మహాత్మా గాంధీ :-గాంధీ గారి పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.గుజరాత్ లోని పోరుబందరులో అక్టోబరు 2, 1869లో జన్మించారు. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడైన గాంధీని ప్రజలు జాతిపితగా గౌరవిస్తారు. సత్యము, అహింసలనే ఆయుధాలతో దేశానికి స్వరాజ్యం సంపాదించిన అగ్రగణ్యులు.మహాత్ముడు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము లాంటి విధానాలతో తెల్లవారిని గడగడలాండించిన ధీశాలి.
జాతి పిత మహాత్మా గాంధీ సూక్తులు|Mahatma Gandhi Quotes In Telugu
- విద్యను దాచుకోవడం కన్నా అందరికి పంచితే మరింత పెరుగుతుంది.
- మరణానికి భయపడడం అంటే, చినిగిపోయినా బట్టని వదిలేందుకు భయపడడం.
- నిరక్షరాస్యురాలైన తల్లి తన పిల్లల్ని నిండు హృదయంతో ప్రేమిస్తుంది.
- ఈ ప్రపంచంలో నువ్వు చూడాలనుకున్న మార్పు మొదట నీతోనే మొదలవ్వాలి.
- శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
- ఒక మనిషి గొప్పతనం అతని మెదడులో కాదు.హృదయంలో ఉంటుంది.
- గర్వం మనిషిని ఓటమి వైపు నడిపిస్తుంది.
- ఎంత గొప్పగా జివించవో నీ చేతులు చెప్పాలి…ఎంత గొప్పగా మరణించావో ఇతరులు చెప్పాలి.
- నేటి నీ చేతులు రేపటి నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి.
- సత్యం భగవంతుడి కన్నా గొప్పది.
- విశ్వాసం అనేది కొద్ది పాటి గాలికి వాలి పోయేది కాదు. .హిమాలయాల అంత స్తిరమైనది.
- మీరు చేసే పనికి ఫలితమేమిటో మీకు ముందుగా తెలియకపోవచ్చు, కానీ మీరు ఏమీ చేయకపోతే, ఫలితాలు ఎప్పటికీ చూడలేరు
- మీరు మానవత్వంపై విశ్వాసం కోల్పోకూడదు. మానవత్వం ఒక మహాసముద్రం; సముద్రం లోని కొన్ని చుక్కలు కలుషితమైనంత మాత్రాన, సముద్రం కలుషితమైపోదు.
- నా దగ్గర ప్రేమ తప్ప మరో ఆయుధం లేదు. ప్రపంచంతో స్నేహం చేసుకోవడమే నా గమ్యం.
- కష్టపడి పని చేయని వ్యక్తీకి తిండి తినే హక్కు లేదు.
- సహాయం చేస్తే మరిచిపో,సహాయం పొందితే గుర్తుంచుకో
- వ్యక్తిత్వాన్ని కోల్పోయిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయినట్లే
- ఆత్మ వంచన, పరనింద చేసేవారు తమ పతనాన్ని తాము కొనితేచ్చుకున్నట్లే.
- లేని గొప్పదనం ఉందని చెపితే ఉన్న గొప్పదనం కాస్త ఉదిపోతుంది.
- అహింసకు మించిన ఆయుధం లేదు.
- మీ మాటలు ఎల్లప్పుడు ఉన్నతంగా ఉండాలి. ఎందుకంటే మీ మాటలు మీ చేతల్లో ప్రతిబింబిస్తాయి
- మనిషి ఆశలు తీరడానికి భూవిపై దారి ఉందేమో కానీ, దురాశకు తీరడానికి దారి లేదు,ఉండదు.
- శారీరక సామర్థ్యం నుండి బలం రాదు. అది లొంగని సంకల్పం నుండి వస్తుంది.
- నిన్న. రేపు . జీవితంలో మన చేతిలో లేనివి, మనం మార్చలేని రెండు రోజులు.
- మీరు ధైర్యంగా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ భయ పెట్టలేరు.
- ప్రేమ, అధికార వాంఛను అధిగమించిన రోజున, ప్రపంచానికి శాంతి తెలుస్తుంది.
- మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది. ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది.
- మొదట వారు మిమ్మల్ని విస్మరిస్తారు, తరువాత మిమ్మల్ని చూసి నవ్వుతారు, తరువాత వారు మీతో పోరాడుతారు, చివరిగా మీరు గెలుస్తారు
- భయం వల్ల పొందే అధిపత్యం కంటే, అభిమానుల్లో లబించే అధిపత్యం ఎన్నో రెట్లు ఉత్తమమైనది.
- చదువులో ఆనందాన్ని పొందితే, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొంటావు.
- ఎక్కడ ప్రేమ ఉందొ అక్కడ దేవుడు ఉంటాడు.
- ఈ ప్రపంచం మనిషి అవసరాలను తిర్చగలదుకానీ మనిషి కోర్కెలను ఎప్పటికి తిర్చలేదు.
- మేధావులు మాట్లాడతారు,మూర్ఖులు వాదిస్తారు.
- సత్యం ఒక్కటే జీవితాన్ని సన్మార్గంలో తీసుకొని వస్తుంది.
- ఎక్కువ తక్కువలు కుల మత బేధాలు ఉండటం మనవ జాతికి అవమానకరం.
- నిన్ను నువ్వు కనుగొనడానికి మార్గం, ఇతరుల సేవలో నిన్ను నువ్వు మరిచిపోవడమే.
- ప్రజలేవేర్లు . ప్రభుత్వమే ఫలం, వేర్లు తియ్యగా ఉంటేనే, పండు తియ్యగా ఉంటుంది.
- ప్రపంచములో మానవుని అవసరానికి సరిపడు సంపద ఉంది; అంతే గాని ఆశకు సరిపడు హద్దు లేదు.
- మంచి పుస్తకాలు మన చెంత ఉంటె మంచి మిత్రుడు లేని లోటు తిరినట్టే.
- పట్టుదల కళలను నెరవేరూస్తుంది . అది అంతు లేని ఆనందాన్ని ఇస్తుంది.
- రేపు మరణిస్తానాన్న ఆలోచనతో జీవించు… శాశ్వితంగా ఉంటానన్న భావనతో విజ్ఞానాన్ని సంపాదించు.
- ఎవరైనా మనకు ఇచ్చేది తాత్కాలికమైనది.కృషితో సంపాదించుకోనేది శాశ్వితమైనది.
- బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమ అనేది బలవంతుల లక్షణం
- ఓటు,సత్యాగ్రహం ఈ రెండూ ప్రజల చేతిలోని ఆయుధాలు.
- సాధ్యమనుకుంటే ఎంతటి పనైనా సులువుగా పూర్తవుతుంది.
- ప్రేమ ఉన్నచోట జీవితం ఉంటుంది. పగ ఉన్నచోట నాశనం ఉంటుంది.
- త్యాగం ఎంత నిస్వార్థంగా ఉంటె, అభివృద్ధి అంత ఎక్కువగా ఉంటుంది.
- కుండెడు బోధనలు కంటే గరిటెడు ఆచరణ మేలు.
- విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదు.
- మితిమీరిన ఓర్పు పిరికితనం అవుతుంది.
ఇవి కూడా చదవండి :-
- మంచి Smile Quotes తెలుగులో మీ అందరి కోసం
- జీవితం(Life) Quotes మీ అందరి కోసం !
- తమాషా కోట్స్ మీ అందరి కోసం|
- స్నేహం కవితలు మీ అందరి కోసం!