జూన్ 1 నుంచి పాత ఐఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు! కొత్త అప్డేట్ సమాచారం

ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించబడే మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్ తాజాగా కీలక ప్రకటన చేసింది. జూన్ 1, 2025 నుంచి పాత మోడల్ ఐఫోన్‌లకు వాట్సాప్ సపోర్ట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించింది.ముఖ్యంగా iOS 12 లేదా అంతకంటే పాత వెర్షన్ నడిచే ఐఫోన్‌లపై ఇది ప్రభావం చూపనుంది.

వాట్సాప్ ప్రతినిధుల ప్రకారం,టెక్నాలజీ, సెక్యూరిటీ అప్‌డేట్స్ మెరుగుపరచాలంటే,ఆధునిక ఆపరేటింగ్ సిస్టమ్ అవసరం.అందుకే పాత వెర్షన్‌లకు సపోర్ట్ కొనసాగించడం సాధ్యపడడం లేదు. దీని ప్రభావం ప్రధానంగా iPhone 5,iPhone 5C వంటి పాత మోడల్స్ పై పడనుంది.

ఈ మార్పుల వల్ల, జూన్ 1 తర్వాత పాత iPhones లో వాట్సాప్ పనిచేయదు.పాత చాట్స్ బ్యాకప్ చేసుకోవాలి,కొత్త ఫోన్ లేదా iOS అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.తమ డేటా మిస్ అవ్వకుండా ఉండేందుకు వినియోగదారులు ముందుగానే చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.

ఇది తొలిసారి కాదు వాట్సాప్ తరచూ పాత Android మరియు iOS డివైసులకు సపోర్ట్ నిలిపివేస్తోంది.వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని,ఇది ఒక సాధారణ ప్రక్రియగా కంపెనీ పేర్కొంది.

Leave a Comment