పుట్టిన రోజు కవితలు|Happy Birth Day Quotes In Telugu
పుట్టిన రోజు కవితలు:- మనమందరం పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటాం. పెద్దవాళ్ళతో పోలిస్తే చిన్న పిల్లలు ఎక్కువ ఇష్టంతో వారి పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటారు. మీ పిల్లలకు,పెద్దలకు ,స్నేహితులకు, బంధువులకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియ చేయాలి అని చూస్తునారా అయితే ఈ క్రింద తెలుగు లో ఉన్న హ్యాపీ బర్త్ డే కోట్స్ ని చూడండి.
పుట్టిన రోజు కవితలు|Happy Birth Day Quotes In Telugu
- ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు
- నువ్వు నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ, నూరేళ్ళు హాయిగా వర్థిల్లాలి.పుట్టిన రోజు శుభాకాంక్షలు
- భవిష్యత్తులో ఉన్నత శికరాలకు చేరాలని మనసారా ఆశిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు
- ఈ సంవత్సరం నీవు తలపెట్టిన అన్ని పనులలో విజయం సాధించే శక్తి ఆ భగవంతుడు నీకు ఇవ్వాలని కోరుకుంటూ…పుట్టిన రోజు శుభాకాంక్షలు
- తండ్రిగా మీరు చూపిన బాట మాకు పూల బాట. నాన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నీవు తొలిసారిగా ‘అమ్మ’ అని పలికిన మాటలు నేను ఎప్పటికి మరువలేను కన్నా… నువ్వు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.పుట్టిన రోజు శుభాకాంక్షలు
- గెలవాలంటే ముందు ప్రయత్నించాలి అని ఎప్పుడు చెబుతూ ఉండే మా నాన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
- మనం చిన్నప్పుడు చేసిన అల్లరి నేనెప్పటికి మర్చిపోలేను. మన బాల్యం గుర్తుకు వస్తే అందులో ఎక్కువగా ఉండేది నీ జ్ఞాపకాలే చెల్లి. అంతటి మంచి జ్ఞాపకాలు మిగిల్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- పేరుకి తమ్ముడివే అయినా నా పెద్ద కొడుకువి నీవే. ఇటువంటి పుట్టినరోజులు నువ్వు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నువ్వు నా చెల్లెలివి మాత్రమే కాదు.. నా జీవితంలో నాకు అవసరమైన సమయంలో అండగా నిలిచిన ధైర్యం నువ్వు. అలాంటి నీవు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.పుట్టినరోజు శుభాకాంక్షలు.
- ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆశిస్తూ ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు.
- నీ జీవితములో ప్రతి క్షణము సంతోషముగా సాగాలని కోరుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
- నిండు నూరేళ్ళు హాయిగా మనసారా నవ్వుతూ జీవించాలని కోరుకొంటూ జన్మదిన శుభాకాంక్షలు.
- కొవ్వోతులను వెలిగించి మీ జీవితములోని ప్రత్యేక వెలుగుని కోరుకొంటూ జన్మదిన శుభాకాంక్షలు.
- నువ్వు అనుకొన్నది సాదిస్తూ నిండు నూరేళ్ళు సంతోషముగా ఉండాలని కోరుతూ పుట్టిన రోజు శుభాకాంక్షలు.
- నేను జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నన్ను ప్రోత్సహించిన వారిలో ముందున్నది నువ్వే అక్క. అంతటి గొప్ప వ్యక్తి అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నన్ను మీ భార్యగానే కాకుండా మీ మొదటి బిడ్డగా చూసుకునే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నేను మిమ్మల్ని అనవసరంగా విసిగించినా సరే… నన్ను ఓపికగా భరించే మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నీతో స్నేహం నేను ఎన్నటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. అంతటి మంచి జ్ఞాపకం నాకు ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
- దేవుడు మనకు జీవితాన్ని బహుమతిగా ఇచ్చాడు; మనం బాగా జీవించడం మన చేతిల్లోనే ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు.
- బహుమతులు కాదు, బంధాలు ముఖ్యం. నా ఆత్మీయ బంధువుకు జన్మదిన శుభాకాంక్షలు.
- నువ్వు ఎల్లప్పుడూ హాయిగా సుఖసంతోషలతో ఉండాలని కోరుకుంటూ…జన్మదిన శుభాకాంక్షలు..
- మీకెంతో ప్రియమైన వారితో ఈ రోజు ఆనందగా ఆహ్లాదకరంగా గడపాలని, ఈ రోజు మీ జీవితంలో మరువలేని అత్యుత్తమ జ్ఞాపకంగా నిలవాలని ఆశిస్తూ…జన్మదిన శుభాకాంక్షలు.
- నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనసారా కోరుతూ “అమ్మా” పుట్టినరోజు శుభాకాంక్షలు
- అమ్మా ప్రేమ తర్వాతే ఇంకెవ్వరి ప్రేమ అయినా అని నాకు తెలిసేలా చేసిన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
- దేవుడు అన్నిచోట్ల ఉండలేక సృస్థించిన పాత్ర అమ్మా!! అంతటి గొప్పదైన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
- నీవు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో నిండు నూరేళ్ళు సంతోషముగా ఉండాలని దేవుని ప్రార్థిస్తూ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- నువ్వు గడిపే ప్రతి క్షణం ఆనందంగా ఉండాలని ప్రతి పుట్టినరోజు నీకు రెట్టింపు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా… పుట్టినరోజు శుభాకాంక్షలు
- పసిపాపల నవ్వులో, వెండి వెన్నెల వెలుగులో, కనువిందు చేసే బంధాల మధ్యలో, చిరునవ్వు సాక్ష్యంగా చెపుతున్న హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- అడుగుని ఆపే అవరోధాలే, నీ గెలుపుకు తొలి సోపానలు కావాలి, అలజడి రేపే ఆలోచనలు, నీ ఆఖరి గమ్యాన్ని నిర్దేశించాలి, కలతను పంచె కన్నీరు అయిన, నీ స్పర్శ తో చిరునవ్వుగా మారాలి, తలపెట్టే ప్రతి పనిలో నువ్వే విజయ బహుటా ఎగరవేయాలి అని ఆశిస్తూ, నా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- ఒక వ్యక్తి జీవితంలో గొప్ప రోజులు రెండు. – మనం పుట్టిన రోజు మరియు పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు.
- ప్రియమైన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు
- నువ్వు ఎల్లప్పుడూ హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నీ నవ్వు మన ఇంట్లో సంతోషాన్ని నింపింది… నీ అడుగులు మన ఇంటికి లక్ష్మిని తీసుకొచ్చాయి. ఇంతటి ఆనందాన్ని మాలో నింపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నా తొలి నేస్తం అయిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నేను చిన్నప్పుడు ఏదైనా గొడవ పెట్టుకుని వస్తే, నువ్వు నన్ను వెనకేసుకొచ్చిన ప్రతి సందర్భం నాకు గుర్తే. అంతటి ప్రేమని నాపై చూపిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క.
- నా సోదరుడికి మరియు నా బెస్ట్ ఫ్రెండ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు తన ఆశీర్వాదాలతో, శ్రద్ధతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.
- నువ్వు నాకు మొదటిసారి తినిపించిన ఐస్ క్రీమ్ నాకు ఇంకా నోరూరెలా చేస్తుంది అంటే నమ్ము. నాకు నచ్చినవి ఏంటో తెలుసుకుని మరీ అవి నాకు కొనిచ్చే మా అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు.
- నా తమ్ముడి జీవితంలో నా తరువాతే ఎవరైనా! అంతటి ప్రేమ నాపై కురిపించే వాడికి జన్మదిన శుభాకాంక్షలు.
- నాన్నలేని లోటుని మన ఇంటికి ఎవరైనా తీర్చగలిగారు అని అంటే అది నువ్వే అన్నయ్య. మాకు ధైర్యాన్ని ఇచ్చిన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నీ రాక తో నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది. నా పైన అంతటి ప్రభావం చూపిన ప్రియసఖీ.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టి మా తల్లిదండ్రులకి కూతురు లేని లోటు తీర్చిన నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- నా జీవితంలోకి నువ్వు సరైన సమయంలో రావడంతో నేను మంచి నిర్ణయాలు తీసుకోగలిగాను అని నిర్మొహమాటంగా చెప్పగలను. అంతటి సమర్ధురాలైన నా భార్యకి జన్మదిన శుభాకాంక్షలు.
- నా ప్రాణస్నేహితుడినే జీవిత భాగస్వామిగా పొందగలిగే అదృష్టం కలిగించిన మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- నా జీవితభాగస్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
- ప్రియమైన శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
- నా ప్రియమయిన మిత్రునికి పుట్టినరోజు శుభాకాంక్షలు
- ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి పోటీ పెడితే అందులో సైతం బెస్ట్ ఫ్రెండ్ గా నిలిచే నీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
- జీవితంలో ధైర్యం అంటే ఏంటో నిన్ను చూసే నేర్చుకున్నా నాన్న. ధైర్యంగా బ్రతకడాన్ని పరిచయం చేసిన నాన్నా… మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
- ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది అన్నది ఎంత నిజమో ఒక మంచి స్నేహితుడు కూడా జీవితంలో ఎన్నో మంచి పాఠాలు నేర్పిస్తాడన్నది అంతే నిజం. అలాంటి నా స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
ఇవి కూడా చదవండి :-
- ప్రేమ కవితలు మీ అందరి కోసం
- కర్మ ఫలం Quotes మీ అందరి కోసం !
- ఒంటరితనం Quotes మీ అందరి కోసం !
- విజయం Quotes మీ అందరి కోసం !
- Emotional quotes మీ అందరి కోసం