AI భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుంది, విద్యార్థులు STEM నేర్చుకోవాలి: గూగుల్‌ డీప్‌మైండ్‌ సీఈవో

గూగుల్‌ డీప్‌మైండ్‌ సీఈవో డెమిస్ హసాబిస్ తాజా ప్రకటనలో ఎయ్‌ (కృత్రిమ మేధస్సు) భవిష్యత్తుపై ఆశాజనక అభిప్రాయాలు వెల్లడించారు. “AI వల్ల ఎన్నో కొత్త, విలువైన ఉద్యోగాలు ఏర్పడతాయి. అయితే యువత STEM (సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌) రంగాల్లో చదువుకోవడం చాలా అవసరం,”అని హసాబిస్‌ పేర్కొన్నారు.

విభిన్న పరిశ్రమల్లో AI వృద్ధి చెందుతోందనీ,ఇందులో తగిన శిక్షణతో వ్యక్తులు అసాధారణమైన అవకాశాలు పొందగలరని ఆయన అభిప్రాయపడ్డారు.”కేవలం మానవ శ్రమను బదిలీ చేయడమే కాకుండా,మన సామర్థ్యాలను అభివృద్ధి చేసే అవకాశాలను AI తీసుకురాబోతుంది,”అన్నారు.

AI రంగంలో జరుగుతున్న మార్పుల కారణంగా అనేక సాంప్రదాయ ఉద్యోగాలు మారిపోతున్నాయి.కానీ,అదే సమయంలో కొత్త టెక్నాలజీకి అనుగుణంగా ఉండే ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతోంది.వీటిలో డేటా సైన్స్‌, మిషన్ లెర్నింగ్‌, AI మోడలింగ్‌,అల్గోరిథం డిజైన్‌ వంటి రంగాలు ప్రముఖంగా ఉన్నాయి.

హసాబిస్‌ చెప్పినట్టు, భవిష్యత్తులో విజయవంతమైన కెరీర్‌ కోసం యువత ఇప్పటికే సిద్ధమవ్వాలి.ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు STEM విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.

ఈ వ్యాఖ్యలు, AI పట్ల ఉన్న భయాలను తొలగించడమే కాకుండా,భవిష్యత్‌ అవకాశాలను కూడా గుర్తుచేస్తున్నాయి.ప్రగతిశీల ప్రపంచంలో ఉన్నత విద్య,సాంకేతికతతో మిళితమైన నైపుణ్యమే మనకు మార్గం చూపుతుంది.

Leave a Comment