట్ వాడటం వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా సంభవిస్తాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.లిమ్సి టాబ్లెట్ వలన ఈ క్రింది దుష్ప్రభావాలు వస్తాయి.
- వాంతులు అవ్వటం
- కడుపు నొప్పి
- మూత్ర విసర్జన కష్టం లేదా నొప్పి
- అతిసారం
- గుండెల్లో మంట
- తలతిరగడం
- దిగువ వెన్నునొప్పి
- కడుపు తిమ్మిరి
- తల నొప్పి
- మూత్రంలో రక్తం
- దురద
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం
- కండరాల తిమ్మిరి
- వికారం
- సెఫాలాల్జియా
లిమ్సీ టాబ్లెట్ ఎంత మోతాదులో తీసుకోవాలి|Dosage Of Limcee Tablet In Telugu
లిమ్సి టాబ్లెట్ ని ఎలా అంటే అలా వాడకూడదు. వయస్సు, శరీర బరువు మరియు జీవసంబంధమైన పారామితులను బట్టి తగిన మోతాదును ఈ టాబ్లెట్ వేసుకోవాలి.విటమిన్ c మన శరీరంలో ఉన్న స్థాయి బట్టి దీనిని తీసుకోవాలి.ఈ టాబ్లెట్స్ ని నిర్ణిత సమయంలోనే తీసుకోవాలి.ఒక వేళా మీరు తీసుకోవటం మర్చిపోతే డోస్ ని రెట్టింపు చేసి తీసుకోకూడదు.వీటిని వాడె ముందు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి.
గమనిక :- మీరు లిమ్సి టాబ్లెట్ని వాడే ముందు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి
- సిట్రజిన్ టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు!
- azithromycin టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !
- మల్టీవిటమిన్ టాబ్లెట్స్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు!
- విటమిన్ సి టాబ్లెట్ వలన కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు !