హెల్మెట్ పెట్టుకున్నా జరినామా విధిస్తారు అంట, ఇది ఎక్కడ విచిత్రం, ఎవరు అయ్యిన హెల్మెట్ పెట్టుకోకుంటే జరినామా విధిస్తారు. ఎందుకు అంటే మన ప్రాణాలకి అపాయం కాకుండా రక్షణ కోసం, హెల్మెట్ ఉంటేనే మనిషికి రక్షణ, మనకి ఏమి అయిన ఈ హెల్మెట్ వలన మనకి మేలు కలుగుతుంది.
కానీ చాల మంది హెల్మెట్ ని చేతికి తగిలించుకొని పోతుంటారు మనం చూస్తుంటాం ఇలా చాల మందిని చూస్తాము, మరి కొంత హెల్మెట్ పెట్టుకొన్న వారు ఆ హెల్మెట్ కు ఉన్న క్లిబ్ సరిగ్గా పెట్టుకోరు ఇంకా అది పెట్టుకొంటే ఏమి పెట్టుకోకుంటే ఏమి? మనం చేసే పనులో కరెక్ట్ ఉండాలి,హెల్మెట్ మంచిగా పెటుకోవాలి. హెల్మెట్ పెట్టుకొన్న కూడా జరినామా వేస్తున్నారు ఆ సంగతి ఏంటో చూదం.
బైక్ లేదా స్కూటర్ నడిపే వారు హెల్మెట్ పెట్టుకొని ఉంటే కచ్చితంగా స్ట్రాప్‌ను లాక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు జస్ట్ హెల్మెట్‌ను స్ట్రాప్ లాక్ చేయకుండా పెట్టుకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ ఎగిరిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మరణించే అవకాశాలు కూడా ఉంటాయి.
అందుకే హెల్మెట్ పెట్టుకునేటప్పుడు కచ్చితంగా స్ట్రాప్‌ను లాక్ చేసుకోవాలి. అప్పుడు ప్రమాదం జరిగినా కూడా తలకు బలమైన గాయాలు తగలకుండా ఉంటాయి.
కొంత మంది వాహనదారులు హెల్మెట్‌ను చేతికి తగిలించుకొని వెళ్తుంటారు. కొంత మంది హెల్మెట్ పెట్టుకున్నా కూడా స్ట్రాప్ లాక్ చేసుకోరు. మరికొంత మంది హెల్మెన్‌ను బైక్ వెనకవైపు పెట్టుకుంటూ ఉంటారు. అందువల్ల ఇలాంటివి చేయకండి.