వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయే నీటి ప్రవాహం. ప్రపంచమంతటా వరదలు సంభవిస్తాయి, తుఫానులు విరిగిన కట్టలు లేదా ఆనకట్టలు, వేగంగా కరిగిపోతున్న మంచు. మంచు జామ్‌లు మరియు భారీ నెమ్మదిగా కదులుతున్న వర్షం లేదా పదేపదే వర్షాలు పడటం వలన వరదలకు కారణం అవుతాయి.
భారీ వర్షాల కారణంగా అస్సాం ని అతలకుతలం చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలోని అనేక జిల్లాలు వరదనీటిలో మునిగిపోయాయి దాదాపు 29 జిల్లాల్లో వరద ప్రభావం పూర్తిగా కనిపిస్తోంది. అస్సాం రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మే19 అర్ధరాత్రి వరకు వరదల ప్రభావం దాదాపుగా 7 లక్షల రూపాయలు17వేల మందిపై పడిందని ప్రకటించింది.
అటు వరదలతో మృతుల సంఖ్య 9వేలకు కి చేరినట్టు తెలిపింది. రాష్ట్రంలోని 1413 గ్రామాలు నీటమునిగినట్టు ఆ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వరదల ధాటికి నాగన్ జిల్లా పూర్తిగా దెబ్బతిన్నట్టు ప్రకటించింది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపుగా 3 లక్షల మంది వరకు నిరాశ్రయులైనట్టు తెలిపింది. అటు సచార్ జిల్లాలో లక్షా 20 వేల మంది, హోజయ్ లో లక్షా 7 వేల మంది వరద ప్రభావానికి గురయ్యారు.
భారీ వరదల నేపథ్యంలో అస్సాం లోఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అస్సాం రైఫిల్స్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు బాధితులను పునరావస కేంద్రాలకు తరలిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ సైతం రంగంలోకి దిగి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను మరింత స్పీడప్ చేస్తోంది.
వరదల నేపథ్యంలో అత్యవసరంగా భేటీ అయిన అస్సాం రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలవారిని అక్కడి నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించాలని నిర్ణయించింది. అందులోభాగంగా విమాన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
సిలిచర్, గౌహతి మధ్య మూడు వేల రూపాయలకే సర్వీసులు అందిస్తోంది. దిమా హసావో, బరాక్ వ్యాలీలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరోవైపు సచార్ జిల్లా యంత్రాంగం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఇవాళ్టి వరకు సెలవులు ప్రకటించింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇస్తున్నారు. అస్సాం రాష్ట్ర హౌజింగ్, పురపాలకశాఖ మంత్రి అశోక్ సింఘాల్ సచార్ జిల్లాలో పర్యటించారు. అధికారులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు.
ఈశాన్య ఫ్రంటీయర్ రైల్వే ముందస్తుగా పలు రైళ్లను రద్దు చేసింది. లంబ్డింగ్ బర్దార్ పూర్ మధ్య నడిచే అన్ని రైళ్లను బంద్ చేసింది. అటు త్రిపుర, మిజోరం, మణిపూర్ లకు వెళ్లే రైల్వే ట్రాక్ లు కూడా వరదలధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని రైల్వే సిబ్బంది మరమ్మతు చేస్తున్నారు.