Nothing Phone 3 ఇండియాలో జూలై 1న వస్తోంది: ధర, ఫీచర్లు మీకోసం

నథింగ్ ఫోన్ 3 భారత మార్కెట్లో జూలై 1, 2025న విడుదల కానుంది.ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు ₹68,000, మరియు 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు ₹77,000గా ఉండే అవకాశం ఉంది.

ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌తో శక్తివంతమైన పనితీరును అందించనుంది.6.77 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే,120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లతో వస్తుంది.కెమెరా విభాగంలో,50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ మరియు 32MP ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.బ్యాటరీ సామర్థ్యం 5,000mAhగా ఉండి, 50W వైర్డ్ మరియు 20W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వనుంది

నథింగ్ ఫోన్ 3లో సిగ్నేచర్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్‌ను తొలగించి,కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టనున్నారు. ది బ్లాక్ మరియు వైట్ కలర్ ఆప్షన్లలో లభించనుంది.

ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా భారతదేశంలో విక్రయించబడనుంది.ప్రీమియం ఫీచర్లు మరియు డిజైన్‌తో, నథింగ్ ఫోన్ 3 మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించనుంది.

Leave a Comment