ప్రధాని మోడీ యూరప్ పర్యటన విజయవంతంగా కొనసాగింది !

ప్రధాని మోడీ మన దేశం ఒకటే బాగుండాలి అని అనుకోరు, మనదేశం తో పాటు ఇతర దేశాలు కూడా బాగుండాలి అని యూరప్ కి పర్యటన కు వెళ్ళినారు. ఈ మధ్య కాలంలో జరిగిన ఉక్రెయిన్ మరియు రష్యా పోటాపోటిగా యుధం సాగింది, అందులో చాలామంది సైనికుల ప్రాణాలు కోల్పోయినారు. అలాగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తో పాటుగా చాల మంది ప్రజల ప్రాణాలు కూడా విడిచారు. ఇలా చాల మంది ప్రాణాలు, వారి ఆస్తులు మొత్తం అన్ని పోగోటుకొన్నారు రెండు దేశాల ప్రజలు.

ప్రధాని మోడీ వెళ్ళిన పర్యటన ఎలా సాగిందో చూదం! మూడు యూరప్‌ దేశాల పర్యటనలో భాగంగా ఫ్రాన్స్‌లో ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌తో కలిసినారు, ప్రధాని నరేంద్ర మోదీ. భారత కాల మానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి వేళా కలవడం  జరిగింది.

ఈ సందర్భంగా మాక్రోన్‌తో భేటీని ఇద్దరు మిత్రుల కలయికగా అభివర్ణించారు ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం ఫ్రాన్స్‌లో అడుగుపెట్టిన ప్రధాని మోదీ. యూరప్ పర్యటనలో భాగంగా భారత ప్రధాని బుధవారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో భేటీ అయ్యారు.

ద్వైపాక్షిక అంశాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ద సంక్షోభం గురించి నేతలు చర్చించుకున్నట్లు పీఎంవో తెలిపింది. జర్మనీ, డెన్మార్క్ పర్యటనలు ముగించుకున్నతర్వాత మోదీ బుధవారం పారిస్ చేరుకున్నారు. ప్యారిస్‌లోని అధ్యక్ష అధికార భవనం ఎల్‌వైసీ ప్యాలెస్‌కి చేరుకున్నారు. అక్కడ వీళ్లద్దిరు కలవడం జరిగినది, ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు.

అలాగే మంగళవారం మాక్రోన్‌, పుతిన్‌ మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ పరిణామాలపై ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రోన్‌ మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీ సైతం ఉక్రెయిన్ యుధంవిజేతలంటూ ఎవరూ ఉండబోరని, పైగా పేద అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం చూపిస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 
ఈ విధంగా అందరు కలిసి వాళ్ళ బాధలు వాళ్ళ దేశం లో ఉండే ఇబందులు తెలుసుకొన్నారు. అన్ని సమావేశాలు పూర్తిచేసుకొని బుధవారం రాత్రి పారిస్ నుండి ఇండియా కి తిరిగి బయలుదేరినారు. ఈ విధంగా నరేంద్ర మోడీ పర్యటన కొనసాగింది.

Leave a Comment