వివేకానంద సూక్తులు :-స్వామి వివేకానందుని పేరు చెబితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఇప్పటికీ ఎంతో గౌరవిస్తారు. స్వామి వివేకానంద జనవరి 12, 1863 లో జన్మించారు.జూలై 4, 1902న మరణించాడు,స్వామి వివేకానంద ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి. ఇతని పూర్వ నామం నరేంద్ర నాథ్ దత్తా.రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడు. వేదాంత, యోగ తత్త్వ శాస్త్రములలో సమాజముపై అత్యంత ప్రభావము కలిగించిన ఒక ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు.ఇప్పుడు మనం స్వామి వివేకానంద తెలిపిన కొన్ని సూక్తులను తెలుసుకుందాం.
స్వామి వివేకానంద సూక్తులు | Vivekananda Quotes In Telugu
- దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే…
- నీ వేనుకేముంది, ముందేముంది అనేది … నీ కనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం.
- చేడు తలచేవారు,కీడు తలపెట్టేవారు,ప్రశాంతత కోల్పోతారు, వెలుగు చూడరు.
- భయపడుతూ బ్రతికేవానికి ఎప్పుడూ ఆపదలు వస్తుంటాయి.
- బలమే జీవితం.బలహీనతే మరణం.
- శక్తి అనేది డబ్బులో లేదు మంచితనంలో, పవిత్రతలో ఉంది.
- కాలం మనది కానప్పుడు ఇక మౌనం ఉత్తమం మిత్రమా…
- ఓ యువతా మేలుకో.. నిద్ర నుండి మేల్కొని, గ్యమం చేరే వరకు విశ్రమించకండి.
- అసలు పని చేయకుండా బద్దకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడు ఉత్తముడు.
- ధర్మానికి,నీతికి కొలతలు లేవు.అనురాగానికి,ఆప్యాయతకి హద్దులు లేవు.
- లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమౌతుంది
- త చిన్న పనైనా సవ్యంగా, నమ్మకంగా చేస్తే , మంచి ఫలితాన్నిస్తుంది
- మనం మాట్లాడే మాటలమీదే మన జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే సరిగా మాట్లాడడం కోసం ఎంత శ్రమించినా తప్పులేదు
- మ్మల్ని బలవంతులుగా చేసే ప్రతీ ఆశయాన్ని స్వీకరించండి. బలహీన పరిచే ప్రతీ ఆలోచనను తిరస్కరించండి.
- సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించే వారు ధన్యులు.
- మీతో మీరు ఒక్కసారి అయినా మాట్లాడుకోండి. లేకపోతే ప్రపంచంలోనే ఒక తెలివైన వ్యక్తిని కలవడం మీరు కోల్పోతారు.
- ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే…ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది .
- అపారమైన విశ్వాసం అనంతమైన శక్తి ..ఇవే విజయ సాధనకు మార్గాలు.
- బయపడకు .ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు .కలంతో పాటు ముందుకు సాగిపో . నీ ఆత్మ శక్తి ని మరలా పెంచుకో..
- స్థిరమైన గమ్యం ,కచ్చితమైన మార్గం రాజీలేని ప్రయత్నం”’ ఈ మూడు ఉంటె విజయం కచ్చితంగా మీది అవుతుంది.
- బద్ధకం కనబడని శత్రువు.వివేకం విడిపోని మిత్రుడు.
- జీవితం అనేది ఒక పరుగు పందెం… ఎల్లప్పుడూ సిద్దంగా ఉండాలి…
- ప్రేమ,నిజాయితి,పవిత్రత ఉండే వారిని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు.
- లేవండి, మేల్కొలపండి మరియు లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి.
- మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనస్సు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు.
- ప్రతి మనిషిలోని మంచిని చూడటం నేర్చుకుంటే మనలోని మంచి పెరుగుతుంది.
- ప్రేమ,కోపం ఒకదానికి కొకటి వ్యతిరేకం.
- బద్దకమే అసలు పాపం,అదే పేదరికానికి కారణం.
- డబ్బులేనివాడు కాదు పేదవాడు,జీవితంలో ఒక ఆశయం అంటూ లేనివాడు నిజమైన పేదవాడు.
- గొప్ప కార్యలేప్పుడు గొప్ప త్యగాలవల్లె సాధించగలరు.
- ధీరులు సత్య మార్గాన్ని ఎప్పుడూ తప్పరు.
- మనిషి ఉన్నతుడా కదా అన్నది అతడి విజయాల్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి.
- జ్ఞాన సముపార్జనకు ప్రశాంతమైన మనసే ప్రధానం.
- ఏ ఒక్క రోజైనా నీకు సమస్యలు ఎదురుకాలేదంటే, నువ్వు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నవని అర్ధం.
- తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధిస్తాడు. కానీ వివేకి ప్రతీ పనిని తనకు నచ్చే రీతిలో మలచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు.
- వినయం లేని విద్యా, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలిలేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్ధం.
- సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించే వారు ధన్యులు.
- జీవితంలో ధనాన్ని కోల్పోయినా పర్వాలేదు.. కానీ మీ క్యారెక్టర్ ను కోల్పోతే మాత్రం అంతా కోల్పోయినట్టే.
- మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ఆశయం మనకు గుర్తుండాలి.అప్పుడే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి.
- మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం.. ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు. ఎందుకంటే విజయమనేది అంతం కాదు.. ఓటమి అనేది చివరి మెట్టు కాదు..
- పాజిటివ్ మైండ్ తో ఉండటం.. అలసటను ఆనందంగా స్వీకరించడం.. ఇవే గెలుపును కాంక్షించే ప్రాథమిక లక్షణాలు.
- నిజాన్ని త్రికరణశుద్ధిగా నమ్మితేనే విజయం వరిస్తుంది. నెమ్మదిగా అయినా సరే, మనం జయించి తీరుతాం.
- వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం.
- ఈ ప్రపంచమే గొప్ప వ్యాయామశాల. మనల్ని మనం ఎప్పుడూ బలంగా మార్చుకోవడానికే మనం ఇక్కడికి వస్తుంటాం.
- నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి.. విజయం మీ వెంటే ఉంటుంది.
- మహిళా సాధికారత, ప్రజల్లో మేల్కొలుపు ప్రథమంగా ఉండాలి. అప్పుడే మీ ప్రాంతానికి మరియు మన భారతదేశానికి అంతా మంచి జరుగుతుంది.
- ఆశ్రద్ద ఇబ్బంది ని తెచ్చి పెడుతుంది.
- ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు.. కొండంత ప్రమాదాన్ని సైతం ఆపొచ్చు. కానీ అదే ఒక్క క్షణం ఓపిక లేకుంటే మీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది.
- ప్రతిరోజూ ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు.
- దేవునిపై నమ్మకం లేనివాడు కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడు నా దృష్టిలో నాస్తికుడు.
ఇవి కూడా చదవండి :-
- జాతిపిత.. మహాత్మా గాంధీ కోట్స్ మరియు జీవిత సత్యాలు మీ అందరి కోసం!
- మంచి Smile Quotes తెలుగులో మీ అందరి కోసం!
- జీవితం(Life) Quotes మీ అందరి కోసం !
- తమాషా కోట్స్ మీ అందరి కోసం!