‘ది విచర్ IV’ సిరితో Unreal Engine 5.6 టెక్ డెమో విడుదల: గేమింగ్‌లో కొత్త దశ

ఎపిక్ గేమ్స్ తన తాజా Unreal Engine 5.6ను విడుదల చేసింది, ఇది గేమ్ డెవలప్‌మెంట్‌లో విశేషమైన పురోగతిని సూచిస్తుంది.ఈ కొత్త వెర్షన్‌లో 60 FPS ఓపెన్ వరల్డ్‌లు,మెరుగైన క్యారెక్టర్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.ఈ ఫీచర్లను ప్రదర్శించడానికి ‘ది విచర్ IV’ టెక్ డెమోను CD Projekt Redతో కలిసి రూపొందించారు.

ఈ టెక్ డెమోలో సిరి,ప్రధాన పాత్రధారి, కొత్త ప్రాంతమైన కోవిర్‌లో అడుగుపెడుతుంది.ఆమె గుర్రం కెల్పీతో కలిసి పర్వతాలు,అరణ్యాలు,మరియు వాల్డ్రెస్ట్ అనే బిజీ పోర్ట్ టౌన్‌ను అన్వేషిస్తుంది.ఈ ప్రదర్శనలో Unreal Engine 5.6 యొక్క శక్తివంతమైన ఫీచర్లు,అందమైన గ్రాఫిక్స్,మరియు స్మూత్ గేమ్‌ప్లేను చూపించాయి.

ఈ టెక్ డెమో ప్లేస్టేషన్ 5లో 60 FPS వద్ద రే ట్రేసింగ్‌తో ప్రదర్శించబడింది,ఇది ఈ కొత్త ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని చూపిస్తుంది.అయితే, ఇది పూర్తి గేమ్ గేమ్‌ప్లే కాదు, కేవలం టెక్నికల్ డెమో మాత్రమే. ది విచర్ IV’ 2027 తర్వాత విడుదల కానుందని CD Projekt Red ప్రకటించింది

Leave a Comment