బంగ్లాదేశ్: హిందూ ఆలయాలు, పూజా మండపాల మీద జరిగిన దాడులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?

బంగ్లాదేశ్‌లోని కుమిల్లాలో ఒక పూజా మండపంలో ఖురాన్‌ దొరకడంతో దాక, కుమిల్లా, ఫెనీ, కిషోర్‌గంజ్, చాంద్‌పూర్ సహా బంగ్లాదేశ్‌లోని ఎన్నో ప్రాంతాల్లో ఆలయాలు, పూజా మండపాలపై దాడులు జరిగాయి.

పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణలపై వివిధ జిల్లాల్లో ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో కొంతమంది పేర్లను నిందితులుగా చేర్చారు. కొన్ని వందల, వేల మంది గుర్తు తెలియని నిందితులుగా పేర్కొన్నారు. బుధవారం ప్రారంభమైన హింసాత్మక ఘర్షణల్లో ఇప్పటివరకూ ఆరుగురు మృతిచెందారు.

శుక్రవారం  కాకరయిల్‌లో పోలీసులతో ఘర్షణలకు దిగడంపై రమనా, పల్టన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 21 మంది నిందితుల పేర్లు చేర్చారు. మరో 4 వేల మందిని గుర్తు తెలియని నిందితులుగా చెప్పారు.

శుక్రవారం ప్రార్థనల తర్వాత వందల మంది బైతుల్ ముకరమ్ మసీదు నుంచి ర్యాలీగా వెళ్లారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. లాఠీ చార్జ్ తర్వాత టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

ప్రభుత్వ చర్యలకు అడ్డు తగలడం, పోలీసులపై దాడికి నిరసనకారులు అందరిపైనా కేసులు నమోదు చేశారు. రమనా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 10 మంది పేర్లు చేర్చిన పోలీసులు గుర్తు తెలియని మరో 1500 మందిని కూడా నిందితులుగా చెప్పారు.

శుక్రవారం ఘర్షణలు జరిగిన సమయంలో పోలీసులు అరెస్ట్ చేసిన 10 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్లు రమనా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మొనిరూల్ ఇస్లామ్ చెప్పారు. అదే రోజు పల్టన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 11 మంది పేర్లు ఉన్నాయి. ఇదే కేసులో గుర్తు తెలియని నిందితులుగా మరో 2500 మంది మరణించారు.

Leave a Comment